NTR Bharosa Pensions Distribution at Record Level: రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం సాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 6 గంటలకు పెన్షన్ల పంపిణీ ప్రారంభించగా 9 గంటలు అయ్యేసరికి 71 శాతం పంపిణీ పూర్తయింది. కేవలం 3 గంటల వ్యవధిలోనే సగానికి పైగా పంపిణీ పూర్తవటంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పింఛన్ల పంపిణీని వాలంటీర్ల కంటే స్పీడుగా సచివాలయ సిబ్బందే చేస్తున్నారని అంటున్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో కూటమి ప్రభుత్వం పింఛన్ల పంపిణీ చేయటంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం ఎప్పటికప్పుడు పింఛన్ల వివరాలను అధికారిక వెబ్సైట్లో పెడుతోంది. ఇళ్ల వద్దే సచివాలయ సిబ్బంది పింఛన్ మొత్తం అందించేలా ఏర్పాట్లు చేసింది.