Drugs Usage in Colleges in Hyderabad : రాష్ట్ర రాజధానిలో నాలుగు ప్రముఖ విద్యాసంస్థలపై యాంటీ నార్కోటిక్ పోలీసులు దృష్టి సారించారు. ఆయా విద్యాసంస్థల్లో అనేక మంది విద్యార్ధులు మత్తు పదార్ధాలకు అలవాటవుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంలో విద్యాసంస్థల యాజమాన్యాలకు తల్లిదండ్రులకు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు.
మాదకద్రవ్యాలు, గంజాయి వంటి మత్తు పదార్ధాల ఉచ్ఛులో విద్యార్ధులు చిక్కుకుంటున్నారు. ఒత్తిడి తగ్గించుకోవడానికో, సరదాకో వీటి బారిన పడి తమ బంగారు భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారు. ఇటీవల పోలీసుల దాడుల్లో ఈ విషయం బయటపడింది. షాద్‌నగర్ సమీపంలోని ప్రముఖ విద్యాసంస్థలో వేలాది మంది విద్యార్ధులు చదువుతున్నారు. ఇందులో ఎక్కువగా ఉన్నత కుటుంబాల నుంచి వచ్చినవారే, వీరిలో 40శాతం మంది మత్తుపదారాలకు అలవాటుపడినట్టు తాజా తనిఖీల్లో బయటపడింది.
Drugs Supply in Hyderabad Colleges : తాజాగా ప్రభుత్వ వైద్యకళాశాలలో జూనియర్ డాక్టర్లు గంజాయి మత్తులో జోగుతున్న ఘటన సంచలనం సృష్టించింది. ధూల్‌పేట్‌లో గంజాయి ప్యాకెట్లు కొనుగోలు చేసేందుకు వెళ్లి పట్టుబడిన 2400 మందికి ఎక్సైజ్ పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. పోలీసులకు పట్టుబడివారిలో 1500 మంది ఇంటర్ నుంచి పీజీ చదువుతున్న విద్యారులే ఉన్నారు.
మాదకద్రవ్య రహిత రాష్ట్రంగా మార్చేందుకు పోలీసు యంత్రాంగం మత్తుముఠాలపై ఉక్కు పాదం మోపుతున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ మొదలు నానక్‌రామ్‌గూడ ఐటీ సెక్టార్ వరకు మత్తులో జోగుతున్న యువతను చూసి పోలీసులే ఆశ్చర్యపోతున్నారు. తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో తాజా దాడుల్లో సంచలనం కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఆమెకు డ్రగ్స్ అలవాటు ఉంది - అందుకే వదిలేశా : రాజ్‌తరుణ్ - Police Case on Hero Raj Tharun
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నాలుగు ప్రముఖ విద్యాసంసల్లో చదువుతున్న వందలాది మంది విద్యారులు మత్తు ఉచ్చులో చిక్కి విలవిల్లాడుతున్నట్టు పోలీసులు నిర్దారించారు. విద్యారులపై పర్యవేక్షణ లోపం, యాంటీడ్రగ్ కమిటీలు ఏర్పాటు చేయకపోవటం గుర్తించిన టీజీన్యాబ్ డైరెక్టర్ సందీప్‌శాండిల్య ప్రముఖ విద్యాసంస్థ ఛైర్మన్‌ను మందలించినట్టు సమాచారం. మరోసారి ఆ క్యాంపస్‌లో మత్తు వాడుతున్నట్టు గుర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించినట్టు తెలుస్తోంది.
నగరం, శివారు ప్రాంతాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలున్న విశ్వవిద్యాలయాల్లో దేశవిదేశాలకు చెందిన లక్షలాది మంది విద్యారులు విద్యనభ్యసిస్తున్నారు. అనుభవం ఉన్న బోధనా నిపుణులు, అద్భుతమైన సంరక్షణ ఉందని ధీమాగా ఉన్న తల్లిదండ్రులు ఉలిక్కిపడే ఘటనలు వెలుగులోకి వస్తుండటంతో షాక్ అవుతున్నారు.
శివారులోని నాలుగు విద్యాసంసల్లో చదువుతున్న విద్యార్ధులు గంజాయి, కొకైన్, ఓజీ, ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్ తీసుకుంటున్నట్టు టీజీన్యాబ్ తనిఖీల్లో వెలుగు చూశాయి. ఎత్తయిన గోడలు బయటి వ్యక్తులు లోపలకు వెళ్లకుండా పటిష్ఠమైన భద్రత ఉన్న ఆ ప్రాంగణాల్లోకి మత్తు పదార్ధాలు చేరుతున్నాయి. విద్యార్ధులు ధూల్‌పేట్, నానక్‌రామ్‌గూడ, శంషాబాద్, బంజారాహిల్స్ తదితర ప్రాంతాల్లోని పెడ్లర్స్ నుంచి కావాల్సిన డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నారు. హాస్టల్ గదుల్లోకి మత్తుపదార్ధాలను తీసుకెళ్లి అక్కడే స్నేహితుల మధ్య సేవిస్తున్నారు.
హాస్టల్‌లో విద్యారులను పర్యవేక్షించాల్సిన వార్డెన్‌లు రాత్రి 9 కాగానే ఇళ్లకు చేరుతున్నారు. ప్రైవేటు భద్రతా సిబ్బందికి కాసులు ఎరవేసి విద్యారులు బయటకొచ్చి పని ముగించుకొని గదులకు చేరుతున్నట్టు పోలీసులు గుర్తించారు. శామీర్‌పేట్‌లోని ఒక విద్యాసంసలో పరిస్ధితి చేయిదాటిందని, అక్కడ ప్రతి 10 మంది విద్యారుల్లో ఇద్దరు మత్తు పదార్ధాలు తీసుకుంటున్నట్టు బయటపడినట్టు సమాచారం. మాదకద్రవ్య రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడానికి పోలీసులు అనేక చర్యలు చేపడుతున్నారు. అయితే, ఈ విషయంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని టీజీ న్యాబ్ పోలీసులు కోరుతున్నారు.