Nara Chandrababu Naidu Made Key Comments: గెలుపు ఎన్డీఏదే, అందులో ఎవరికీ అనుమానం లేదని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు తెలిపారు. మోదీకి అండగా ఉంటామని చెప్పేందుకే ప్రజలు తరలివచ్చారన్నారు. పల్నాడు జిల్లా బొప్పూడిలో తెలుగుదేశం - జనసేన - బీజేపీ ప్రజాగళం (Praja Galam) బహిరంగ సభలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. ప్రజాగళం సభ, రాష్ట్ర పునర్నిర్మాణ భరోసా అని వెల్లడించారు. ఐదేళ్లుగా విధ్వంస, అహంకార పాలన చూశామని, ప్రజల గుండెచప్పుడు బలంగా వినిపించేందుకే మూడు పార్టీలు కలిశాయని చంద్రబాబు తెలిపారు. మీరు ఇచ్చిన తీర్పే మీ జీవితాలను నిర్ణయిస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు.
Chandrababu Comments ON NDA : ప్రజల ఆశీర్వాదాలు ఎన్డీఏకు(NDA GOVT) ఇవ్వాలని చంద్రబాబు కోరారు. సంక్షేమం, అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణే తమ నినాదమని చంద్రబాబు తెలిపారు. మోదీ ఒక వ్యక్తి కాదు, భారత్‌ను విశ్వగురుగా మారుస్తున్న శక్తి అని కొనియాడారు. మోదీ అంటే సంక్షేమం, మోదీ అంటే అభివృద్ధి అని తెలిపారు. మోదీ అంటే భవిష్యత్తు, మోదీ అంటే ఆత్మవిశ్వాసమని చంద్రబాబు వెల్లడించారు. సంక్షేమ పథకాలకు (Welfare Schemes) కొత్త నిర్వచనం చెప్పిన వ్యక్తి ప్రధానమంత్రి మోదీ అని కొనియాడారు.
చరిత్రలో నిలిచేలా ప్రజాగళం సభ - పదేళ్ల తర్వాత మళ్లీ ఒకే వేదికపైకి ముగ్గురు అగ్రనేతలు
Chandrababu Comments ON Modi : అభివృద్ధి కార్యక్రమాలతో సంపద సృష్టించిన వ్యక్తి మోదీ అని చంద్రబాబు పేర్కొన్నారు. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ మోదీ నినాదాలని చంద్రబాబు తెలిపారు. జెండాలు వేరైనా మూడు పార్టీల అజెండా ఒక్కటే అని వెల్లడించారు. వికసిత్ భారత్ దిశగా మన దేశం దూసుకుపోతోందన్నారు. పేదరికం లేని దేశం అనేది మోదీ కల అని, ఆయన ఆశయాలతో మనమంతా అనుసంధానం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. సరైన సమయంలో దేశానికి మోదీ లాంటి నేత వచ్చారన్నారు. ప్రపంచంలో భారత్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది మోదీ అని చంద్రబాబు కొనియాడారు. భారత్‌ను శక్తిమంతమైన జాతిగా తయారు చేయడమే మోదీ లక్ష్యమని పేర్కొన్నారు.
'ల్యాండ్, శాండ్, వైన్, మైన్ రంగాల్లో దోచేశారు'
2014లో తాము అధికారంలో ఉన్నప్పుడు 11 జాతీయ విద్యాసంస్థలను తెచ్చామన్న చంద్రబాబు, గత ప్రభుత్వంలో కేంద్రం సాయంతో పోలవరాన్ని 72 శాతం పూర్తి చేసినట్లు తెలిపారు. శాండ్, ల్యాండ్, వైన్, మైన్, అన్ని రంగాల్లో సీఎం జగన్ దోచేశారని చంద్రబాబు ఆరోపించారు. ఐదేళ్లుగా రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులను తరిమేశారని మండిపడ్డారు. విధ్వంసమే తన విధానంగా రాష్ట్రాన్ని కూల్చిన వ్యక్తి సీఎం జగన్ అని చంద్రబాబు మండిపడ్డారు. అక్రమ కేసులు పెట్టి రాజకీయాలను కలుషితం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అధికార దాహానికి సొంత బాబాయే బలయ్యారని ఆరోపించారు. జగన్‌కు ఓటేయవద్దని చెల్లెళ్లే చెప్పారంటే ప్రజలు అర్థం చేసుకోవాలని చంద్రబాబు తెలిపారు. జగన్ పాలనలో ఎవరికైనా లాభం జరిగిందా? అని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ప్రజలంతా సిద్ధం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. మన పిల్లల జీవితాలు బాగుపడేందుకే పొత్తు పెట్టుకున్నట్లు తెలిపారు.
టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల రెండో జాబితా విడుదల - 34 మందికి ఛాన్స్
ఏపీలోని పిఠాపురం నుంచి బరిలో దిగనున్న జనసేనాని పవన్ కల్యాణ్