Optical Illusion Test in Telugu : "పట్టుకుంటే ప్రతిదీ సమస్యే.. వదిలేస్తే ఏ సమస్యా ఉండదు". ఇది యూనివర్సల్ మోటివేషన్ లైన్. అవును మరి.. సమస్యలు - మనుషులు కవల పిల్లలు! విడదీయడం అసాధ్యం. చేయాల్సిందల్లా.. చిరునవ్వుతో వాటిని క్లియర్ చేసుకుంటూ ముందుకు సాగిపోవడమే. కానీ.. చాలా మంది ఇది చేయకుండా ఒకే ఒక తప్పు చేస్తుంటారు. అదే అన్ని అనర్థాలకూ మూలం అవుతుందని అంటారు మానసిక నిపుణులు.
"ప్రాబ్లమ్స్.. ప్రాబ్లమ్స్.. టేక్ ఏ బ్రేక్ యార్! - కమాన్ ఈ పజిల్ చూడు కూల్ అయిపోతావ్!
మరి.. ఆ తప్పు ఏంటో తెలుసా? తనకు ఉన్నవాటిని చూసుకొని సంతోష పడకుండా.. లేని వాటిని తలుచుకొని ఏడ్వటం! ఏ మనిషి జీవితమూ సంపూర్ణం కాదు. ఒకటికి మించిన లోపాలు ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి. అదే సమయంలో ఒకటికి మించిన బలాలు కూడా ఉంటాయి. డబ్బు లేదని మెజారిటీ జనం బాధపడుతుంటారు.. కళ్లు లేని వారి బాధముందు డబ్బు లేదనే బాధ ఎంత? కలర్ తక్కువైందని కొందరు మదన పడుతుంటారు.. కాళ్లూ, చేతులు లేని వారితో పోలిస్తే, కలర్ ఓ సమస్యేనా? ఒంటి మీద దుస్తులే సరిగా లేనివారితో కంపేర్ చేస్తే.. బ్రాండెడ్ లేదనడాన్ని ఆవేదన అనొచ్చా?
కాసేపు టెన్షన్స్ అన్నీ లైట్ తీస్కో భయ్యా - ఈ తేడాలు కనిపెట్టండి - ఫుల్లు రిలాక్స్!
ఇలాంటి ఉదాహరణలెన్నో! అలాగని.. లేనిదానికోసం ప్రయత్నించొద్దని చెప్పట్లేదు. ఉన్నదాన్ని అనుభవిస్తూ, ఆనందిస్తూ ప్రయత్నించు. వీటిని వదిలేసి ఏడుస్తూ చేయకూడదు. చివరగా.. సంతోషాన్ని ఎక్కడో వెతుక్కోకూడదు. అది మీలోనే ఉంటుంది. మీ ఆలోచనా విధానంలోనే ఉంటుంది. చూసే దృష్టిలో ఉంటుంది. అర్థం చేసుకోండి.
మీ ఐక్యూ పవర్ ఎంతో టెస్ట్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ పజిల్‌ను సాల్వ్ చేయండి!
ఈ మోటివేషన్‌కు మరికొంత కిక్ యాడ్ చేసేందుకే ఈ పజిల్ తీసుకొచ్చాం. కూల్‌గా ఈ పజిల్‌ను సాల్వ్ చేయండి. ఇందులో మొత్తం 6 తేడాలు ఉన్నాయి. వీటిని మీరు 7 సెకన్లలో కనిపెట్టాలి. అందరూ గుర్తుపట్టే విధంగానే ఉంటాయి. ఇలాంటివి భలే సరదాగా ఉంటాయి. మీరు ఇన్ టైమ్‌లో సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ కనుక్కోలేకపోయినా.. టెన్షన్ అవసరం లేదు. ఇలాంటివి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మీ అబ్జర్వేషన్ ఓ రేంజ్ లో పెరిగిపోతుంది.
సమాధానాలు ఇవే :
1. మొక్క
2. గొడుగు
3. సూర్యుడు
4. కుక్క తోక
5. కిటికీ
6. ఇటుక డిజైన్
బొమ్మే కదా అని తీసిపారేయకండి - ఈ చిత్రంలోని తేడాలు కనిపెడితే మీలో అద్భుతం జరుగుతుంది!