ETV Bharat / state

వీసీ రాజకీయం - అధ్యాపకులకు తలనొప్పి- విద్యార్థులకు వేధింపులు - Nuziveedu IIIT Professors Problems - NUZIVEEDU IIIT PROFESSORS PROBLEMS

YSRCP Destroyed Rules In Universities In Andhra Pradesh : విద్యార్థులను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దే విశ్వవిద్యాలయం అది. అక్కడ రాజకీయాలకు చోటుండకూడదు. కానీ గత ఐదేళ్లు ఆ వర్సిటీ కులపతి, ఉప కులపతులు ఒంటెద్దు పోకడలు పోయారు. రాజకీయ పార్టీలకు కొమ్ము కాస్తూ విద్యార్థులను, అధ్యాపకులను వేధిస్తున్నారు.

nuziveedu_iiit_professors_problems
nuziveedu_iiit_professors_problems (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 22, 2024, 8:41 AM IST

Nuziveedu IIIT Vice Chancellor Anarchy & Professors Problems : విద్యార్థులను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దే విశ్వవిద్యాలయం అది. అక్కడ రాజకీయాలకు చోటుండకూడదు. కానీ గత ఐదేళ్లు ఆ వర్సిటీ కులపతి, ఉప కులపతులు ఒంటెద్దు పోకడలు పోయారు. ఏకపక్ష నిర్ణయాలతో విద్యార్థులను, అధ్యాపకులను ఇబ్బంది పెట్టారు. ప్రస్తుతం కొత్త ప్రభుత్వం రాకతో బాధితులంతా స్వేచ్ఛగా బయటకు వస్తున్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని కోరుతున్నారు.

ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో గత ఐదేళ్లపాటు కులపతి, ఉపకులపతి తీసుకున్న నిర్ణయాలు తలనొప్పిగా మారాయి. వర్సిటీకి పెద్ద తలగా వ్యవహరించే వీసీ క్యాంపస్ అభివృద్ధిని గత ఐదేళ్లుగా పక్కన పెట్టారు. అధ్యాపకుల సంక్షేమాన్ని, విద్యార్థులను పట్టించుకోవడం మానేశారు. ప్రభుత్వంతో చర్చించి యూజీసీ నిధులను తీసుకురాకపోగా రోజువారీ వ్యవహారాల్లో తలదూర్చుతూ అధ్యాపకులను, విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు.

ఐటీఐ కాలేజీలను గాలికొదిలేసిన జగన్ సర్కార్! 8వేల రెగ్యులకు పోస్టులకు 1,140 మాత్రమే బోధనా సిబ్బంది

YSRCP Destroyed Rules In Universities In Andhra Pradesh : వర్సిటీలోని అధ్యాపకులంతా ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల నుంచి వచ్చిన వారే. ఇక్కడి రాజకీయాలను భరించలేక కొంత మంది ఇతర విశ్వవిద్యాలయాలకు వెళ్లిపోయారు. వర్సిటీ కులపతిగా ఉన్న కేసీరెడ్డి వేధింపులే ఇందుకు కారణమని అధ్యాపకులు ఆరోపిస్తున్నారు. టీడీపీ హయాంలో తమకు రెండుసార్లు ఇంక్రిమెంట్లు ఇస్తే గడిచిన ఐదేళ్లలో ఒక్కసారి కూడా ఇవ్వలేదని, జీతాలు ఇవ్వడమే ఎక్కువంటూ హేళన చేశారని అధ్యాపకులు వాపోతున్నారు. సమస్యలు చెప్పుకుందామని ప్రయత్నిస్తే అణచివేస్తున్నారని మండిపడుతున్నారు.

Intermediate Free Books Distribution: ఉచిత పుస్తకాల పంపిణీ బటన్ నొక్కు జగన్​ మామయ్య..!

'గతంలో ఇక్కడ పని చేసిన కులపతులు, ఉపకులపతులు రాజకీయాల్లో తలదూర్చలేదు. గత ఐదేళ్లలోనే ఈ దుష్ట సంస్కృతి తెచ్చారు. కొందరు ఒప్పంద ఉద్యోగుల్ని నియమించుకుని, వారితో మాపై పెత్తనం చెలాయించాలని చూస్తున్నారు. పదేళ్లుగా తమను క్రమబద్దీకరించకూడా కోర్టుల ఉత్తర్వులను వీసీ పక్కన పెట్టారు.' - సహాయ అధ్యాపకుడు బొత్స శ్రీనివాసరావు, భౌతిక శాస్త్రం అధ్యాపకుడు శ్రీనివాస్

IIIT Nuzvid Vice Chancellor Anarchy : వర్సిటీలో యూజీసీ నిబంధనల ప్రకారం విద్యార్థుల నిష్పత్తికి అనుగుణంగా అధ్యాపకుల నియామకం జరగాలి. కానీ 36 మంది ప్రొఫెసర్లు, 72 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 213 మంది సహాయ అధ్యాపకుల్లో కేవలం 20 మంది మాత్రమే శాశ్వత ప్రాతిపదికన పనిచేస్తున్నారు.

Education system: ఉత్తరాంధ్ర విద్యా వ్యవస్థ అభివృద్ధి శూన్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.