Mother and Daughter Fight with Thieves in Hyderabad : ఓ ఇంట్లోకి దొంగతానికి ప్రవేశించినా దుండగులను తరిమేందుకు తల్లీకుమార్తెలు చేసిన విరోచిత పోరాటం స్ఫూర్తిగా నిలుస్తోంది. దుండగుడి చేతిలో తుపాకీ ఉన్నా ఏ మాత్రం వణుకూ బెణుకూ లేకుండా వారిద్దరూ ఎదిరించిన తీరు మహిళా శక్తిని మరోసారి చాటింది. వీరి ధైర్య సాహసాలను పలువురు ప్రముఖులు అభినందిస్తున్నారు.
WOMEN INTERVIEW WHO FACED THIEVES : ఈ నెల 21న మధ్యాహ్నం సుమారు రెండు గంటల సమయానికి ఇద్దరు అగంతుకులు బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముంటున్న మహావీర్ జైన్ ఇంటికి కన్నం వేయాలని పథకం పన్నారు. తగ్గట్టుగానే ఆ ఇంటికి చేరుకున్నారు. కొరియర్ వచ్చిందంటూ ఇంట్లో దాకా వచ్చి, మారణాయుధాలతో ఇంట్లోని మహిళలతో సహా పనిమనుషులను బెదిరించారు. కానీ, ఆ తల్లీబిడ్డలు మాత్రం దొంగలతో పోరాడి, తరిమేశారు. మార్షల్ ఆర్ట్స్(Marshal Arts)పై పట్టు ఉన్న అమిత్ మెహ్నెత్ దెబ్బలకు తాళలేక సుశీల్ అనే నిందితుడు ముందుగా పరారయ్యాడు. తరువాత మరో నిందితుడు తప్పించుకున్నాడు.
మానసికంగా ధైర్యంగా ఉండడం వల్లే : కొంతకాలం క్రితం పనికోసం వచ్చిన వారే ఇప్పుడు ఇలా దొంగతనానికి విఫలయత్నం చేశారని బాధిత మహిళ పేర్కొంది. పెయిటింగ్ పనికోసం వచ్చినప్పుడు ఇంట్లో ఎక్కడెక్కడ ఏమేం ఉన్నాయో చూసి గత కొంతకాలంగా దోపిడీ చేసేందుకు ప్లాన్ చేసినట్లుగా అనిపిస్తోందని అమిత్ తెలిపింది. అందులో భాగంగానే అన్ని విషయాలు తెలుసుకొని అకస్మాత్తుగా పని మానేశారని తెలిపింది. మానసికంగా ధైర్యంగా ఉండడం వల్లే నిందితులను ఎదుర్కోగలిగానని అమిత మెహోత్ కుమార్తె తెలిపింది.
MOTHER DAUGHTER FIGHT WITH THIEVES : నార్త్ జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని తల్లి కూతుళ్లను మెచ్చుకున్నారు. తన 11 ఏళ్ల సర్వీస్‌లో ఇంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన వారిని ఎక్కడా చూడలేదని, వారిని శాలువాతో సత్కరించారు. నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. నిందితుల నుంచి ఒక నాటు తుపాకీ, రబ్బర్ బుల్లెట్ షెల్, రెండు కత్తులు, గిఫ్ట్ పేపర్ బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మహిళలు సెల్ఫ్ డిఫెన్స్(Special Defence) నేర్చుకోవాలన్నారు. తమకు ఎదురయ్యే సమస్యలు తామే పరిష్కరించుకునేలా మానసికంగా సిద్ధంగా ఉండాలని సూచించారు.