NARA LOKESH ON STONE ATTACK ON JAGAN : ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన గులకరాయి దాడి కేసులో ఐదుమంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అజిత్‌సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన యువకులుగా అనుమానిస్తున్న పోలీసులు స్థానికులు తీసిన వీడియోలను పరిశీలించి అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ ఆధ్వర్యంలో అనుమానితులను అదుపులోకి తీసుకుని సీసీఎస్ పోలీసులకు అప్పగించినట్లు సమాచారం. ఈ విషయంపై టీడీపీ(TDP) నేతలు స్పందించారు.
మండదా అక్కా! మండదా అన్నా! : ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్పై రాయి దాడి అంశంలో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. క్వార్టర్ మేటర్ దగ్గరే జగన్‌పై దాడి జరిగిందంటూ లోకేశ్ సెటైర్లు వేశారు. క్వార్టర్ మందుతో పాటు ఇస్తానన్న 350 ఇవ్వనందుకే దాడి అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. "మండదా అక్కా! మండదా చెల్లీ! మండదా తమ్ముడు! మండదా అన్నా!" అంటూ జగన్ ప్రసంగం డైలాగులనే ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. "కోడికత్తి డ్రామా 2 (KodiKathiDrama2) " వైఎస్సార్సీపీ అంతం అంటూ పోస్ట్ చేశారు.
TDP Spokesperson Pattabhi Comments on Stone Attack on Jagan : ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గులకరాయి డ్రామాపై సీబీఐ(CBI) విచారణ చేయిస్తామని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి రామ్ స్పష్టం చేశారు. నిన్నటి వరకు ఆధారాలే లేవన్న పోలీసులకు తెల్లారే సరికి నిందితులు ఎలా దొరికారని అనుమానం వ్యక్తం చేశారు.
Stone Attack on AP CM Jagan : అసలు రాయే దొరకలేదని, అగంతకుడి ఆచూకీ తెలిపిన వారికి రూ.2 లక్షల బహుమానం ఇస్తామని సోమవారం ప్రకటించారు. మంగళవారానికి రాయి వేసిన వ్యక్తి దొరికారని అంటున్నారని అన్నారు. జగన్‌కు తొత్తులుగా కొందరు అధికారులు గులకరాయి నాటకాన్ని రక్తి కట్టించాలని చూస్తున్నారని పట్టాభి ఆరోపించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ డ్రామాపై ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక సీబీఐతో విచారణ జరిపిస్తామని తెలిపారు. ఆ రోజు ఈ పథక రచనలో భాగస్వాములైన వాళ్లు ముద్దాయిలుగా బోన్లో నిలబడాల్సిన పరిస్థితి వస్తుందని పట్టాభి హెచ్చరించారు.
నారా లోకేశ్‌కు జెడ్ కేటగిరి భద్రత - కేంద్ర హోం శాఖ నిర్ణయం - Lok Sabha Elections 2024