Pakistani Cheats Hyderabad Woman with Marriage : హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ సౌదీ అరేబియాలో భర్త వేధింపులు తాళలేక తన ముగ్గురు పిల్లలతో కలిసి ఇంటి నుంచి పారిపోయి, ఓ హోటల్‌లో తలదాచుకుంది. తన భర్త ఇటీవలే పెళ్లి చేసుకున్న ఓ 17ఏళ్ల బాలిక సైతం తన వెంటే ఉంది. ఫోన్ ద్వారా సమాచారం అందుకున్న ఆమె తల్లి తన కూతురు, పిల్లలను హైదరాబాద్‌కు తిరిగి రప్పించాలని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖను కోరుతూ లేఖ రాసింది. ఈ విషయాన్ని హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఎంబీటీ అధికార ప్రతినిధి అమ్జదుల్లాఖాన్ ట్వీట్ చేశారు.
హైదరాబాద్ రాజేంద్రనగర్‌కు చెందిన సబేరా బేగం కుమార్తె సబాకు గతంలో వివాహమైనా కట్నం కింద బంగారం(Gold) ఇవ్వలేదనే కారణంతో భర్త వదిలేశాడు. కూతురికి మరో వివాహం చేసేందుకు తల్లిదండ్రులు తమకు తెలిసిన వారిని సంప్రదించారు. సౌదీ అరేబియాలోని మక్కాలో డ్రైవర్‌గా పనిచేసే ముఖ్తాదీర్ వారికి ఓ సంబంధం చూపించాడు. మక్కాలో తనతో పాటు డ్రైవర్‌గా పనిచేసే బంగ్లాదేశ్‌కు చెందిన అలీహుస్సేన్ అజీజ్ ఉల్ రెహ్మాన్ గురించి సబేరా బేగం కుటుంబసభ్యులకు తెలిపాడు. ఆ తర్వాత ఇరువురూ మాట్లాడుకుని సబా, అలీహుస్సేన్‌కు 2014 ఫిబ్రవరిలో వివాహం చేశారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక అబ్బాయి ఉన్నారు.
Hyderabad Woman Facing Problems In Saudi : కొన్నాళ్ల తర్వాత అలీహుస్సేన్ సబాను వేధించడం మొదలుపెట్టాడు. ఇంటి నుంచి బయటకు చూసేందుకు వీల్లేకుండా ఆంక్షలు విధిస్తూ దారుణంగా చిత్రవధ చేసేవాడు. తల్లితోనూ మాట్లాడనివ్వకుండా ఇబ్బందులు పెట్టేవాడు. ప్రశ్నిస్తే తనను బెదిరించేవాడని సబా తల్లి సబేరా బేగం వాపోయింది. ఇటీవల అలీహుస్సేన్ బంగ్లాదేశ్‌కు(Bangladesh) చెందిన ఓ 17 ఏళ్ల బాలికను 20 వేల రియాళ్లకు కొనుగోలు చేసి, వివాహం(Marriage) చేసుకున్నాడు. మూడు నెలల వీసాపై తీసుకొచ్చి, ఆమెను కూడా చిత్రహింసలకు గురిచేయటం మొదలుపెట్టాడు. ఇద్దరు భార్యలు, పిల్లల్ని ఇంట్లో బంధించి సమాచారం బయటకు పొక్కకుండా వేధించేవాడు.
Hyderabadi woman tortured by her husband : రెండ్రోజుల క్రితం కారు డోరుకు ఉండే రబ్బరుతో సబాను కనికరం లేకుండా కొట్టాడు. భరించలేక సబా బేగం తన ముగ్గురు పిల్లలతో పాటు ఇంట్లో ఉన్న 17 ఏళ్ల బాలికతో కలిసి మారు తాళాలతో తలుపు తీసుకుని బయటపడింది. మక్కా నుంచి పారిపోయి జెడ్డాలోని ఓ హోటల్‌లో తలదాచుకున్నట్లు బాధితురాలు తన తల్లికి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చింది. వారిని రక్షించి భారత్‌కు పంపించాలని బాధితురాలి తల్లి సబేరా బేగం కేంద్ర విదేశాంగశాఖకు లేఖ రాసింది. అలీ హుస్సేన్ పాకిస్థాన్ జాతీయుడని అతని పాస్‌పోర్టు ద్వారా తేలిందని తెలిపింది. ఈ మేరకు తన కుమార్తె అలీ హుస్సేన్ చేతిలో గాయపడ్డ చిత్రాలను కేంద్ర విదేశాంగ శాఖ అధికారులకు పంపారు. తన కుమార్తె పరిస్థితి గురించి భారత రాయబార కార్యాలయ అధికారులకు సమాచారం అందించినట్టు బాధితురాలి తల్లి తెలిపారు. ఈ మేరకు అక్కడి అధికారులు బాధితులను కలిసి భరోసా కల్పించారు.
BTech Student Committed Suicide : ఉద్యోగం పేరిట మోసం.. బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య