Online Trading Fraud in Hyderabad : నగరంలో రోజురోజుకు కొత్తకొత్త తరహాలో సైబర్‌నేరాలు(Cyber Crime) వెలుగులోకి వస్తున్నాయి. నగరానికి చెందిన ఒక కుటుంబ యజమాని ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు స్థిరాస్తులు విక్రయించారు. వచ్చిన సొమ్మును మూడు బ్యాంకు ఖాతాల్లో జమచేశారు. తమ తల్లిదండ్రుల ఆర్థిక ఇబ్బందులను చూసి ఎంతో కొంత సహాయకారిగా ఉండాలని ఆయన కుమార్తె భావించింది.
దుబాయి నుంచి ఓ వ్యక్తి ఆమెకు ఫోన్ చేసి ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడితే 30% లాభాలు వస్తాయని ఆశచూపాడు. తనకు పంపిన వాట్సాప్ లింక్‌లను ఓపెన్‌చేసి ఇన్వెస్ట్‌మెంట్ చేయాలని సూచించాడు. ఇదంతా నిజమని నమ్మిన సదరు యువతి తన తండ్రి ఆస్తులు అమ్మి బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన రూ 3.16కోట్లను పెట్టుబడులుగా పెట్టింది. కొంత కాలం తర్వాత అవతలి వ్యక్తి నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో మోసపోయినట్లు భావించి పోలీసులను ఆశ్రయించింది.
ఈ కేసులో దర్యాప్తు జరిపిన పోలీసులు గత నెలలో గోవాకు చెందిన రోనక్ తన్నాను అరెస్ట్ చేశారు. నిందితుడి బ్యాంకు ఖాతాలోని రూ. 20లక్షల లావాదేవీలను స్తంభింపజేశారు. బాధితురాలు జమచేసిన నగదును నిందితులు ఏయే బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించారనే దానిపై సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టింది.
సైబర్ నేరాల్లో ఇదో కొత్తరకం - ఫేక్ లీగల్ నోటీసులతో సొమ్ము కాజేస్తున్న గ్యాంగ్ అరెస్ట్
Cyber Crime in Hyderabad : వీరంతా గుజరాత్‌కు చెందిన హవాలా వ్యాపారులతో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. విదేశాల నుంచి సైబర్ మెసాలకు పాల్పడే గోవాకు చెందిన రోహన్ తన్నా, భారత్ దేశానికి చెందిన బ్యాంకు ఖాతాలను సమకూర్చేవాడని పోలీసులు విచారణలో తేలింది. ఆన్‌లైన్ గేమింగ్, ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్ తరహా మోసాలతో బాధితుల నుంచి కొట్టేసిన నగదు జమచేసేందుకు ఈ బ్యాంకు ఖాతాలను ఉపయోగించేవారు. దుబాయ్, హాంకాంగ్‌లోని ప్రధాన నిందితులు ఈ బ్యాంకు ఖాతాల లావాదేవీలను నిర్వహించేవారని తెలింది.
సైబర్ నేరాల్లో తెలుగు యువత - ఇతర రాష్ట్రాల వారితో కలిసి కోట్లు కొల్లగొడుతున్నారు
ఈ సొమ్మును క్రిప్టోగా మార్చి దుబాయ్ చేరవేస్తున్నారని పోలీసులు గుర్తించారు. తిరిగి దీన్ని హవాాలా మార్గంలో భారతీయ కరెన్సీగా మార్చి పంపుతున్నారని ఆధారాలను సేకరించారు. ఈ వ్యవహారంలో దుబాయికి హవాలా మార్గంలో నగదు చేరవేసేందుకు గుజరాత్‌కు చెందిన స్వయమ్, తిమానియా, బ్రిజేష్ పటేల్, హర్ష పాండ్య, మీట్ తమానియా, శంకర్‌లాల్ కమీషన్ ఆశతో సహకరిస్తూ వస్తున్నారు. ప్రధాన నిందితుల నుంచి వీరి బ్యాంకు ఖాతాల్లోకి జమచేసిన నగదును హవాలా మార్గంలో గమ్యానికి చేరవేస్తున్నట్టు దర్యాప్తులో నిర్ధారించామని హైదరాబాద్ జాయింట్ సీపీ రంగనాథ్ తెలిపారు. విచారణలో వీరినుంచి 8లక్షల నగదు రికవరీ చేశారు. బ్యాంకులో ఉన్న కొంత నగదును సీజ్ చేశారు. మిగతా సొమ్మును రికవరీ చేసే పనిలో ఉన్నారు.
సైబర్ నేరగాళ్లు ఆశ, భయం వంటి భావోద్వేగాలను అనువుగా వాడుకోని మోసాలకు పాల్పడుతున్నారని జాగ్రత్తగా ఉండాలని జాయింట్ సీపీ సూచించారు. కొరియర్ వచ్చిందని అందులో డ్రగ్స్ ఉన్నాయని ఎవరైనా చెబితే ఆందోళన చెందవద్దని సూచించారు. ధైర్యంగా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్, లేదా 1990 నెంబర్ కు ఫిర్యాదు చేయాలని జాయింట్ సీపీ రంగనాథ్ సూచించారు.
"గుజరాత్‌కు చెందిన నిందితుల హవాలా రాకెట్ గుట్టు బయటపడింది. ఆన్‌లైన్ గేమింగ్, ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్ తరహా మోసాలతో పెద్దమొత్తంలో దోచేస్తున్నారు. సైబర్ నేరగాళ్లు ఆశ, భయం వంటి భావోద్వేగాలను అనువుగా వాడుకోని మోసాలకు పాల్పడుతున్నారు.ఫెడ్‌ఎక్స్ కొరియర్ పార్శిళ్లు వచ్చాయంటూ బెదిరిస్తున్నారు. ఇటువంటి బెదిరింపులకు భయపడొద్దు. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లేదా 1990 నెంబర్‌కు ఫిర్యాదు చేయాలి". - ఎ.వి రంగనాథ్, హైదరాబాద్ జాయింట్ సీపీ
సైబర్ నేరగాళ్ల నయామోసం - లక్షపెట్టుబడి పెడితే 40 రోజుల పాటు రూ.10 వేలు