ETV Bharat / state

దేవర మూవీ ప్రదర్శనలో ఉద్రిక్తత - టికెట్లు లేకుండానే దూసుకెళ్లిన అభిమానులు - NTR Fans Rushed Into Movie Theater

author img

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

NTR Fans Rushed into movie Theater : దేవర సినిమా విడుదల సందర్భంగా కడపలోని ఓ థియేటర్ యాజమాన్యానికి, ఎన్టీఆర్ అభిమానులకు మధ్య భారీ స్థాయిలో గొడవ చెలరేగింది. అర్ధరాత్రి ఒంటిగంటకు సినిమా ప్రదర్శించగా చాలామంది ప్రేక్షకులు టికెట్లు లేకుండానే థియేటర్​లోకి దూసుకెళ్లారు. దీంతో కాసేపు సినిమా ప్రదర్శనను నిలిపివేశారు.

Fight Between Theater Management and jr NTR Fans
NTR Fans Rushed into movie Theater (ETV Bharat)

Fight Between Theater Management and jr NTR Fans : దేవర సినిమా విడుదల సందర్భంగా కడపలోని ఓ థియేటర్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. యాజమాన్యానికి, అభిమానులకు మధ్య భారీ స్థాయిలో గొడవ చెలరేగింది. కడప పట్టణంలోని రాజా థియేటర్​లో అర్ధరాత్రి ఒంటిగంటకు దేవర సినిమా ప్రదర్శించారు. మెుదటి షో కావడంతో భారీసంఖ్యలో అభిమానులు థియేటర్​కు తరలివచ్చారు. ముందుగానే టికెట్లు బుక్ చేసుకున్న వాళ్లు లోపలికి వెళ్లారు. ఇదే సమయంలో చాలామంది ప్రేక్షకులు టికెట్లు లేకుండానే సినిమా థియేటర్​లోకి వెళ్లడంతో హాలు మొత్తం అభిమానులతో కిక్కిరిసిపోయింది.

గమనించిన థియేటర్ యాజమాన్యం టికెట్లు లేని వారిని బయటికి పంపించేందుకు ప్రయత్నించారు. దీంతో అభిమానులకు థియేటర్ యాజమాన్యానికి మధ్య గొడవ చోటుచేసుకుంది. గందరగోళం మధ్య సినిమా ప్రదర్శనను కాసేపు ఆపేశారు. చివరికి పోలీసులు రంగప్రవేశంలో పరిస్థితి సద్దుమణిగింది. అనంతరం సినిమాను కొనసాగించారు. ఈ సందర్భంగా గొడవకు కారణమైన కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఫ్యాన్స్​లో భారీ అంచనాలు : అయితే ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్‌ సోలో హీరోగా చేసిన చిత్రం దేవర. జాన్వీ కపూర్‌ ఈ చిత్రంతోనే తెలుగు తెరకు పరిచయమైంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్​ నేరుగా తెలుగులో చేసిన చిత్రమిది. పైగా ఇప్పటికే ​ఎన్టీఆర్‌-కొరటాల కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్‌ ఎంతటి విజయాన్ని అందుకుందో తెలిసిందే. ఇక ఆర్​ఆర్​ఆర్​ బ్లాక్​ బస్టర్​తో ఎన్టీఆర్ ఇమేజ్ అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. ఇలా ఇవన్నీ కలిసి రావడంతో దేవరపై ఫ్యాన్స్​లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

హిట్ కొట్టాలని పట్టుదలతో : ఆచార్య వంటి ఫ్లాప్ తర్వాత ఎలాగైనా గట్టి హిట్ కొట్టాలని పట్టుదలతో కొరటాల శివ తెరకెక్కించారు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. జాన్వీ కపూర్‌ ఈ చిత్రంతో టాలీవుడ్​కు ఎంట్రీ ఇవ్వగా, సైఫ్‌ అలీ ఖాన్‌ ప్రతినాయకుడిగా నటించారు. అయితే రిలీజ్‌కు ముందే ప్రీ సేల్స్​, అడ్వాన్స్ బుకింగ్స్‌తో పలు రికార్డులు క్రియేట్ చేసిన 'దేవ‌ర' ప్రస్తుతం పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో తెలుగు, హిందీతో పాటు ఇత‌ర ద‌క్షిణాది భాష‌ల్లో రిలీజైంది.

ఎన్టీఆర్​ 'దేవర' మూవీ రివ్యూ - ఎర్ర సముద్రం పోటెత్తింది! - DEVARA MOVIE REVIEW

బ్లాక్ బస్టర్ 'దేవర' - OTTలోకి ఎన్ని రోజుల తర్వాత, ఎక్కడ వస్తుందంటే? - Devara Movie OTT Details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.