Pawan kalyan on Nagababu Portfolio : రాజకీయాల్లో పని తీరే ప్రామాణికమని, కలిసి పనిచేసిన వారిని గుర్తించాల్సిన బాధ్యత తనకు ఉందని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ అన్నారు. సోమవారం (డిసెంబరు 30) మంగళగిరిలో ఆయన మీడియా నిర్వహించిన చిట్‌చాట్‌లో మాట్లాడారు. తన సోదరుడు, జనసేన నాయకుడు అయిన నాగబాబుకు మంత్రి పదవి అన్న విషయంలో స్పందించారు.
"మాకు బ్యాక్‌గ్రౌండ్ లేకున్నా అన్నయ్య చిరంజీవి సొంతంగా ఎదిగారు. ఇప్పుడు మా తర్వాతి జనరేషన్ పిల్లలకు ఒక బ్యాక్‌గ్రౌండ్ అంటూ ఉంది. మనతో ప్రయాణం మొదలుపెట్టి పనిచేసిన వారిని నేను గుర్తించాలి. అన్నయ్య నాగబాబు నాతో పాటు సమానంగా పనిచేశారు. వైసీపీ నేతలతో కూడా తిట్లు తిన్నారు. పార్టీ కోసం నాగబాబు బలంగా నిలబడ్డారు. ఇక్కడ కులం, బంధుప్రీతి కాదు పనిమంతుడా కాదా? అన్నది మాత్రమే చూడాలి. మొదటగా ఎంపీ అభ్యర్థిగా ప్రకటించి తర్వాత నాగబాబును తప్పించాం"
"మనోహర్, హరిప్రసాద్ లాంటి నాయకులు మొదటి నుంచి పార్టీ కోసం పనిచేశారు. ఎవరికి ప్రతిభ ఉందో చూసి వాళ్లకు పార్టీలో పదవులు ఇస్తాం. ఈ విషయంలో మీరెందుకు వైఎస్ జగన్‌ను అగడలేదు? కేవలం పవన్ కల్యాణ్‌ను మాత్రమే ఎందుకు అడుగుతున్నారు? మొదటగా నాగబాబు ఎమ్మెల్సీగా ఎన్నికవుతారు. మంత్రి పదవి ఏది అనే విషయంలో తర్వాత చర్చ చేస్తాం. నాగబాబు త్యాగం గుర్తించి రాజ్యసభకు పంపుదాం అనుకున్నాం కానీ కుదరలేదు తర్వాత ఎమ్మెల్సీ అనుకున్నాం. కందుల దుర్గేష్ది ఏ కులమో నాకు తెలియదు. ఆయన పనితీరు నచ్చి ఆయనకు క్యాబినెట్లో చోటు కల్పించా. రాజకీయాల్లో కులం కాదు పని తీరే ప్రామాణికం" అని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ అన్నారు.
గోటితో పోయే దాన్ని గొడ్డలి దాకా తెచ్చారు : అల్లుఅర్జున్ వివాదంపై పవన్
అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంపై పవన్ కల్యాణ్ రియాక్షన్ ఇదే