ETV Bharat / state

తప్పుచేశాం సార్, క్షమించి డ్యూటీలోకి తీసుకోండి - ఆర్టీసీ ఎండీకి విజ్ఞప్తి

తమను విధుల్లోకి తీసుకోవాలని కోరిన డిస్మిస్​, సస్పెండెడ్​ ఆర్టీసీ ఉద్యోగులు - చిన్న చిన్న తప్పులకు పెద్ద శిక్ష భరించలేకపోతున్నామని ఆవేదన

TGS RTC EMPLOYEES SUSPENDED
SUSPENDED RTC EMPLOYEES REQUEST (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 21 hours ago

TGSRTC Suspended Employees: సార్ తప్పు చేశాం క్షమించండి. మా కుటుంబం దీనావస్థలో ఉంది. ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. తిరిగి ఉద్యోగంలోకి తీసుకోండి ప్లీజ్..! అంటూ ఆర్టీసీలో రిమూవల్, సస్పెండ్ అయిన ఉద్యోగులు సీఎం రేవంత్ రెడ్డి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్​లను వేడుకుంటున్నారు. తెలియకుండా తప్పులు జరిగాయి. అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. చిన్న చిన్న కారణాలతో తమను ఉద్యోగం నుంచి శాశ్వతంగా తప్పించారని కన్నీరుమున్నీరవుతున్నారు. ఉద్యోగం పోయిన తరువాత కుటుంబ పోషణ భారమైందని, ఆస్పత్రి ఖర్చులకూ పైసలు లేని దుస్థితిలో ఉన్నామని బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. తమను తిరిగి ఉద్యోగాల్లో చేర్చుకుని దీనావస్థకు చేరిన కుటుంబాలకు అండగా నిలవాలని ఉద్యోగం కోల్పోయిన, సస్పెండైన ఆర్టీసీ ఉద్యోగులు కోరుతున్నారు.

బస్సు నడిపేవారు లారీ ఎక్కుతూ : రాష్ట్రంలో సస్పెండైన లేదా తొలగించబడిన ఉద్యోగులు ఆర్టీసీ అధికారులు, కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. తిరిగి తమకు ఉద్యోగం కల్పించాలని వేడుకుంటున్నారు. పొరపాటునో ఏమరుపాటునో తప్పు జరిగిపోయిందని పాశ్చత్తాప పడుతున్నామని, మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నారు. ఇందుకోసం ఆయా డిపోలు, బస్‌ భవన్‌తో పాటు ఆర్టీసీ ఎండీ కార్యాలయం చుటూ తిరుగుతూ తిరిగి విధుల్లో చేర్చుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తమ కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయని, బస్సు నడిపే తన భర్త లారీ నడుపుతున్నారని ఓ డ్రైవర్ భార్య కన్నీళ్లు పెట్టుకుంది.

తాను ఉద్యోగం నుంచి రిమూవల్ అయ్యానని ఇప్పుడు ఒంటరిగా జీవిస్తున్నానని, తాను తన పిల్లలు ఆర్థికంగా చితికిపోయామని ఓ కండక్టర్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఉద్యోగం కోల్పోవడం వల్ల తన భార్య మంచాన పడిందని ఓ డ్రైవర్ వాపోయాడు. ఒకే ఒక్క అవకాశం కల్పిస్తే తిరిగి తాము తమ ఉద్యోగం చక్కగా చేసుకుంటామని రిమూవల్ అయిన ఉద్యోగులు యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

బాధితుల కన్నీళ్లు : ఐదారేళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నాలుగైదు వందల మంది వివిధ కారణాలతో ఉద్యోగాలు కోల్పోయారు. విధుల నుంచి సస్పెండ్ చేయడం లేదంటే శాశ్వతంగా తొలగించడం జరిగింది. మద్యం తాగి వాహనం నడపడం, ప్రమాదాలకు కారణం కావడం వంటి కారణాలతో సస్పెండ్‌ లేదా రిమూవల్‌ అయ్యారు. అయితే పొరపాటునో లేదంటే ఏమరుపాటునో తప్పు జరిగిందని కావాలని చేయలేదని బాధితులు కన్నీళ్ల పర్యంతం అవుతున్నారు.

సీఎం రేవంత్​ రెడ్డి, ఎండీ సజ్జనార్​లకు విజ్ఞప్తి : ఉద్యోగాలు కోల్పోయిన, సస్పెండైన బాధిత కుటుంబాలు దీనస్థితిలో ఉన్నామంటూ వేడుకుంటున్నారు. ఒక్కసారి అవకాశం ఇస్తే తప్పును సరిదిద్దుకుంటామని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆర్టీసీలో పనిచేస్తూ రిమూవల్ కు గురైన సిబ్బంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్​లను వేడుకుంటున్నారు.

తెలంగాణ ఆర్టీసీలో 3035 ఉద్యోగాలకు గ్రీన్​సిగ్నల్ - ఏ డిపార్ట్​మెంట్​లో ఎన్ని పోస్టులంటే? - TELANGANA RTC JOB NOTIFICATION 2024

రైట్​ రైట్​ : వైరల్ వీడియో మంత్రికి నచ్చింది - పోయిన ఉద్యోగం తిరిగొచ్చింది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.