ETV Bharat / state

శ్రీవారి భక్తులకు గుడ్​న్యూస్​ - ఇక నుంచి అడిగినన్ని లడ్డూలు ఇస్తారు - ఎప్పటి నుంచో తెలుసా? - NO RESTRICTIONS ON TIRUMALA LADDU

-లడ్డూల విషయంలో టీటీడీ కీలక నిర్ణయం -"పోటు" సిబ్బంది నియామకానికి టీటీడీ చర్యలు

No Restrictions on Tirumala Laddu
No Restrictions on Tirumala Laddu (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 4, 2024, 11:26 AM IST

No Restrictions on Tirumala Laddu : తిరుపతి దర్శనమంటే భక్తులకు మధురానుభూతి. శ్రీవారిని ఎంత భక్తితో పూజిస్తారో.. స్వామి ప్రసాదాన్ని కూడా భక్తులు అంతే పవిత్రంగా భావిస్తారు. శ్రీవారి నివేదనలకు ఎన్నో రకాల ప్రసాదాలు తయారవుతున్నా.. లడ్డూలకు విశేష ఆదరణ ఉంది. అందుకే తిరుపతి వచ్చిన భక్తులు.. వెంకన్న సుందర రూపాన్ని చూశాక ఎంత సంతోషిస్తారో.. శ్రీవారి ప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత కూడా అంతే గొప్ప అనుభూతికి లోనవుతారు. ఎందుకంటే ఆ రుచి వేరు అంతే.. ఎవరైనా తిరుమల వెళ్లొచ్చాం అని చెప్పగానే దర్శనం ఎలా జరిగింది అనే మాటకన్నా.. లడ్డూ ఏది అని అడుగుతారు! అంతలా భక్తులకు చేరువైంది శ్రీ వేంకటేశ్వరుడి లడ్డూ ప్రసాదం. అయితే తిరుమల దర్శనం అనంతరం లడ్డూలను పరిమితి ప్రకారం ఇచ్చేవారు. దీంతో ఎక్కువ కావాలనుకున్న వారికి నిరాశే ఎదురయ్యేది. ఈ పరిస్థితిని మార్చేస్తూ.. తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

శ్రీవారి భక్తులకు అడిగినన్ని లడ్డూలు ఇచ్చేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు చేపట్టింది. ఈ మేరకు అదనంగా లడ్డూల తయారీకి అవసరమైన "పోటు" సిబ్బంది నియామకానికి సిద్ధమవుతోంది. టీటీడీ ప్రస్తుతం రోజుకు 3.5 లక్షల చిన్న లడ్డూలు, ఆరు వేల పెద్ద లడ్డూలు (కల్యాణం లడ్డూ), 3,500 వడలు తయారు చేస్తోంది. తిరుమలతోపాటు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, తిరుపతిలోని స్థానిక ఆలయాల్లోనూ స్వామి ప్రసాదాన్ని విక్రయిస్తున్నారు. సాధారణంగా దర్శనం చేసుకున్న భక్తులకు ఒక లడ్డూను ఉచితంగా ఇస్తున్నారు. రోజుకు సరాసరి 70 వేల మంది శ్రీవారిని దర్శించుకుంటున్నారు. ఈ లెక్కన ఉచిత లడ్డూలే 70 వేలు భక్తులకు అందివ్వాలి. వీటితోపాటు భక్తులు తమ బంధువులు, చుట్టుపక్కల ఉన్నవారికి శ్రీవారి ప్రసాదాన్ని ఇచ్చేందుకు అదనంగా మరికొన్ని కొనుగోలు చేస్తుంటారు.

ప్రత్యేక రోజుల్లో డిమాండ్‌ ఉండటంతో.. సాధారణ రోజుల్లో లడ్డూల విషయంలో ఇబ్బందులు లేకున్నా.. వారాంతాలు, ప్రత్యేక పర్వదినాలు, బ్రహ్మోత్సవాల సమయంలో డిమాండ్‌ అధికంగా ఉంటోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని అదనంగా మరో 50వేల చిన్న లడ్డూలు, 4వేల పెద్ద లడ్డూలు, 3,500 వడలు తయారు చేయాలని టీటీడీ నిర్ణయించింది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం ఉన్న సిబ్బందికి అదనంగా మరో 74 మంది శ్రీవైష్ణవులతోపాటు మరో 10 మంది శ్రీవైష్ణవులు కానివారిని నియమించనున్నారు. ఒక్కసారి సిబ్బంది నియామకం పూర్తైన తర్వాత భక్తులు అడిగనన్ని లడ్డూలు లభించనున్నాయి.

తిరుమల శ్రీవారి లడ్డూకే ఎందుకంత రుచి? - ఇలా తయారు చేస్తారు కాబట్టే ఆ స్పెషల్ టేస్ట్

శ్రీవారి భక్తులకు అద్భుతమైన శుభవార్త - తిరుపతి లడ్డూ మీ ఊళ్లోనే లభిస్తుంది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.