ETV Bharat / state

గుడ్​న్యూస్ : జనవరి నుంచి కొత్త పింఛన్లు - 6 నెలలకోసారి కొత్త దరఖాస్తులకు మోక్షం

ఏపీలో ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద కొత్త పింఛన్లు - జనవరిలో మంజూరు చేయాలని ప్రభుత్వ ఆదేశాలు - ప్రతి ఆరు నెలలకు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి అర్హతను బట్టి పింఛన్లు

NTR bharosa scheme from january in AP
AP Minister On New pension issuing (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

AP Minister On New pension issuing : ఏపీలో ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద కొత్త పింఛన్లను జనవరిలో మంజూరు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ ఆదేశించారు. ప్రతి 6 నెలలకు ఒకసారి కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి అర్హతను బట్టి పింఛన్లు మంజూరు చేయాలని తెలిపారు.

పింఛన్లపై సోమవారం సమీక్ష : సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు వరుసగా రెండు నెలలు పింఛను తీసుకోకపోయినా మూడో నెల ఆ మొత్తం పింఛను కలిపి లబ్ధిదారుకు అందించాలని అధికారులకు సూచించారు. ఈ విధానాన్ని డిసెంబరు నుంచే అమల్లోకి తీసుకురావాలని తెలిపారు. భర్త చనిపోయిన వారు మరణ ధ్రువీకరణ పత్రం సమర్పించిన వెంటనే వారికి వితంతు కేటగిరీలో పింఛను మంజూరు చేయాలని ఆదేశించారు. సచివాలయంలోని ఛాంబర్‌లో అధికారులతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ సామాజిక భద్రత పింఛన్లపై సోమవారం సమీక్ష నిర్వహించారు.

ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ఏపీలో కూటమి ప్రభుత్వం ముందడుగు వేసింది. ఇకపై ఏ నెలలోనైనా పింఛను తీసుకోకపోతే ఆ మరుసటి నెల మొత్తం కలిపి ఇస్తారని స్పష్టం చేసింది. రెండు నెలలు తీసుకోలేకపోతే ఆ తర్వాత మూడో నెలలో మొత్తం కలిపి ఇస్తామని తెలిపారు. దీనిపై ఇప్పటికే సీఎం అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

గత ప్రభుత్వ హయాంలో అనర్హులకు వివిధ కేటగిరీల్లో పెద్ద ఎత్తున పింఛన్లు మంజూరు చేశారనే ఫిర్యాదులున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వద్ద ఉన్న డేటా ఆధారంగా లబ్ధిదారుల జాబితాలను పరిశీలించాలని అధికారులు నిర్ణయించారు. ఈ తనిఖీల్లో అనర్హులుగా తేలిన వారి వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల వారీగా పంపి క్షేత్రస్థాయిలో సమీక్ష చేస్తారు. ఇక్కడ అనర్హులుగా నిర్ధారణ అయితే పింఛన్‌ నిలిపివేస్తారు. ఈ క్రమంలో అర్హుల పింఛన్లు పోతే గ్రామ సభల్లో ఫిర్యాదులు తీసుకుని పరిశీలించి పింఛను కొనసాగిస్తారు. ఈ ప్రక్రియకు సంబంధించి ఎస్‌వోపీని తయారుచేయాలని అధికారులకు మంత్రి తెలిపారు.

'నా పింఛన్​ ఇందుకోసం రావట్లేదా? - బతికుండగానే చంపేశారు కదా సారూ'

1వ తేదీన సెలవు దినంగా ఉంటే - ఇకపై ముందు రోజే పింఛన్ల పంపిణీ - Distribution Of Pension In AP

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.