ETV Bharat / state

డీఎస్సీ-2008 బాధితులకు గుడ్​ న్యూస్ - అతి త్వరలోనే టీచర్లుగా పోస్టింగ్​లు

డీఎస్సీ - 2008లో నష్టపోయిన బాధితులకు కాంట్రాక్టు ఉపాధ్యాయ పోస్టులు - ప్రక్రియను ముమ్మరం చేసిన విద్యాశాఖ - ఈ నెల 8లోపు ప్రక్రియ పూర్తయ్యే అవకాశం!

DSc 2008 Victims as Contract Teachers
DSc 2008 Victims as Contract Teachers (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

Updated : 38 minutes ago

DSc 2008 Victims as Contract Teachers : ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించిన డీఎస్సీ-2008లో నష్టపోయిన అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే గుడ్​ న్యూస్ చెప్పనుంది. ఇందుకు పాఠశాల విద్యా శాఖ చర్యలు ముమ్మరం చేసింది. ఇంతకీ ఏంటని అనుకుంటున్నారా? నష్టపోయిన 2,367 మంది అభ్యర్థులను కాంట్రాక్టు టీచర్లుగా నియమించేందుకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేసేందుకు విద్యాశాఖ సన్నాహకాలు చేస్తోంది.

సెప్టెంబర్ నెలాఖరులో విద్యాశాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది. అందులో ఆనాటి డీఎస్సీ(డీఎస్సీ-2008)లో నష్టపోయిన వారు తమ పేర్లు నమోదు చేసుకోవాలని కోరింది. ఈ క్రమంలో ఆయా ధ్రువపత్రాలను పరిశీలించి, వారికి కొలువులు ఇచ్చేందుకు విద్యా శాఖ అధికారులు సిద్ధమయ్యారు. నల్గొండ, సంగారెడ్డి, హనుమకొండ, ఖమ్మం, రంగారెడ్డి, మహబూబ్​నగర్​, కరీంనగర్, ఆదిలాబాద్​, నిజామాబాద్ జిల్లాల్లో బాధితులు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో భాగంగా ఒక్కో జిల్లాకు ఒక సీనియర్ అధికారిని పరిశీలకునిగా విద్యాశాఖ నియమించింది. ఈ నెల 8లోపు ప్రక్రియ మొత్తం పూర్తి చేయాలని ఆదేశించారు.

నేటి నుంచి టెట్​ నోటిఫికేషన్​ ప్రారంభం : రాష్ట్రంలో సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన టెట్​ దరఖాస్తుల స్వీకరణ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 5వ తేదీన టెట్​ నోటిఫికేషన్​ 2025ను విద్యాశాఖ విడుదల చేసింది. ఈ డీఎస్సీకి వచ్చే ఏడాది జనవరిలో టెట్​ నిర్వహించనున్నట్లు ప్రకటన విడుదల చేసింది. 2025 జనవరి 1 నుంచి 20వ తేదీ వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ప్రకటనలో పేర్కొంది. అయితే టెట్​ దరఖాస్తుల స్వీకరణను రెండు రోజుల పాటు వాయిదా వేసింది. సాంకేతిక కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. అయితే నేటి నుంచి నోటిఫికేషన్​ దరఖాస్తులు స్వీకరించనుంది.

జనవరిలో టెట్​ పరీక్ష నిర్వహిస్తే ఏడోది : గతేడాది మే నెలలో తొలిసారి టెట్​ నోటిఫికేషన్​ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మరోసారి నోటిఫికేషన్​ను జారీ చేసింది. దీంతో ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలనుకుంటున్న అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు ఆరుసార్లు మాత్రమే టెట్​ పరీక్షలను నిర్వహించారు. జనవరిలో టెట్​ పరీక్షను నిర్వహిస్తే ఏడోది అవుతుంది.

టెట్‌ అభ్యర్థులకు అలర్ట్‌ - దరఖాస్తుల స్వీకరణ వాయిదా, ఎప్పటినుంచంటే!

అయ్యో పాపం : ఒకేసారి 2 జాబ్స్ - ఒకటి వదిలేస్తే రెండోదీ పోయింది

Last Updated : 38 minutes ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.