ETV Bharat / state

హైదరాబాద్‌లోనే అత్యధికంగా కారు ప్రమాదాలు - వెల్లడించిన ప్రముఖ సంస్థ - ACKO ACCIDENTS INCIDENTS 2024

మెట్రో నగరాల్లో అత్యధికంగా సంభవిస్తున్న రోడ్డు ప్రమాదాలు- ముఖ వాహన బీమా సంస్థ ఆకో యాక్సిడెంట్‌ ఇండెక్స్‌-2024 నివేదికలో వెల్లడి

Most Car Accidents In Hyderabad
Most Car Accidents In Hyderabad (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 3 hours ago

Most Car Accidents In Hyderabad : దేశవ్యాప్తంగా మెట్రో నగరాల్లో గత రెండేళ్లలో హైదరాబాద్​ మహానగరంలో అత్యధిక కారు ప్రమాదాలు జరిగినట్లు ప్రముఖ వాహన బీమా సంస్థ ఆకో యాక్సిడెంట్​ ఇండెక్స్​ -2024 పేరుతో తాజాగా నివేదికను విడుదల చేసింది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా దేశ రాజధాని దిల్లీ, పుణె, బెంగళూరు, కోల్​కతా, ముంబయి, చెన్నై, అహ్మదాబాద్​ నగరాలున్నాయని నివేదికలో పేర్కొంది. ఆ నివేదికలో ప్రస్తావించిన ప్రధానాంశాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా 78 శాతం రోడ్డు ప్రమాదాలు మెట్రో నగరాల్లోనే జరుగుతున్నాయి.

బెంగళూరులో : 45 శాతం

దిల్లీలో : 13 శాతం

ముంబయిలో: 12 శాతం ప్రమాదాలు గుంతల కారణంగా సంభవిస్తున్నాయి.

Car Drivers in Hyderabad : చలాన్ల భయం కలిగింది.. వాహనదారుల్లో బాధ్యత పెరిగింది!

  • 2022లో అత్యధిక కారు ప్రమాదాల్లో దిల్లీ మొదటి స్థానంలో ఉంటే ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంది. దిల్లీలో పోల్చుకుంటే హైదరాబాద్‌లో 46శాతం కార్లు తక్కువ. అయినా గత రెండేళ్లలో హైదరాబాద్‌లోనే ఎక్కువగా ప్రమాదాలు జరిగాయి.
  • హైదరాబాద్‌లో ప్రమాదాలను ఎక్కువ ఆస్కారమున్న ప్రాంతంగా మియాపూర్‌ నిలిచింది. దేశవ్యాప్తంగా ఆరో స్థానంలో ఉంది. బెంగళూరులోని బొమ్మనహళ్లి, దిల్లీలోని నోయిడా, పుణెలోని మరుంజి, ముంబయిలోని మిరారోడ్‌, చెన్నైలోని మెడవక్కం ప్రాంతాలు మొదటి 5స్థానాల్లో ఉన్నాయి.
  • జంతువుల కారణంగా జరిగే గమనిస్తే శునకాలతో 62%, ఆవులతో 29%, బర్రెలతో 4%, కోతులతో 3%, మేకలతో 1% చొప్పున ప్రమాదాలు జరుగుతున్నాయి.

విపరీతంగా పెరిగిన రోడ్డు ప్రమాదాలు : మరోవైపు హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా నగర శివార్లలో ప్రమాదాలు జరుగుతున్నాయి. అతివేగం, నిద్రలేమి, డ్రైవింగ్ చేసేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం ఇందుకు కారణాలుగా తెలుస్తున్నాయి. అలాగే మెట్రో నగరాలు ఎప్పుడు రద్దీగా ఉంటాయి. ఉరుకులు పరుగుల సాగే రోడ్లపై ఎటు నుంచి ఎవరూ వస్తారో తెలియకపోవడం లాంటివి కూడా కారణాలుగా చెప్పుకోవచ్చు.

ఈ కాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి : చలికాలం కావడంతో తెల్లవారుజామున పొగమంచు కురుస్తుంటుంది. దీంతో రోడ్లపై ఏం వస్తున్నాయో లేదో అన్నది దగ్గరకి వస్తే కానీ తెలియదు. ఈ కారణంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ఎక్కువే. అందుకు వాహనాలు నడిపించే వారు తగిన జాగ్రత్తలు పాటించాలని పోలీసులు చెబుతున్నారు. సూర్యోదయం అయ్యాకే రోడ్లపైకి రావాలని సూచిస్తున్నారు. పొగమంచు తగ్గిన తర్వాత ప్రయాణాలు చేయడం శ్రేయస్కరం అని అంటున్నారు.

వాహనదారులకు బ్యాడ్​ న్యూస్​ - రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలకు రోడ్ ట్యాక్స్‌ పెంపు?

మెట్రో రెండోదశ అంచనా వ్యయం రూ.24,269 కోట్లు - క్యాబినెట్‌ ఆమోదించాక కేంద్రానికి అందజేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.