ETV Bharat / state

నాన్ వెజ్ ప్రియులకు షాక్​! ఈ సండే చికెన్‌, మటన్‌ షాపులు క్లోజ్‌! - GHMC orders to close meat shops

Hyderabad Non-Veg Shops close: హైదరాబాద్‌ నగర వాసులకు చిన్న బ్యాడ్‌ న్యూస్‌. ఈ ఆదివారం రోజున అన్ని నాన్‌వెజ్‌ షాపులు క్లోజ్‌ కానున్నాయి. మరి దానికి అసలు కారణం ఏంటో ఈ స్టోరీలో తెలుసుకందాం..

Hyderabad Non Veg Shops close
Hyderabad Non Veg Shops close
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 18, 2024, 10:37 AM IST

Hyderabad Non-Veg Shops close: నాన్​ వెజ్​ ప్రియులకు ముక్క లేనిదే ముద్ద దిగదు. మిగతా రోజుల్లో ఎలా ఉన్నా సండే వచ్చిందంటే చాలు దాదాపు అందరి ఇళ్లలో నాన్​వెజ్‌ వంటలు ఘుమఘమలాడుతుంటాయి. చికెన్​, మటన్​, ఫిష్​, ప్రాన్స్​ అంటూ నచ్చిన వాటిని తెచ్చుకుని ఫ్యామిలీతో కలిసి తింటూ ఎంజాయ్‌ చేస్తుంటారు. ఇక ఆ రోజున షాపుల ముందు క్యూ సంగతి చెప్పక్కర్లేదు. మాంసం కోసం ఉదయం నుంచి షాపుల వద్ద బారులు తీరుతారు. అంత ఇష్టం నాన్​వెజ్ అంటే​. అలాంటి నాన్​వెజ్​ ప్రియులకు ఓ షాకింగ్​ న్యూస్​. అది ఏంటంటే ఈ ఆదివారం(ఏప్రిల్​ 21) రోజున హైదరాబాద్​ నగరంలో ఎక్కడా కూడా నాన్‌వెజ్‌ దొరకదు! ఎందుకంటే ఆ రోజున చికెన్, మటన్‌ షాపులన్నీ క్లోజ్‌ ఉండనున్నాయి. అసలు ఈ ఆదివారం రోజున నాన్‌వెజ్‌ షాపులను ఎందుకు మూసివేస్తున్నారో మీకు తెలుసా ? ఇప్పుడు తెలుసుకుందాం..

కారణం ఇదే!: సిటీలో ఆదివారం రోజున నాన్‌వెజ్‌ అమ్మకాలు ఉండకపోవడానికి కారణం.. ఆ రోజున జైనుల మహావీర్‌ జయంతి పండుగ ఉండటమే. అయితే, ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని అన్ని కబేళాలతో పాటు మాంసం అమ్మే దుకాణాలను మూసివేయాలని జీహెచ్‌ఎంసీ ఆదేశాలిచ్చింది. ఈ మేరకు జీహెచ్​ఎంసీ కమిషనర్‌ రొనాల్డ్‌ రాస్ ఉత్తర్వులు జారీ చేశారు. జీహెచ్‌ఎంసీ అధికారుల ఆదేశాల ప్రకారం ఆదివారం రోజున ఎవరూ కూడా మాంసం విక్రయాలు జరపకూడదని తెలిపారు. కాబట్టి, ఆదివారం రోజున నగరంలో ఎక్కడా కూడా నాన్‌వెజ్‌ షాపులు ఓపెన్‌గా ఉండవు.

ఓపెన్​ చేస్తే కఠిన చర్యలు తప్పవ్​: హైదరాబాద్‌ నగరంలో జైనుల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల.. వారికి ఎంతో పవిత్రమైన మహావీర్‌ జయంతి నాడు నాన్‌వెజ్‌ షాపులు క్లోజ్‌ చేయాలని జీహెచ్‌ఎంసీ ఆంక్షలు విధించింది. ఎవరైనా షాపుల ఓనర్లు నిబంధనలను అతిక్రమించి మాంసం విక్రయాలను జరిపితే కఠిన చర్యలు ఉంటాయని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ తెలిపారు. కాబట్టి, షాపు యజమానులందరూ, ప్రజలు కూడా సహకరించాలని అధికారులు కోరారు. అలాగే జీహెచ్‌ఎంసీ సిబ్బంది, అధికారులు మాంసం విక్రయాలు జరపకుండా చూడాలని తెలియజేశారు. సోమవారం రోజున (22న) యథావిధిగా అన్ని కబేళాలు, మాంసం అమ్మే దుకాణాలను తెరుచుకోవచ్చని ఉత్తర్వులలో పేర్కొన్నారు.

ఎన్నికల ప్రచారంపై కాంగ్రెస్ ఫోకస్- స్టార్ క్యాంపెయినర్​గా రంగంలోకి సీఎం రేవంత్​రెడ్డి - lok sabha elections 2024

'నిరాధారణ ఆరోపణలు చేసిన మీపైనా కేసు నమోదు చేస్తాం' - షకీల్​కు హైదరాబాద్ పోలీస్ స్ట్రాంగ్ కౌంటర్ - Jubilee Hills Road Accident Case

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.