Niranjan Reddy Fires On Congress Congress Govt : గత ప్రభుత్వాన్ని దోషిగా చూపాలన్న ప్రయత్నంలో రైతులకు ఎందుకు అన్యాయం చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వం(Government) నీళ్లు, విద్యుత్ ఇవ్వక లక్షలాది ఎకరాల్లో పంటలు(Crops) ఎండిపోతున్నాయని వడగళ్ల వానతో వేలాది ఎకరాలు పంటనష్టం జరిగిందని అన్నారు.
రైతుబంధు ఇవ్వకపోగా అడిగితే దూషిస్తున్నారన్న మాజీ మంత్రి విమర్శించారు. నీళ్లు, విద్యుత్ ఇవ్వడానికి ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల్లోనే వ్యవసాయాన్ని(Agriculture) అతలాకుతలం చేసిందని ఆక్షేపించారు. విద్వేషం, కేసీఆర్ను తిట్టడం తప్ప పాలనపై దృష్టి లేదని నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీళ్లు ఇవ్వడం చేత కాదు కానీ, నేతలను చేర్చుకునేందుకు గేట్లు ఎత్తుతారట అని ఎద్దేవా చేశారు. రాజకీయం తప్ప రైతులకు నీళ్లు ఇవ్వాలన్న తపన లేదని ఆరోపించారు. రైతులు నీళ్లు, కరెంట్ అడిగితే వారిపై కేసులు పెడుతున్నారన్నారని ఆరోపించారు.
Niranjan Reddy On Crop Damage : పంటకు నీళ్లు అందించలేక పశువులకు మేతగా పెడుతున్నారు, కళ్ల ముందే పంటలు పోతుంటే రైతులకు ఎంత బాధ ఉంటుందో తెలుసా? అని ప్రశ్నించారు. కేసీఆర్ హాయాంలో నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ.10వేలు పరిహారం ఇచ్చినట్లు గుర్తు చేశారు. పదివేలు భిక్షం ఇస్తారా అని నాడు ఆడిగిన కాంగ్రెస్(Congress) నేతలు ఇప్పుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వడగళ్ల వాన కారణంగా నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ.10వేల పరిహారం ఇవ్వాలని, ప్రభుత్వ నిర్వాకం కారణంగా ఎండిన పంటలకు కూడా ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు.
సాగునీటికోసం అన్నదాతల ఆందోళన - పంటలు ఎండిపోతున్నాయంటూ ఆవేదన
Niranjan Reddy Comments on congress : రాష్ట్రంలో రైతుల గురించి కూడా ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. అప్పులు అని కేసీఆర్పై దుష్ప్రచారం చేసిన కాంగ్రెస్ నేతలు వంద రోజుల్లో రూ.16,400 కోట్లు అప్పులు ఎలా చేశారని ప్రశ్నించారు. రైతుబంధుకు పైసలు లేవు కానీ, గుత్తేదార్లకు మాత్రం బిల్లులు ఇచ్చారని ఆక్షేపించారు. రేవంత్ సర్కార్లో నిరుద్యోగులకు మెగా మోసమే అన్న ఆయన కేసీఆర్ సర్కార్ ప్రక్రియ పూర్తి చేసిన 30 వేల ఉద్యోగాలు మేం ఇచ్చామని ఎలా చెప్పుకుంటారని ప్రశ్నించారు. 25 వేల ఖాళీలతో మెగా డీఎస్సీ అన్న నేతలు మళ్లీ ఇప్పుడు కేవలం 11 వేలకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారని మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కార్ది దొంగ తెలివి అన్న నిరంజన్ రెడ్డి నిరుద్యోగులు వాస్తవాలు ఆలోచించాలని కోరారు.
"గత ప్రభుత్వంపై విమర్శలు చేయడానికే కాంగ్రెస్ సర్కారు పరిమితమవుతోంది. ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీళ్లు ఇవ్వటం చేతకాదంటారు కానీ రాజకీయ గేట్లు ఎత్తి అందరూ చేరాలని మాట్లాడుతున్నారు. పార్టీల మీద ఉన్న దృష్టి రైతులపై లేదు. ప్రణాళికబద్ధంగా ఉన్న నీటి వనరులను ఏవిధంగా ఉపయోగించుకుందామనే ఆలోచన ప్రభుత్వానికి లేదు" -సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మాజీ మంత్రి
మోటార్ లేకుండా పంట సాగు - ఎలా సాధ్యమైందబ్బా
సాగునీరు లేక పంట పొలాలు వెల వెల.. లబోదిబోమంటున్న కర్షకులు
బోరు పోయదు.. కాలువ పారదు.. నీళ్లు లేక ఎండిపోతున్న పంటలు.. ఆవేదనలో అన్నదాతలు