ETV Bharat / state

ఆ ఊళ్లో వీధికో హనుమాన్ ఆలయం - ఇంతకీ ఎందుకలా? - 50 Hanuman Temples in Vellulla - 50 HANUMAN TEMPLES IN VELLULLA

50 Hanuman Temples in Vellulla Village : సాధారణంగా ప్రతి గ్రామంలో ఒక ఆంజనేయస్వామి ఆలయం ఉండటం పరిపాటి. ఊరు కాస్త పెద్దదయితే రెండో మూడో ఉంటాయి. కానీ ఆ గ్రామంలో మాత్రం వీధి వీధికో హనుమాన్ టెంపుల్ ఉంటుంది. దాదాపుగా 50కిపైగా అంజన్న ఆలయాలున్న ఆ గ్రామం గురించి ఈ హనుమాన్ జయంతి రోజున తెలుసుకుందాం రండి.

50 Hanuman Temples in Jagital District
50 Hanuman Temples in Jagital District
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 23, 2024, 11:06 AM IST

ఆ ఊళ్లో వీధికో హనుమాన్ ఆలయం - ఇంతకీ ఎందుకలా?

50 Hanuman Temples in Jagital District : హనుమాన్​ జయంతి వచ్చిందంటే చాలు ఆ గ్రామంలో ఉండే కోలాహలమే వేరు. ఎటుచూసినా ఆంజనేయస్వామి దేవాలయాలతో ఊరంతా జై శ్రీరామ్​ నామస్మరణతో మార్మోగిపోతుంది. ఏ గ్రామానికి లేని విధంగా సుమారు 50 అంజన్న ఆలయాలతో తన విశిష్టతను చాటుకుంటుంది. ఏ వీధిలో చూసిన హనుమాన్ భజనలతో ఆధ్యాత్మిక శోభ విలసిల్లుతుంది. ఆ గ్రామమే జగిత్యాల జిల్లా మెట్​పల్లి మండలంలోని వెల్లుల్ల.

వెల్లుల్ల గ్రామంలో వీధికో ఆంజనేయస్వామి గుడి ఉంటుంది. అలా 50కిపైగా ఆలయాలున్నాయి ఇక్కడ. ఈ హనుమాన్​ మందిరాల్లో నిత్యం పూజలు చేస్తూ అక్కడి కుటుంబాలు భక్తిభావాన్ని చాటుకుంటున్నాయి. ఇలా ఆ స్వామికి అనుదినం పూజలు చేయడం వల్ల అక్కడ ఏడాదిపాటు సమృద్ధిగా వర్షాలు పడతాయని వారి విశ్వాసం. పాడిపంటలు, ఆ ఊరు ప్రజలంతా బాగుంటారని అక్కడి ప్రజలకు ఆది నుంచి వస్తున్న ఓ నమ్మకం.

కొండగట్టులో వైభంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు - రామ నామస్మరణతో మార్మోగుతున్న ఆలయం

అయితే ఊరులో మాత్రం మరో నానుడి ఉంది. కొన్నేళ్ల క్రితం ఇక్కడ అత్యధికంగా బ్రాహ్మణ కుటుంబాల వారు నివసించేవారని, అలా ఎవరికి వారే వాయుపుత్రుడిని పూజించుకునేవారని పెద్దలు చెబుతున్న మాట. ఆ బ్రాహ్మణులు అందరూ వివిధ ప్రదేశాలకు వలసలు వెళ్లిపోవడంతో ఈ ఆలయాలు ఇక్కడ ఉండిపోయాయని చెప్పారు. ప్రతి ఏటా స్వామి వారికి పూజలు చేస్తూ గ్రామంలో హనుమాన్​ దీక్షాపరులు పెరుగుతూనే ఉన్నారు. హనుమాన్​ జయంతి వచ్చిందంటే చాలు ఈ గ్రామమంతా కాషాయవర్ణంగా మారిపోతుంది.

హనుమాన్​ భజనలతో : హనుమాన్​ దీక్షాపరుల భజనలు, సంకీర్తనలతో గ్రామమంతా శ్రీరామ నామస్మరణతో నిండిపోతుంది. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ స్వామివారి మాలధారణ ధరించి 41 రోజుల పాటు నిష్ఠగా స్వామివారి పూజలు చేసుకుంటారు. ప్రతిరోజు ఉదయం రాత్రివేళల్లో ఏ వీధి చూసిన హనుమాన్​ దీక్షదారుల భజనలతో నిండిపోతుంటాయి. ఇలా ఈ వెల్లుల్ల గ్రామంలో ఎటుచూసినా ఆ పవనసుతుడే దర్శనమిస్తూ కొత్తగా ఆ ఊరిలోకి వచ్చేవారిని విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. అలాగే చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు హనుమాన్​ జయంతికి ఈ ఆలయాలను సందర్శిస్తూ ఉంటారు.

"మా ఊరిలో సుమారు 50 నుంచి 60 ఆంజనేయస్వామి ఆలయాలు ఉన్నాయి. ఇవి చాలా విశిష్టమైన దేవాలయాలు. పూర్వం మా ఊరిలో 200 బ్రాహ్మణ కుటుంబాలు ఉండేవి. ఆ బ్రాహ్మణులు నివసించిన ఇంటి పక్కనే ఒక దేవాలయం నిర్మించుకున్నారు. కొన్నేళ్ల తర్వాత వారంతా ఇక్కడి నుంచి వెళ్లిపోయారు. గ్రామంలో ఉండేవారు వారి ఇంటి పక్కన ఉండే ఆంజనేయస్వామి వారికి నిత్యం పూజలు చేసి అనుగ్రహం పొందుతారు. హనుమాన్​ జయంతి రోజు ఎంతో వైభవంగా జయంతిని జరుపుకుంటాం." - కిషన్ శర్మ, వెల్లుల్ల గ్రామ పూజారి

శాపానికి ఉపశమనం- ఆంజనేయ స్వామి జననం- హనుమంతుడి జన్మ రహస్యం తెలుసా?

మంగళవారం హనుమాన్​ జయంతి- అంజన్నకు ఇవి సమర్పిస్తే అన్నింటా విజయమే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.