ETV Bharat / state

"మీకు ఏ బ్రాండ్ కావాలి సర్.. ఆర్డర్ ప్లీజ్" - నేటినుంచి తెరుచుకుంటున్న కొత్త మద్యం దుకాణాలు!

నేటి నుంచి ఏపీలో ప్రారంభం కానున్న నూతన మద్యం దుకాణాలు - లాటరీలో లైసెన్స్‌ దక్కించుకున్న యజమానులు, కొత్త దుకాణాల్లో మద్యం అమ్మేందుకు అంతా సిద్ధం - షాపుల కోసం ప్రాంగణాలను వెతుకుతున్న లైసెన్స్‌దారులు

new liquor Shops in AP
New Wine Shops Open in AP (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 16, 2024, 7:07 AM IST

Updated : Oct 16, 2024, 10:42 AM IST

New Liquor Shops Open in AP : ఏపీలో నిర్వహించిన మద్యం లాటరీలో దుకాణాలను దక్కించుకున్న యజమానులు అమ్మకాలకు సిద్ధమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 3,396 మద్యం దుకాణాలకు నోటిఫై చేసి లాటరీ తీసి లైసెన్స్‌ కేటాయించారు. లైసెన్స్‌ పొందిన వారంతా నేటి నుంచి షాపులు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఏపీవ్యాప్తంగా చాలా చోట్ల లైసెన్స్‌దారులు ప్రాంగణాలను చూసుకునే పనిలో పడ్డారు. ఎన్టీఆర్‌ జిల్లాలో అద్దెకు షాపుల కోసం తీవ్రంగా వెతుకుతున్నారు. విజయవాడ నగరంలో చాలా మందికి ఇప్పటికిప్పుడు అద్దెకు షాపులు దొరకలేదు. ప్రభుత్వ నిబంధనల మేరకు స్కూళ్లు, కళాశాలలు, ప్రార్థనా మందిరాలు, ఆసుపత్రులకు వంద మీటర్ల దూరంలో మద్యం షాపులు ఏర్పాటు చేయాల్సి ఉంది.

నిబంధనల మేరకు చాలాచోట్ల షాపులు దొరకడం లేదు. కొన్ని ప్రాంతాల్లో అద్దెలు ఎక్కువగా ఉండడంతో నిర్వాహకులు వెనుకంజ వేస్తున్నారు. సిండికేట్‌తో సంబంధం లేకుండా సొంతంగా షాపులు దక్కించుకున్న వారు తమ లైసెన్సులను ఇతరులకు ఇచ్చేందుకు బేరసారాలు జరుపుతున్నారు. చాలా షాపులు చేతులు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త మద్యం విధానంలో భాగంగా ఇప్పటి వరకు నడుస్తున్న ప్రభుత్వ షాపులు మూతపడ్డాయి. వీటిలోని సరకును వ్యాపార సమయం ముగిసిన తర్వాత మద్యం డిపోల అధికారులు, సిబ్బంది లెక్కించారు. సరకును బుధవారం ఉదయం నుంచి సాయంత్రంలోగా సంబంధిత డిపోలకు చేరుస్తారు.

రెండేళ్ల పాటు అమలులో ఉండే పూర్తిస్థాయి లైసెన్స్‌ : వాకిన్‌స్టోర్లలోని సరకును తరలిస్తారు. ప్రైవేటు షాపులు తెరిచినా, తెరవకపోయినా ప్రభుత్వ దుకాణాలను అన్ని చోట్లా మూసి వేశారు. షాపులు దక్కించుకున్న వారు నిబంధనల ప్రకారం వార్షిక లైసెన్సు రుసుములో ఆరో వంతు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంది. దుకాణదారులు ఈ మొత్తాన్ని చెల్లించడంతో తాత్కాలిక లైసెన్స్‌ జారీ చేశారు. ఇది ఈనెల 22వ తేదీ వరకు అమలులో ఉంటుంది. షాపులను అద్దెకు తీసుకున్న తర్వాత రెండేళ్ల పాటు అమలులో ఉండే పూర్తిస్థాయి లైసెన్స్‌ ఇస్తారు. ప్రైవేటు మద్యం దుకాణాల ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరనుంది.

ఏపీ మద్యం పాలసీ ట్విస్ట్​లు - మంత్రి నారాయణ 100 దరఖాస్తులు చేస్తే ఎన్ని వచ్చాయో తెలుసా?

ఏపీలో మద్యం దుకాణాలకు లాటరీ ముగిసింది - విజేతలు ఎవరంటే!

Last Updated : Oct 16, 2024, 10:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.