People Boycotted Caste Census In Kamareddy District : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కుల గణనను 17 తండాల ప్రజలు బహిష్కరించిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని 17 తండాల్లో కులగణన సర్వేకు ప్రజలు దూరంగా ఉన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి కుల గణన సర్వేలో లబానా జాతి లంబాడీలకు ఆప్షన్ ఇవ్వనందున తాము బహిష్కరిస్తున్నట్టుగా తెలిపారు.
లభాన లంబాడీలకు ఆప్షన్ ఇవ్వకపోవడంతో : కుల గణన సర్వేలో లబానా లకు జాబితాలో ఆప్షన్ ఇవ్వకపోవడంతో గాంధారి మండలంలోని నేరేల్ తాండా, చద్మల్ తాండా, మోతిరాం తాండా, జెమిని తాండా, తిప్పారం తాండా, మధురా నగర్ తాండా, నడిమి తాండా, గుర్జాల్ తాండా, కుమ్మరి కుంట తండాల్లో సర్వేను బహిష్కరిస్తున్నట్లుగా లబానా లంబాడీ రాష్ట్ర అధ్యక్షుడు తాన్సింగ్ తెలిపారు. వెంటనే తమ లబానా జాతి లంబాడీలను కులగణన సర్వేలో చేర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గాంధారి మండలంలోని 17 తండాలకు చెందిన లబానా జాతి లంబాడీలు పాల్గొన్నారు.
సమగ్ర కుటుంబ సర్వే బహిష్కరణ : రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఇల్లంతకుంట మండలంలోని వెంకట్రావుపల్లె గ్రామంలో కొద్దిరోజుల క్రితం జరిగిన సమగ్ర కుటుంబ సర్వేను గ్రామస్థులు బహిష్కరించారు. తమ గ్రామ బౌండరీలను నిర్ణయించడంతో పాటు ఓటరు జాబితా తేల్చేవరకు సర్వేకు సహకరించబోమని తెలిపారు. గొల్లపల్లి గ్రామం నుంచి కొత్తగా ఏర్పడిన వెంకట్రావుపల్లె సరిహద్దులను మార్చి కొత్త సరిహద్దులతో గెజిట్ నోటిఫికేషన్ వెలువరించారని గ్రామస్థులతో ఎలాంటి చర్చలు చేయకుండా ఈ నిర్ణయం తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
విషయం తెలుసుకున్న రెవెన్యూ డివిజినల్ అధికారి వెంకట ఉపేందర్, గ్రామ స్పెషల్ ఆఫీసర్ రామకృష్ణలు వెళ్లి గ్రామస్థులతో మాట్లాడారు. రెవెన్యూ అధికారులతో సర్వే చేయించి సరిహద్దులు ఏర్పాటు చేయిస్తామని ఆర్డీవో హామీ ఇచ్చారు. ఈ ఘటనపై ఆర్టీవోను సంప్రదించగా గ్రామస్థులను కుటుంబ సర్వేకు సహకరించాలని కోరామని, గ్రామ బౌండరీలకు సంబంధించి 9 గుంటల భూ సమస్య ఉందని, దీనిపై సర్వే చేయిస్తామని వెల్లడించారు.
'సమగ్ర కులగణన అన్ని పథకాలకు మెగా హెల్త్ చెకప్లా ఉపయోగపడుతుంది'
సమగ్ర కుటుంబ సర్వేను బహిష్కరించిన గ్రామస్థులు - అధికారులు షాక్! - కారణం ఏంటంటే?