Police Remand Four Accused : బెంగుళూరు నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి నగరంలో విక్రయిస్తున్న నలుగురు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను అమీర్‌పేట్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి 6.65 గ్రాముల ఎండీ ఎమ్ఏ డ్రగ్స్, 2.27 గ్రాముల గంజాయి, 8.57 గ్రాముల హ్యష్ ఆయిల్‌తో పాటు ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం కేరళకు చెందిన సంజయ్, శ్రీజిత్, ఆదర్శ్ అనే వ్యక్తులు ఎస్ఆర్ నగర్‌లోని కార్ఫ్ 1 గ్లోబల్ సొల్యూషన్ అనే సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. వీరంతా కలిసి ఆఫీస్‌కు సమీపంలోనే ఓ బాయ్స్ హాస్టల్లో నివాసం ఉంటున్నారు.
వీరితో హైదరాబాద్‌లోని న్యూబోయిన్‌పల్లికి చెందిన అజయ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. వీరంతా డ్రగ్స్‌కు బానిసలు అయ్యారు. సులువుగా డబ్బు సంపాదించేందుకు డ్రగ్స్ వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నారు. దీని ప్రకారమే హైదరాబాద్‌లో డ్రగ్స్‌ను విక్రయించాలని పక్కా పథకం వేశారు. బెంగళూరు నుంచి శ్రీజిత్, ఆదర్శ్, సంజయ్ డ్రగ్స్‌ను నగరంలోకి గుట్టుచప్పుడు కాకుండా తీసుకువస్తున్నారు.
గుట్టుచప్పుడు కాకుండా నగరంలోకి : బోయిన్‌పల్లికి చెందిన అజయ్ దానిని అమ్మి పెడుతున్నాడు. విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు మంగళవారం (డిసెంబర్ 11న) నిందితులను ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ దాడుల్లో సబ్ ఇన్స్పెక్టర్లు రాధ, బాలరాజు, బిక్షారెడ్డి పాల్గొన్నారు.
ఉక్కుపాదం దిశగా : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి డ్రగ్స రహిత రాష్ట్రంగా మార్చే ప్రక్రియకు బాటలు వేస్తున్నారు. ఇందులో భాగంగానే డ్రగ్స్, గంజాయి కోనుగోలు, అమ్మకాలకు పాల్పడుతున్న వారిని ఉక్కుపాదంతో అణచి వేయాలని పోలీసు ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు. అదేవిధంగా ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. సినీ తారలను ఈ మధ్యే డ్రగ్స్‌పై అవగాహన కొరకు ఓ షార్ట్ ఫిల్మ్ తీసి ప్రభుత్వం చేసే కార్యక్రమంలో భాగం కావాలని కోరారు. దీనిపై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్ డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై వేరు వేరు వీడియోలను తీసి విడుదల చేశారు.
అల్ఫాజోలం కొకైన్ కంటే ప్రమాదకరం - అక్రమంగా విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు : సందీప్ శాండిల్య
మత్తు పదార్థాలకు కేరాఫ్‌గా మారుతోన్న పబ్బులు - దారికి తెచ్చేందుకు పోలీసుల వరుస దాడులు - TG NAB POLICE RAIDS IN PUBS