Musi River Development Works In Hyderabad : రాష్ట్రంలో మూసీ నది పరీవాహక ప్రాంతాన్ని ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా, సంపదను సృష్టించే వనరుగా తీర్చిదిద్దే బృహత్తర ప్రణాళిక రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టి అతి తక్కువ కాలంలోనే పురోగతి చూపింది. మూసీకి ఇరువైపులా రెవెన్యూ హద్దుల నిర్ధారణ, వాటి ప్రకారం నదీ గర్భంలో ఉన్న నిర్మాణాల సర్వే, వాటిని తొలగించే ప్రక్రియ, పునరావాసం, ఇతరత్రా పనులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి త్వరగా అయ్యేలా చూస్తున్నారు. దీనికి సంబంధించిన మాస్టర్ ప్లాన్లు, రుణ సమీకరణ ఇతర ప్రక్రియలు కొలిక్కి వస్తున్నాయి.
- వంద శాతం మురుగుశుద్ధి మూసీలోకి చేరుతోన్న మురుగును వందశాతం శుద్ధి చేసేందుకు మురుగునీటి శుద్ధి కేంద్రాల ఏర్పాటు తుది దశకు చేరుకుంది.
- హైదరాబాద్ నగరంలో రోజూ 1950 ఎంఎల్‌డీల మురుగు ఏర్పడుతుండుతుంది. తాజాగా ప్రారంభించిన మురుగునీటి శుద్ధి కేంద్రాలతో కలిపి 75శాతం శుద్ధి చేయవచ్చు. మరో 25శాతం ఎస్టీపీలు నిర్మాణంలో ఉన్నాయి.
- ప్రస్తుతం నగరంలో 36 ఎస్టీపీలు అందుబాటులో ఉన్నాయి. మరో 9 నిర్మాణంలో ఉన్నాయి.
మొదటి దశలో పర్యాటకరంగం : మూసీ నది పరివాహక ప్రాంతాన్ని ఫేజ్-1లో నార్సింగి నుంచి బాపూఘాట్ వరకు 21 కిలోమీటర్ల మేక అబివృద్ధి చేయనున్నారు. ఫేజ్-2లో నాగోల్ నుంచి బాచారం వరకు ఉంటుంది. మొదటి దశ ప్రాంతంలో మూసీ వెంట గోల్కొండ, గండిపేట, రాజేంద్రనగర్ మండలాల్లో రక్షణ శాఖకు చెందిన 900 ఎకరాల భూమి ఉంది. వాటిని ప్రభుత్వానికి ఇవ్వాలని సీఎం రేవంత్ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కోరారు. వాటికి బదులు మరో ప్రాంతంలో భూములు ఇస్తామన్నారు.
రక్షణశాఖ అధికారులు భూములివ్వడానికి అనుకూలంగా ఉన్నట్లు సమాచారం. ఇక్కడే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి 100 ఎకరాల భూములు ఉన్నాయి. దీంతో మూసీవెంట ఉన్న 21 కిలోమీటర్ల మేర మరో వాణిజ్య నగరాన్ని నిర్మించడానికి వీలువుతుందని అధికారులు సీఎం రేవంత్‌కి తెలిపారు. వాణిజ్య, పర్యాటక ప్రాంతంగా దీన్ని తీర్చిదిద్దాలని ఇప్పటికే సీఎం నిర్ణయించారు.
మూసీ అభివృద్ధి పనిలో ముందడుగు - ప్రపంచ బ్యాంకు నుంచి రూ.4100 కోట్ల రుణానికి అనుమతి!
ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌లోని అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలు తొలగించాల్సిందే : హైకోర్టు