ETV Bharat / state

ఏసీబీ వలలో మరో అవినీతి తిమింగలం - రూ.3 లక్షలు తీసుకుంటూ పట్టుబడ్డ నల్గొండ ఆసుపత్రి సూపరింటెండెంట్

Nalgonda Hospital Superintendent Bribe Case : నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ లచ్చునాయక్ ఏసీబీ వలకు చిక్కాడు. ఔషధాల టెండర్‌ కోసం రూ.3 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్​ హ్యాండెడ్​గా పట్టుబడ్డాడు. తన ఇంట్లో డబ్బులు తీసుకుంటుండగా అధికారులు దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 16, 2024, 12:33 PM IST

Updated : Feb 16, 2024, 1:35 PM IST

Nalgonda Hospital Superintendent Bribe Case : ఏసీబీ వలకు మరో అవినీతి తిమింగలం చిక్కింది. రూ.3 లక్షలు లంచం తీసుకుంటూ నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ లచ్చునాయక్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కాడు. ఔషధాల టెండర్‌ కోసం ఓ వ్యాపారిని ఆయన రూ.3 లక్షలు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని (ACB)ఆశ్రయించాడు. ఈరోజు తన ఇంట్లోనే లంచం తీసుకుంటుండగా అధికారులు అతణ్ని రెడ్ ​హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రెండేళ్ల క్రితం బదిలిపై నల్గొండకు వచ్చిన లచ్చునాయక్‌పై గతంలోను పలు ఆరోపణలు ఉన్నాయి.

ACB Caught Nalgonda Hospital Superintendent : నల్గొండకు చెందిన రాపోల్‌ వెంకన్న అనే వ్యక్తి గత కొన్నేళ్లుగా రవి ఏజెన్సీ పేరుతో మెడికల్‌ డిస్ట్రిబ్యూటర్‌ దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. రెండేళ్ల క్రితం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి జనరల్‌ మెడిసిన్ పంపిణీ చేయడానికి టెండర్‌ ద్వారా కాంట్రాక్ట్‌ తీసుకున్నారు. ఆయనకు అప్పడే బదిలీపై వచ్చిన సూపరింటెండెంట్ డాక్టర్.లచ్చునాయక్‌ ( Superintendent Lachunayak) పరిచమయ్యారు.

బాసు లంచం అడిగావో జైలు ఖాయమంటున్న ఏసీబీ అధికారులు

ACB Traps Nalgonda Hospital Superintendent : ఈ క్రమంలోనే ఆసుపత్రిలో కొన్ని మందులు అత్యవసర పరిస్థితుల్లో సరాఫరా చేయడానికి టెండర్‌ పిలుస్తున్నామని, అందులో 10 శాతం కమీషన్‌ తనకు ఇస్తే టెండర్‌ మీకు వస్తోందని లచ్చునాయక్‌ రాపోల్ వెంకన్నకు తెలిపారు. దీంతో ఇరువురూ ఓ ఒప్పందం చేసుకున్నారు. అనుకున్నా దాని ప్రకారం ఆయన సూపరింటెండెంట్‌కు కమీషన్ ఇచ్చారు. మూడు నెలలు క్రితం కమీషన్‌ పెంచాలని లేదంటే టెండర్‌ పిలిచి మరోకరికి ఇస్తామని లచ్చునాయక్‌ రాపోల్ వెంకన్నను బెదిరించాడు.

దీంతో నెల రోజులు క్రితం రాపోల్ వెంకన్న లక్ష రూపాయలు లచ్చునాయక్‌కు ముట్టజెప్పారు. నాలుగు రోజులు క్రితం మరో రూ.3 లక్షలు కావాలని డిమాండ్ చేశారు. డబ్బులు కట్టలేక బాధితుడు వెంకన్న ఏసీబీ డీఎస్పీని ఆశ్రయించారు. వారి సూచనలు మేరకు సూపరింటెండెంట్ నివాసంలో ఆయన డబ్బులు ఇస్తుండగా అవినీతి నిరోధక శాఖ అధికారాలు రెడ్ హ్యాండెండ్‌గా పట్టుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిఘా వేసి లచ్చునాయక్‌ నగదు తీసుకునే సమయంలో పట్టుకున్నామని ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ప్రభుత్వ అధికారులు ఏవరైనా లంచం డిమాండ్‌ చేస్తే తమకు ఫిర్యాదు చేయలని శ్రీనివాసరావు వివరించారు.

ఏసీబీ వలలో మరో అవినీతి తిమింగలం

"రెండేళ్లుగా ప్రభుత్వ ఆసుపత్రికి ఔషధాలు సరఫరా చేస్తున్నా. ఔషధాల సరఫరాపై సూపరింటెండెంట్‌ కమీషన్‌ అడిగారు. కొన్నాళ్లుగా సూపరింటెండెంట్‌ 10 శాతం కమీషన్‌ తీసుకుంటున్నారు. ఇటీవల అధికశాతం కమీషన్ కావాలని డిమాండ్ చేశారు. నెలరోజుల క్రితమే సూపరింటెండెంట్‌ రూ.లక్ష తీసుకున్నారు. 4 రోజులు క్రితం రూ.3 లక్షలు డిమాండ్ చేశారు. డబ్బులు కట్టలేక ఏసీబీ డీఎస్పీని సంప్రదించాను. వారి సూచనలు మేరకు ఉదయం డాక్టర్‌కి డబ్బులు ఇచ్చాను. ఆదే సమయంలో ఏసీబీ అధికారాలు లచ్చునాయక్‌ను పట్టుకున్నారు." - రాపోల్ వెంకన్న , ఔషధాల గుత్తేదారు

ముగిసిన శివబాలకృష్ణ ఏసీబీ కస్టడీ - రూ.250 కోట్ల పైనే ఆస్తులున్నట్లు గుర్తింపు

Banjarahills CI Bribe Case Updates : బంజారాహిల్స్ పోలీసుల వసూళ్ల పర్వంపై లోతుగా విచారణ.. ముడుపులు, కమీషన్లపై అనిశా ఆరా

Last Updated : Feb 16, 2024, 1:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.