Police Arrested Two Cyber Criminals From Kerala : పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు సైబర్ నేరగాళ్లను అరెస్టు చేసినట్లు సైబర్ క్రైమ్ డీసీపీ కవిత తెలిపారు. వీరిరువురు కలిసి దేశవ్యాప్తంగా రూ.20 కోట్లు కాజేసినట్లు తెలిపారు. కేరళకు చెందిన ఇద్దరు సైబర్ నేరగాళ్లు, కాజేసిన సొమ్మును క్రిప్టో రూపంలో మార్చి చైనాకు తరలిస్తున్నట్లు డీసీపీ వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి 5 మొబైల్ ఫోన్లు, చెక్‌బుక్‌లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. మోసపూరిత మాటలు చెప్పి అమాయకపు ప్రజలను మోసం చేస్తున్నారన్న డీసీపీ, గుర్తు తెలియని ఖాతాల్లో పెట్టుబడులు పెట్టి ప్రజలు మోసపోవద్దని సూచించారు.
"సైబర్ క్రైమ్ పోలీస్, హైదరాబాద్ సిటీ రెండు కేసుల్లో నిందితులను అరెస్ట్ చేశాం. అందులో ఒకటి పెట్టుబడుల మోసం కేసు. దీనిలో ఇద్దరు నిందితులను కేరళ నుంచి పట్టుకొచ్చారు. ఈ నిందితులు తెలివిగా వీపీఎన్ ఉపయోగిస్తూ, మనం వెంబడించకుండా, పోలీసులకు దొరకకుండా వెళ్లాలనే అవగాహన వీరికి ఉంది. అందువల్ల అన్ని రకాల టెక్నిక్స్ ఉపయోగించి లొకేట్ కాకుండా జాగ్రత్త పడ్డారు." -కవిత, సైబర్ క్రైమ్ డీసీపీ