ETV Bharat / state

ఈ మాస్టారు పాఠం చెబితే రాళ్లయైన కరగాల్సిందే - కలాం డ్రీమ్ ఫోర్స్ ఫౌండేషన్‌తో పిల్లలకు చేయూత - physics Teacher Sridhar teaching

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 5, 2024, 7:16 AM IST

Physics Teacher Nobel Prize Story : తల్లిదండ్రుల తర్వాత అత్యంత సమయం పిల్లలతో కేటాయించేది గురువులు మాత్రమే. పాఠశాలలో పనిచేసేది 8 గంటలే కానీ ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు మాత్రం విరామం దొరికితే చాలు విద్యార్ధుల కోసం ఏదో చేయాలని తపిస్తూ ఉంటాడు. వృత్తిపరంగానే కాదు వ్యక్తిగత జీవితంలోనూ సింహభాగం పేదవిద్యార్ధుల కోసమే పరితపిస్తారు. 2040 నాటికి సైన్స్ రంగంలో నోబుల్ బహుమతి అందుకునే స్థాయిలో ఒక్క శాస్త్రవేత్తనైనా తయారు చేయాలన్నది ఆయన అంతిమ లక్ష్యం.

Physics Teacher Nobel Prize Story
Physics Teacher Nobel Prize Story (ETV Bharat)

Mahabubnagar Teacher Sridhar Story : మహబూబ్​నగర్​ జిల్లా నవాబుపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా శ్రీధర్​ విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన పాఠం చెప్పాడంటే సైన్స్​ అంటే ఇష్టపడని విద్యార్థులు కూడా ఆ పాఠ్యాంశం పట్ల ఆసక్తిని పెంచుకుంటారు. కేవలం బోర్డు మీద పాఠాలు చెప్పడమే కాకుండా విషయం ఏదైనా సరే మన చుట్టూ జరిగే నిత్య ఘటనల ఆధారంగా, ప్రయోగాత్మకంగా వివరిస్తారు. అందుకే శ్రీధర్​ సార్​ చెప్పే సైన్స్​ అంటే విద్యార్థులు ఎంతగానో ఇష్టపడతారని చెబుతున్నారు ఆయన తోటి ఉపాధ్యాయులు.

విద్యార్థుల కోసం చేపట్టిన వివిధ కార్యక్రమాలకు ఉపాధ్యాయుడు శ్రీధర్​ ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు. జాయ్​ ఫుల్​ లర్నింగ్​ విత్​ సెల్ఫ్​ కలెక్టెడ్​ మెటీరియల్​ పేరుతో ఆయన చేసిన పరిశోధనకు 2018లో నేషనల్​ టీచర్స్​ సైన్స్​ కాంగ్రెస్​ జాతీయస్థాయి అవార్డు ఇచ్చింది. ఆయన ఆధ్వర్యంలో విద్యార్థులు చేసిన వినూత్న ప్రయోగాలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. అంతేకాదు 2017,2018,2019, 2022లో విద్యార్ధులు చేసిన ఆవిష్కరణలు. అంతర్జాతీయ సైన్స్ ఉత్సవాలకు ఎంపికయ్యాయి.

కొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టాలన్నదే సంకల్పం : విద్యార్థులు అన్ని రకాల ప్రయోగాలు చేసుకోవడానికి సుమారు రూ.12 లక్షల సొంత డబ్బును వెచ్చించి ఆయన ఇంటిపై ఏపీజే అబ్దుల్ కలాం పేరిట సైన్స్ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. అంతిమంగా విద్యార్థులు అక్కడ ప్రయోగాలు చేయాలి. తద్వారా సైన్స్​ ఎంతో కొంత నేర్చుకోవాలి. కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలనేదే ఆయన సంకల్పం. దాతల సహకారంతో సైన్స్‌పై శిబిరాలు నిర్వహిస్తూ NIN, IICT, NGRI, RCI, CCMB, బిర్లా సైన్స్ సెంటర్, షార్ లాంటి ప్రతిష్ఠాత్మక సంస్థలకు పిల్లలను సందర్శనకు తీసుకెళ్తారు. ఆరుసార్లు ఉత్తర భారత విద్యా యాత్రలు నిర్వహించి రాష్ట్రపతిని కలిసే అవకాశాన్ని కల్పించారు.

శ్రీధర్​ సార్​ పురస్కారాలు : శ్రీధర్ సేవలకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎన్నో పురస్కారాలు దక్కాయి. 2022లో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయునిగా రాష్ట్రపతితో పురస్కారం అందుకున్నారు. జాతీయ స్థాయి సైన్స్ టెక్నో ఫెస్టివల్​లో రజిత పథకం అందుకున్నారు. ఆయన వినూత్న బోధన పద్ధతులకు సైన్స్ అకాడమీ, టెక్ మహీంద్ర ఫౌండేషన్ ట్రాన్స్ ఫార్మింగ్ ఎడ్యుకేటర్ అవార్డునిచ్చింది. 2017లో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డునిచ్చి సత్కరించింది. ఇస్రో నుంచి 2011లో స్పెషల్ జ్యూరీ అవార్డును శ్రీధర్​ సొంతం చేసుకున్నారు. ఉత్తమ ఉపాధ్యాయ ఇన్నోవేటర్ అవార్డు, ఇలా ఎన్నో పురస్కారాలు ఆయన సొంతమయ్యాయి.

కలాం డ్రీమ్​ ఫోర్స్​ ఫౌండేషన్​ ఏర్పాటు : 2005లో సైన్స్ పట్ల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఆసక్తిని పెంచేందుకు పిల్లలమర్రి సైన్స్ ఫోరం పేరుతో స్వచ్ఛంద సంస్థను నెలకొల్పారు. పిల్లలను ఉత్తమ పౌరులుగా మార్చి దేశానికి అందించాలన్న ఉద్దేశంతో శ్రీధర్, కలాం డ్రీమ్ ఫోర్స్ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశారు. అంటే కలాం కలులుగన్న సైన్యాన్ని దేశానికి అందించడం ఈ సంస్థ లక్ష్యం. నేటితరం పిల్లలు పుస్తకాలు బట్టిపట్టి చదవకుండా స్వతహాగా ప్రయోగాత్మకంగా 8 నుంచి 10వ తరగతి వరకూ విద్యను నేర్చుకుంటే ఏ ఐఐటీ ఫౌండేషన్ కోర్సులూ అక్కరలేదని సూచిస్తున్నారు.

పంతులమ్మ వెరైటీ వెడ్డింగ్ ఇన్విటేషన్​ - మల్టిపుల్ ఛాయిస్, సింగిల్ ఆన్సర్ ప్రశ్నలతో మెదడుకు మేత - TEACHER WEDDING INVITATION

BEST TEACHER: బొమ్మల టీచరమ్మ.. బోధిస్తే భలే అర్థమవుతుంది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.