ETV Bharat / state

మొక్క మొలిచింది మొదలు - పూతపూసి కాయ కాసే కడవరకు - పంటంతా ఎరువులమయం! - Chemical Fertilizers in Crops - CHEMICAL FERTILIZERS IN CROPS

Chemical Fertilizers in Agriculture : పంటల సాగులో రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం తీరు ఏటా భారీగా పెరుగుతోంది. మొక్క మొలిచింది మొదలు, పూత పూసి కాయ కాసే కడవరకూ అంతా ఎరువులమయమవుతోంది! రైతులు ప్రతి సీజన్​లో విత్తనాల కంటే ముందుగా ఎరువులే కొనుగోలు చేసి నిల్వ చేయటం చూస్తుంటే ఎంతలా వినియోగం ఉందో చెప్పకనే చెప్పవచ్చు. అటు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నా, కర్షకులు మాత్రం వాటి వాడకానికే మొగ్గు చూపుతున్నారు.

Most Fertilizers Used in Crops
Most Pesticide use in Crops (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 31, 2024, 7:49 AM IST

Chemical Fertilizers Usage More in Crop Cultivation : రాష్ట్రంలో పంటలకు ఎరువులు, పురుగు మందుల పిచికారీ వినియోగం ఏటికేడు పెరుగుతోంది. గత ఏడాది 44 లక్షల టన్నులు వినియోగమవగా, ఈ సంవత్సరం మరో 3 లక్షల టన్నులు పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. మునుపెన్నడూ లేనివిధంగా గత 5 నెలల కాలంలోనే 14.85 లక్షల టన్నుల ఎరువులు వినియోగమైంది. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలని కేంద్ర, రాష్ట్ర సర్కారులు కోరుతున్నా, రైతులు మాత్రం వాటికే మొగ్గు చూపుతున్నారు.

జాతీయ సగటు కంటే ఎక్కువ : ప్రపంచవ్యాప్తంగా ఎకరా పంటకు సగటున 78.4 కిలోల ఎరువు వినియోగిస్తుండగా, మన దేశంలో 51.2 కిలోలుగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం దాదాపు 130 కిలోలు వాడుతున్నారు. రాష్ట్రంలో 2014-15లో 15.12 లక్షల టన్నులుగా ఉన్న సరఫరా, 2024-25 నాటికి 47.18 లక్షల టన్నులకు ఎగబాకింది. వరికి ప్రధాన పోషకాలైన నత్రజని, భాస్వరం, పొటాశ్​ వంటి ఎరువులను 4:2:1 నిష్పత్తిలో వాడాల్సి ఉండగా 9.5:2.7:1 నిష్పత్తిలో వాడుతున్నారని తేలింది.

ఎరువులకే అగ్రతాంబూలం : రైతులు ప్రతి సీజన్‌లో విత్తనాల కంటే ముందే ఎరువులు, పురుగు మందులు కొనుగోలు చేసి నిల్వ చేస్తున్నారు. వరి ఏపుగా పెరగాలనే ఆశతో రసాయనాలను విచ్చలవిడిగా వినియోగిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయశాఖ అధ్యయనంలో తేలింది. యూరియా వేస్తే పైరు ఏపుగా పెరిగి అధిక దిగుబడి వస్తుందనే ఆలోచన అన్నదాతల్లో బాగా ఉంది. అందువల్లే దీని వినియోగం రోజురోజుకూ మరింత పెరుగుతోంది. యూరియా 2015-16లో 12.53 లక్షల టన్నులు వినియోగమవగా, ఈ ఏడాది 21 లక్షల టన్నులు ఉంటుందని వ్యవసాయ శాఖ అధికారులు భావిస్తున్నారు.

భూసార పరీక్షల్లో ఆయా ప్రాంతాల్లోని నేలల్లో అవసరానికి మించి భాస్వరం నిక్షిప్తమై ఉంది. ఇది ఎక్కువగా ఉంటే డీఏపీ ఎరువును పెద్దగా వాడాల్సిన అవసరం లేదు. అయినా రాష్ట్రంలో రెండు సీజన్లలో కలిపి ఏటా 5 లక్షల టన్నుల దాకా విచ్చలవిడిగా చల్లుతున్నారు. నత్రజని, పొటాశ్ విషయంలోనూ ఇదే జరుగుతోంది. వీటివల్ల అక్కడ సాగునీరు, నేల మాత్రమే కాకుండా పర్యావరణంలోకి సైతం కాలుష్యం విడుదలై అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.

ప్రభుత్వాలు పచ్చిరొట్ట విత్తనాలు అందిస్తున్నా : దేశంలో పంజాబ్‌ తరవాత ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ రాష్ట్రాల్లోనే రసాయన ఎరువుల సగటు వాడకం ఎక్కువగా ఉందని, వీటిని నియంత్రించాలని కేంద్ర సర్కార్​ ఇటీవల సూచించింది. రసాయన ఎరువులకు బదులు తొలకరి వానలు కురవగానే పొలంలో పిల్లిపెసర, జీలుగ, జనుము వంటివి పెంచి కలియదున్నితే భూమికి కావలసిన సారవంతమైన నత్రజని అందుతుందని, యూరియా వంటి ఎరువులు వాడక్కర్లేదని స్పష్టం చేసింది. దీనికి అనుగుణంగా పచ్చిరొట్ట ఎరువుల అమ్మకాలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినా రసాయన ఎరువుల వాడకం మాత్రం తగ్గడం లేదు.

ప్రస్తుత వానాకాలం సీజన్‌లో :

  • ఈ వానాకాలం కాలవ్యవధిలో 10.41 లక్షల టన్నుల యూరియా, 2.40 లక్షల టన్నుల డీఏపీ, 10 లక్షల టన్నుల కాంప్లెక్స్, 0.60 లక్షల టన్నుల మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాశ్​ (ఎంవోపీ) చొప్పున మొత్తం 23.41 లక్షల టన్నులు అవసరమవుతాయని అంచనా వేశారు.
  • ఇందులో ఇప్పటికే 10.88 లక్షల టన్నుల యూరియా, 2.34 లక్షల టన్నుల డీఏపీ, 9.18 లక్షల టన్నుల కాంప్లెక్స్, 0.45 లక్షల టన్నుల ఎంవోపీని తెచ్చారు.
  • ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు 6.71 లక్షల టన్నుల యూరియా, 1.97 లక్షల టన్నుల డీఏపీ, 6.02 లక్షల టన్నుల కాంప్లెక్స్, 0.15 లక్షల టన్నుల ఎంవోపీని చొప్పున మొత్తం 14.85 లక్షల టన్నుల ఎరువులను రైతన్నలు కొనుగోలు చేశారు.
  • 5 నెలల వ్యవధిలోనే ఇంత భారీగా వినియోగం ఇదే మొదటిసారని అధికారులు చెబుతున్నారు.
  • యాసంగిలో మరో 24 లక్షల టన్నులు వరకూ అవసరమవుతాయని భావిస్తున్నారు.
    fertilizers Usage Increase in State
    fertilizers Usage Increase in Telangana (ETV Bharat)

YUVA : సేంద్రీయ వ్యవసాయం దిశగా అడుగులు - యూట్యూబ్‌లో ప్రచారం చేస్తున్న నల్గొండ యువ రైతు - Organic Farming in Nalgonda

వామ్మో జింకలు : వేసిన మొక్క వేసినట్లు తినేస్తూ - కర్షకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తూ - Deers Destroying Crops

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.