ETV Bharat / state

ఆ 3 టోల్​ప్లాజాల వద్ద టోల్​ వసూళ్ల బాధ్యతలు మూడు కొత్త ఏజెన్సీలకు - Hyderabad Vijayawada Highway Toll

హైదరాబాద్​- విజయవాడ హైవే టోల్​ కలెక్షన్​ బాధ్యత మూడు సంస్థలకు - కీలక నిర్ణయం తీసుకున్న ఎన్​హెచ్​ఏఐ

author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

Hyderabad Vijayawada Highway Toll Fee Collection
Hyderabad Vijayawada Highway Toll Fee Collection (ETV Bharat)

Hyderabad Vijayawada Highway Toll Fee Collection : హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై ఉన్నటోల్‌ప్లాజాల వద్ద టోల్‌ వసూళ్లు చేసే బాధ్యతను జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) తాజాగా మూడు ఏజెన్సీలకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ జాతీయ రహదారిపై 2012 డిసెంబరు నుంచి టోల్‌ వసూళ్లను ప్రారంభించిన జీఎమ్మార్‌ సంస్థ నిర్దేశిత గడువు(2025 జూన్‌)కు ఏడాది ముందే టోల్‌ వసూళ్ల బాధ్యతతో పాటు హైవే నిర్వహణ నుంచి తప్పుకొంది.

ఈ నేపథ్యంలోనే జాతీయరహదారుల ప్రాధికార సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) జులై నుంచి సెప్టెంబరు వరకు మూడు మాసాల పాటు టోల్‌ వసూళ్ల నిర్వహణను తాత్కాలికంగా రెండు ఏజెన్సీలకు అప్పగించింది. పంతంగి, కొర్లపహాడ్‌ వద్ద టోల్​ వసూళ్ల బాధ్యత స్కైలాబ్‌ ఇన్‌ఫ్రా, చిల్లకల్లు వద్ద కోరల్‌ ఇన్‌ఫ్రా సంస్థ ఈ బాధ్యతను చూసుకుంది. వీటి గడువు ముగియడం వల్ల తాజాగా 3 నూతన ఏజెన్సీలకు ఏడాది పాటు ఆ బాధ్యతను అప్పగిస్తూ ఎన్‌హెచ్‌ఏఐ నిర్ణయం తీసుకుంది.

మూడు టోల్​ప్లాజాలు - మూడు ఏజెన్సీలకు : పంతంగి టోల్‌ప్లాజా వద్ద ఇండియా మార్ట్‌కు, కొర్లపహాడ్‌ టోల్‌ప్లాజా వద్ద ఈగల్‌ ఇన్‌ఫ్రా సంస్థకు, చిల్లకల్లు వద్ద అష్మీ రోడ్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు టోల్​ వసూళ్ల అప్పగించింది. ఈ ఏజెన్సీలు ఈ అక్టోబర్​ 5 లేదా 10వ తేదీ నుంచి టోల్‌ వసూళ్లను చేపట్టనున్నట్లుగా సమాచారం. మరోవైపు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం దండుమల్కాపురం నుంచి ఆంధ్రప్రదేశ్​లోని నందిగామ వరకు ఆరు వరుసల జాతీయ రహదారిగా విస్తరణకు సంబంధించిన డీపీఆర్‌(డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) ప్రస్తుతం బిడ్డింగ్‌ దశలో ఉందని, వచ్చే ఏడాదిలో పనులు ప్రారంభమయ్యే అవకాశముందని ఎన్‌హెచ్‌ఏఐకి చెందిన ఉన్నతాధికారి ఒకరు వివరించారు.

ఫాస్ట్‌ట్యాగ్‌​కూ కాలం చెల్లిందా? - కొత్త టెక్నాలజీతో టోల్​గేట్ల పరిస్థితి ఏంటి? -

వాహనదారులకు అలర్ట్ - ఓఆర్ఆర్ టోల్ ఛార్జీలు పెంపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.