ETV Bharat / state

పెద్దపల్లి లారీ బీభత్సం ఘటనలో మహిళ మృతి - ప్రమాదానికి కారణమిదే - One Killed in Lorry Rash Driving - ONE KILLED IN LORRY RASH DRIVING

Karimnagar Lorry Rash Driving Woman Expired : కరీంనగర్​ సుల్తానాబాద్​లో లారీ బీభత్సం సృష్టించిన ఘటనలో ఓ మహిళ మృతి చెందింది. నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. డ్రైవర్​, క్లీనర్​ ఇద్దరు మద్యం మత్తులో ఉండగా, బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపు చేయలేకపోయారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

Karimnagar Lorry Rash Driving Woman Expired
One Killed After Lorry Rash Driving in Karimnagar (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 1, 2024, 1:54 PM IST

One Killed After Lorry Rash Driving in Karimnagar : మద్యం మత్తులో లారీ నడిపిన డ్రైవర్​ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్​లో బీభత్సం సృష్టించాడు. ఈ ఘటనలో మహిళ మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పలు ద్విచక్ర వాహనాలు దెబ్బతిన్నాయి. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో సుల్తానాబాద్​లోని పూసాల వద్ద రోడ్డు పక్కన నిల్చోని అవతలి వైపు రోడ్డు దాటాడానికి నిరీక్షిస్తున్న నలుగురిపై కరీంనగర్​ నుంచి గోదావరిఖనికి వెళ్తున్న ఖాళీ లారీ దూసుకొచ్చింది. వారికి ఢీ కొట్టిన అనంతరం లారీ రాజీవ్​ రహదారిపై కరీంనగర్​ మార్గం వైపు వెళ్లింది.

సోషల్​ మీడియాలో వైరల్​ అయిన వీడియోలు : మార్గమధ్యలో పానీపూరీ బండిని ఢీ కొట్టి, మళ్లీ డివైడర్​ మీదుగా పెద్దపల్లి మార్గంవైపు వచ్చింది. అక్కడున్న ద్విచక్రవాహనాలపైకి దూసుకెళ్లిన అనంతరం లారీ చెట్టును ఢీ కొట్టి ఆగిపోయింది. లారీ తమవైపునకు దూసుకొస్తుందనే భయంతో స్థానికులు పరుగులు తీశారు. కరీంనగర్​ నుంచి సుల్తానాబాద్​ వైపు వస్తున్న లారీని కాట్నపల్లి వద్దనే గమనించిన కొంతమంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ లారీని వెంబడించిన స్థానికులు వాహనాన్ని ఆపేందుకు యత్నించారు దానికి సంబంధించిన వీడియోలు మాధ్యమాల్లో వైరల్​ అవుతున్నాయి. డ్రైవర్​, క్లీనర్​ ఇద్దరూ మద్యం మత్తులో ఉండగా బ్రేక్​ ఫెయిల్​ కావడంతో అదుపు చేయకలేకపోయారని ప్రాథమికంగా నిర్ధారించారు.

హైద‌రాబాద్‌లో లారీ బీభ‌త్సం - బైకును ఈడ్చుకెళ్లిన వీడియో వైరల్ - Road Accident In Hyderabad

మహిళ మృతి నలుగురికి గాయాలు : సుల్తానాబాద్​ ఇందిరానగర్​కు చెందిన దంపతులు యూసుఫ్​, నసీమా, వారి పిల్లలు కరీంనగర్​ నుంచి బస్సులో వచ్చి రాజీవ్​ రహదారి దాటడానికి నిరీక్షిస్తుండగా లారీ ఢీ కొట్టడంతే తీవ్రంగా గాయపడ్డారు. అక్కడే ద్విచక్రవాహనంపై కూర్చోని ఉన్న వినయ్​ అనే వ్యక్తికి స్వల్పంగా గాయలయ్యాయి. క్షతగాత్రులను సుల్తానాబాద్​ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్​ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి నసీమా మృతి చెందింది. వారి కుమారుడి​ పరిస్థితి విషనంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతురాలు స్థానికంగా ప్రైవేటు స్కూల్​లో ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది.

కాగా ఈ ప్రమాదంలో పానీపూరీ బండి, ఐదు ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి. లారీ డ్రైవర్‌ కమలాకర్, క్లీనర్‌ వంశీలకు స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. రహదారిపై మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తున్న తీరు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో చర్చనీయాంశంగా మారింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఫూటుగా మందేసి రోడ్డు మీదకొచ్చాడు - గంటలో​ ఆరు ప్రమాదాలు చేశాడు - బ్రీత్​ఎనలైజర్​ రీడింగ్ చూస్తే! - Man Caused Six Accidents in Hyd

Viral Video Drunken Man Hulchal With Car : మద్యం మత్తులో కారు బీభత్సం.. ఆరుగురు వాహనదారులకు గాయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.