ETV Bharat / state

ఈ రూట్​లో వెళ్తున్నారా? - గోతుల్లో రోడ్డు వెతుక్కోవాల్సిందే - BAD CONDITION OF ROADS IN NTR DIST

గోతులమయంగా 13 కిలోమీటర్ల రహదారి - కంకర తేలి ప్రమాదకరంగా మారిన పరిస్థితి

passengers_facing_problems_due_to_bad_condition_of_road_in_ntr_district
passengers_facing_problems_due_to_bad_condition_of_road_in_ntr_district (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 1, 2024, 3:00 PM IST

Passengers Facing Problems Due to Bad Condition of Road in NTR District : అది 13 కిలోమీటర్ల రహదారి. కానీ అడుగడుగునా గోతులే దర్శనమిస్తాయి. కంకర తేలి అత్యంత అధ్వానంగా మారింది ఆ రహదారి. పగలే రోడ్డు ఎక్కడుందా అని వెతుక్కుంటూ వెళ్లే ఆ మార్గంలో రాత్రి ప్రయాణమంటే ఇంక హడలే. చీకట్లో కనిపించని ఆ గోతుల్లో వాహనాలు పడ్డాయా ఇక అంతే. వాహనాలు గుల్లవ్వడంతో పాటు ప్రయాణికుల ఒళ్లు హూనం అవుతుంది.

ఇది ఎన్టీఆర్​ జిల్లా మైలవరం - నూజివీడు మధ్య రహదారి. కంకర తేలిపోయి నిలువెల్లా గుంతలతో నిండిపోయింది. రహదారి రెండు వైపులా కోతకు గురవడంతో ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. గోతులమయంగా మారిన రహదారులపై రాకపోకలకు వాహన చోదకులు, ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు.
మైలవరం-నూజివీడు మార్గంలో సుమారు 13 కిలోమీటర్ల మేర వాహనాలు కనీస వేగంతో వెళ్లలేని దుస్థితి నెలకొంది.

మైలవరం నుంచి బత్తులగూడెం వరకు పరిస్థితి అధ్వానంగా మారింది. అక్కడి నుంచి నూజివీడు వరకు కాస్త పర్వాలేదు. ఈ మార్గంలోని వెల్వడం హైస్కూల్‌ వద్ద పరిస్థితి ఇబ్బందికరంగా తయారవడంతో కొన్నేళ్లుగా ఎన్నో వాహనాలు దిగబడిపోయాయి. గుంతలు పూడ్చి వదిలేశారు. మళ్లీ పరిస్థితి మొదటికొచ్చింది. నిత్యం ప్రమాదాలు జరుగుతుండగా రోజూ చాలామంది గాయపడుతున్నారు.

ఆ 13 కిలో మీటర్ల దూరం ప్రయాణం ప్రాణాలకే ప్రమాదం

రాత్రుళ్లు గుంతలు కన్పించక చీకట్లో ప్రయాణికులు ప్రమాదాలకు గురవుతున్నారు. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, తమ పంట ఉత్పత్తుల్ని తీసుకొచ్చే రైతులు, చిరువ్యాపారులు, దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు ఇలా అన్నివర్గాల ప్రజలు ఈ రహదారి వల్ల నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏదైనా ప్రమాదం, ఇతర సంఘటన జరిగినప్పుడు మైలవరం లేదా అటు నూజివీడు వెళ్లాలంటే సకాలంలో చేరుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల వచ్చిన వరదలకు రహదారి మరింత దెబ్బతింది.

అక్కడక్కడా మట్టితో అధికారులు గుంతలు పూడ్చినా పరిస్థితిలో మార్పు కన్పించలేదు. నిత్యం వందలాది వాహనాలు ప్రయాణించే ఈ కీలక రహదారికి తక్షణం మరమ్మతులు చేయాలని లేదంటే ప్రయాణికులు, వాహన చోదకులు మరిన్ని ప్రమాదాలకు గురయ్యే అవకాశముందని స్థానికులు చెబుతున్నారు. తక్షణ మరమ్మతుల దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

ఖైదీలకైనా ఇలాంటి శిక్ష ఉండదేమో! - ఆ రోడ్డుపై 10 కిలోమీటర్ల ప్రయాణం దారుణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.