Obscene Dances at Banjarahills Pub : హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని టాస్ పబ్బుపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు జరిపారు. నిబంధనలకు విరుద్దంగా యువతులతో నృత్యాలు చేయిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు తనిఖీలు చేశారు. పబ్‌కు వచ్చే కస్టమర్లను ఆకర్షించేందుకు నిర్వాహకులు యువతులతో అసభ్యకరమైన నృత్యాలు చేయిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, దాడుల సమయంలో పబ్‌లో ఉన్న 100 మంది యువకులను, 42 మంది యువతులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.
టాస్ పబ్‌పై టాస్క్‌ఫోర్స్ దాడి : ఈ యువతులు పబ్‌కు వచ్చే వారితో చనువుగా ఉంటూ మద్యం సేవిస్తున్నట్లు నటించి, శీతల పానీయాలు తాగి, కస్టమర్లతో మద్యం తాగిస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇలా కస్టమర్‌తో ఎక్కువ బిల్ చేయించిన యువతికి కమీషన్ ఉన్నట్లు తెలిపారు. ఇందులో 10 మంది యువతులు గతంలో ఊర్వశి బార్, ఆఫ్టర్ 9 పబ్‌లో పట్టుబడిన వాళ్లుగా గుర్తించామని, రిపీటెడ్‌గా ఇలాంటి అకృత్యాలకు పాల్పడుతున్నారని బంజారాహిల్స్ ఏసీపీ వెంకట్ రెడ్డి తెలిపారు. వీళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని, పబ్‌ను సీజ్ చేస్తామని వివరించారు. ఎక్సైజ్ అధికారులకు కూడా రిపోర్ట్ పంపిస్తామన్న ఆయన, పబ్ నిర్వాహకులు శ్రీనివాస్ గౌడ్, ఆరిఫ్, శ్రావణ్ గౌడ్, డీజే ప్లేయర్ ఆసిఫ్‌లపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
"బంజారాహిల్స్‌లోని టాస్ పబ్‌లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయనే సమాచారంతో టాస్క్‌ఫోర్స్ టీమ్‌తో కలిసి రైడ్ చేశాం. టాస్ పబ్‌లో అశ్లీల నృత్యాలు చేస్తున్న యువతులను అదుపులోకి తీసుకున్నాం. ఉద్యోగాల పేరుతో యువతులను ట్రాప్ చేసింది పబ్ యాజమాన్యం. ప్రతీ వీక్ ఎండ్‌లో పబ్‌కు రావాలని యువతులకు సూచించారు. కస్టమర్లతో చనువుగా ఉంటూ, బిల్ ఎక్కువ చేయించడం యువతుల టార్గెట్. కస్టమర్‌తో ఎక్కువ బిల్ చేయించిన యువతికి కమీషన్ ఇస్తారు. మొత్తం 42 మంది యువతులు, 100 మంది యువకులను అదుపులోకి తీసుకున్నాం." - వెంకట్ రెడ్డి, బంజారాహిల్స్ ఏసీపీ
వలపు వలతో తెలుగు యువత విలవిల - ఆ జిల్లాలోనే ఎక్కువ మంది బాధితులు
స్నేహితుల ద్వారా పరిచయమై ప్రేమలో పడ్డారు - అలా తయారయ్యాడని దూరం పెట్టేసరికి!