ETV Bharat / state

వచ్చేనెలలో రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటన - షెడ్యూల్ ఇదే - PM Modi TS Tour in March 2024

PM Modi Telangana Tour in March 2024 : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి రాష్ట్రంలో పర్యటించనున్నారు. వచ్చేనెల 4,5వ తేదీల్లో తెలంగాణకు రానున్నారు. రెండ్రోజుల పర్యటనలో ఆయన ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో పర్యటిస్తారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం రెండ్రోజులు రెండు జిల్లాల్లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభల్లో పాల్గొని మోదీ ప్రసంగిస్తారు.

PM Modi
PM Modi
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 28, 2024, 12:27 PM IST

Updated : Feb 28, 2024, 6:00 PM IST

PM Modi Telangana Tour in March 2024 : పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణ సమాయత్తమవుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు కొన్ని స్థానాలకు దాదాపుగా ఎంపీ అభ్యర్థులను ఖరారు చేశాయి. మరోవైపు మిగతా అభ్యర్థుల కోసం కసరత్తు సాగుతోంది. ఇప్పటికే బీజేపీ కొన్ని సిట్టింగ్ స్థానాలకు సీట్లు ఖరారు చేసింది. మరోవైపు లోక్​సభ ఎన్నికల ప్రచారం కూడా షురూ చేసింది. ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ నినాదంతో రాష్ట్రంలో విజయ సంకల్ప యాత్రలు చేస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 17 సీట్లు గెలవడమే లక్ష్యంగా ప్రచారంలో జోరు సాగిస్తోంది.

మోదీ మరో డేరింగ్​ స్టంట్​- సముద్ర గర్భంలోకి వెళ్లి శ్రీ కృష్ణుడికి పూజలు

PM Modi Telangana Tour Schedule : ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi Telangana Visit) రాష్ట్రంలో పర్యటించనున్నారు. మార్చి 4,5 తేదీల్లో తెలంగాణలో పర్యటించనున్న మోదీ ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం పలు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు ఆదిలాబాద్​లో బహిరంగ సభలో పాల్గొననున్నారు. మోదీ పర్యటనతో మార్చి 4వ తేదీన రాష్ట్రంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన రద్దయింది.

ప్రధాని మోదీ తెలంగాణ షెడ్యూల్ ఇదే :

  • మార్చి 4న ఆదిలాబాద్‌లో పర్యటించనున్న ప్రధాని మోదీ
  • ఆదిలాబాద్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్న మోదీ
  • అదే రోజున ఆదిలాబాద్‌ బహిరంగ సభలో పాల్గొననున్న ప్రధాని మోదీ
  • అనంతరం రాజ్‌భవన్‌లో బస చేయనున్న ప్రధాని మోదీ
  • మార్చి 5న సంగారెడ్డిలో పర్యటించనున్న ప్రధాని మోదీ
  • సంగారెడ్డిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనల అనంతరం బహిరంగసభలో మోదీ ప్రసంగం

Telangana Bjp Vijaya Sankalpa Yatra : మరోవైపు రాష్ట్రంలో బీజేపీ విజయ సంకల్ప యాత్రలు (Bjp Vijaya Sankalpa Yatra) జోరుగా సాగుతున్నాయి. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలతో పాటు కాంగ్రెస్‌ కుంభకోణాలు, బీఆర్ఎస్ వైఫల్యాలను బీజేపీ నాయకులు ప్రజలకు తెలియజేస్తున్నారు. 17 పార్లమెంట్ నియోజకవర్గాలు, 114 అసెంబ్లీ సెగ్మెంట్లలో 5,500 కిలోమీటర్ల మేర యాత్రలు సాగనున్నాయి 106 సమావేశాలు, 102 రోడ్‌ షోలు ఇతర కార్యక్రమాలు ఉండనున్నాయి. మార్చి 2న ఇవి ముగియనున్నాయి. ఈ యాత్రల ముగింపు సభకు ప్రధాని మోదీ రానున్నారని బీజేపీ వర్గాలు తెలిపాయి. కానీ అనివార్య కారణాల వల్ల ప్రధాని పర్యటన రద్దయి మార్చి 4,5వ తేదీల్లో టూర్ ఖరారైంది.

గత ప్రభుత్వాలేవీ వందే భారత్ రైళ్ల గురించి ఆలోచించలేదు : మోదీ

ప్రజల సలహాల నుంచే మేనిఫెస్టో- మోదీ అభివృద్ధిని చాటేలా బీజేపీ ప్రచారం​

Last Updated : Feb 28, 2024, 6:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.