People Concerned Railway Line in Adilabad District : ఆదిలాబాద్ నుంచి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వెళ్లాలంటే రోడ్డు మార్గమైతే 350 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంది. అదే రైలు మార్గమైతే 500 కిలో మీటర్లు ప్రయాణించాల్సి ఉంది. రోడ్డు మార్గంలో వెళ్లాలంటే నిర్మల్-ఆర్మూర్, కామారెడ్డి మీదుగా హైదరాబాద్ చేరుకునేలా 44 నంబర్ జాతీయ రహదారి ఉంది. రైలు మార్గంలో వెళ్లాలంటే ఆదిలాబాద్ నుంచి మహారాష్ట్రలోని కిన్వట్, ముథ్కేడ్‌కు వెళ్లి, తిరిగి నిజామాబాద్ మీదుగా దాదాపుగా 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోంది.
No Trains For Adilabad : సరుకుల రవాణాకు మార్గం లేదు.. అధికారుల నిర్లక్ష్యమే రైతుల పాలిట శాపం
కేంద్రం నిర్ణయాన్ని తప్పుబడుతున్న రైల్వే లైన్ సాధన కమిటీ : రైలు మార్గం ద్వారా దూర భారాన్ని తగ్గించాలంటే హైదరాబాద్ నుంచి ఆర్మూర్ వరకు ఉన్న రైలు మార్గానికి (Railway Line in Adilabad) ఆదిలాబాద్ మార్గాన్ని అనుసంధించాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. దీంట్లో భాగంగానే బీజేపీ మినహా మిగిలిన పార్టీలతో ఏర్పడిన సాధన కమిటీ ఆందోళన బాట పట్టింది. ఉద్యోగ, ప్రజా సంఘాల బాధ్యుల ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆదిలాబాద్-పటాన్‌చెరు రైల్వే లైన్ పేరిట రూ.5700 కోట్లు కేటాయించడాన్ని రైల్వే లైన్ సాధన కమిటీ తప్పుపడుతోంది.
"ఆదిలాబాద్- పటాన్‌చెరు రైల్వే లైన్ పేరిట రూ.5700 కోట్లు కేటాయించారు. దానికి అన్న తక్కువ ఖర్చులో ఆదిలాబాద్-ఆర్మూర్‌కు లైన్ వేయవచ్చు. నిజామాబాద్ నుంచి పెద్దపల్లికి రైలు ఉంది. పెర్కెట్ వరకు రైల్వే లైన్ ఉంది. దాని గుండా రైలు మార్గం వేస్తే ఆదిలాబాద్ వారికి మేలు జరుగుతుంది. ఉత్తరాది రాష్ట్రాలకు మేలు కలుగుతుంది." -సంద అశోక్, టీఎన్‌జీవో, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు
"హైదరాబాద్‌కు వెళ్లాలంటే రైలు ప్రయాణం 12 గంటలకు పైగా పడుతోంది. సికింద్రాబాద్ నుంచి ఆర్మూర్‌కు రైల్వే లైన్ ఉంది. ఆర్మూర్ నుంచి ఆదిలాబాద్‌కు రైల్వే లైన్ వేయాలని కోరుతున్నాం. తద్వారా బడ్జెట్ కూడా తగ్గుతుంది. శీతకాల సమావేశాల్లో కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్‌లో రైల్వే లైన్ మంజూరు కోసం నిధులు విడుదల చేయాలని కోరుతున్నాం." - బండి దేవిదాస్, కాంగ్రెస్ నేత
Adilabad People demand Railway Line : పటాన్‌చెరు నుంచి ఆర్మూర్ వరకు ఎలాగూ లైన్ ఉన్నందున, ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ మధ్యన కేవలం 110 కిలోమీటర్ల రైల్వే లైన్ అనుసంధానించాల్సి ఉందని రైల్వే లైన్ సాధన సమితి నాయకులు చెబుతున్నారు. 500 కిలోమీటర్ల దూరంలో ఉండే పటాన్‌చెరు పేరిట పనులను ప్రకటించడం అంటే మోసం చేయడమేనని పేర్కొంటున్నారు. ప్రకృతి సహజసిద్ధమైన వనరులకు నిలయమైన ఆదిలాబాద్ జిల్లాకు రైలు మార్గం కలిసివస్తే పారిశ్రామికంగా అభివృద్ధికి దోహదం చేసినట్లే అవుతుందని జిల్లా ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
జగిత్యాల టూ నిజామాబాద్ రైల్వేలైన్ ఆధునీకరణ పనుల పరిశీలన
Outer Ring Rail in Hyderabad : హైదరాబాద్ సిగలోకి మరో కలికితురాయి.. నగరం చుట్టూ ఔటర్ రింగ్ రైల్