No Confidence Motion in Manthani Constituency : పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పురపాలక సంఘం ఛైర్పర్సన్ పుట్ట శైలజ, వైస్ ఛైర్మన్ ఆరేపల్లి కుమార్‌పై కాంగ్రెస్ పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. ఈ నెల ఒకటో తేదీనా కౌన్సిలర్లు జిల్లా పాలనాధికారికి అవిశ్వాస తీర్మానాన్ని అందజేశారు. మొత్తం 13 కౌన్సిలర్లకు గాను 9 మంది అవిశ్వాస తీర్మానానికి ఆమోదం తెలిపారు. మంథని పురపాలక సంఘం కార్యాలయంలో ఆర్డీవో హనుమానాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవిశ్వాస తీర్మానంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు, బీఆర్ఎస్ పార్టికి చెందిన ఏడుగురు కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా చేతులు ఎత్తారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తుగా మంథనిలో భారీగా పోలీసులను మోహరించారు.
ఉద్రిక్తతల మధ్య ఇల్లందు మున్సిపల్ ఛైర్మన్‌పై వీగిన అవిశ్వాసం
"మున్సిపాలిటీకి సంబంధించిన 9మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానికి ప్రతిపాదించడం జరిగింది. సమావేశానికి మొత్తం 13మంది కౌన్సిలర్లలో 9మంది హాజరయ్యారు. ఛైర్పర్సన్, వైస్ ఛైర్మన్‌పై పెట్టిన తీర్మానానికి వచ్చిన వారందరు అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపారు. చేతులు ఎత్తి తమ ఆమోదాన్ని తెలియజేయటం జరిగింది." - హనుమా నాయక్, రెవెన్యూ డివిజనల్ అధికారి
నర్సంపేటలో 14 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు పార్టీకి రాజీనామా
No Trust Motion in Manthani Municipal : అనంతరం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో పార్టీలో చేరిన కౌన్సిలర్ శ్రీపతి బాలయ్య మాట్లాడారు. గత 4 సంవత్సరాలుగా మంథనిలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదని అనేక నిధులు వచ్చిన సమయంలో వినియోగించుకోకుండా ప్రజలను మోసం చేశారని కనీసం కౌన్సిలర్లకు సరైన విలువ ఇవ్వకపోవడంతో విసుగు చెందిన వారు కాంగ్రెస్ పార్టీలో చేరామని తెలిపారు. తమకు ఎలాంటి సమస్యలు వచ్చినా వారు సహాయం చేయలేదన్నారు. మున్సిపల్ ఛైరపర్సన్, వైస్ ఛైర్మన్లపై తొమ్మిది మందిని అవిశ్వాస తీర్మానం పెట్టి తొలగించడం జరిగిందని తెలిపారు.
బిహార్ అసెంబ్లీ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం! సీఎం తొలి కేబినెట్ మీటింగ్
"గత పది సంవత్సరాల నుంచి మంథనిలో బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి అభివృద్ధి చేయలేదు. కాంగ్రెస్ నాయకులు మంథనిలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. అందుకే ఈరోజు మేము బీఆర్ఎస్ పార్టీ 7మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరాము. ఈరోజు వరకు ఏ బీఆర్ఎస్ నాయకుడు మంథనిలో అభివృద్ది చేయలేదు మాకు ఎలాంటి సహాయం చేయలేదు. కోట్ల రుపాయలు వచ్చాయని చెబుతారు కానీ ఎక్కడ చూసిన ఏ పని జరగలేదు. అందుకే ఛైర్ పర్సన్ పుట్ట శైలజ, వైస్ ఛైర్మన్ ఆరేపల్లి కూమార్‌పై అవిశ్వాసం తీర్మాం పెట్టి వారిని తొలగించగలిగాం." - శ్రీపతి బాలయ్య , కౌన్సిలర్
అసంతృప్త కౌన్సిలర్ల అవిశ్వాస తీర్మానాలు - పురపాలికల్లో మారుతున్న పాలకులు