Chilakaluripeta ICICI Bank Scam Updates : ఏపీలోని పల్నాడు జిల్లా చిలకలూరిపేట, నరసరావుపేట, విజయవాడ భారతీనగర్ ఐసీఐసీఐ బ్రాంచ్‌ల్లో మోసపోయిన ఖాతాదారులకు ఊరట లభించింది. బాధిత క్లైయింట్స్‌కు అధికారులు నగదును వెనక్కి ఇచ్చే ప్రక్రియను ప్రారంభించారు. గతంలో మేనేజర్‌గా పనిచేసిన నరేశ్ ఖాతాదారులను మోసం చేశాడని బ్యాంక్ ఉన్నతాధికారులు నిర్ధారించారు. అతను పనిచేసిన కాలంలో వివిధ శాఖల్లో కలిపి మొత్తం 72 మంది ఖాతాదారుల నుంచి రూ.28 కోట్లు కాజేసినట్లు గుర్తించారు.
ఈ నెల 3న చిలకలూరిపేట ఐసీఐసీఐ బ్యాంక్‌లో నరేశ్ చేసిన మోసాలను బ్యాంకు జోనల్ మేనేజర్ సందీప్ మెహ్రా ఐడెంటిఫై చేశారు. బాధిత ఖాతాదారులను ఎంక్వైరీ చేసి వారి పేర్లు నమోదు చేసుకున్నారు. దీనిపై ఆయన విజయవాడలోని సీఐడీ ఆఫీసులో ఫిర్యాదు చేశారు. అక్కడినుంచి ఈ కేసును గుంటూరు సీఐడీ కార్యాలయానికి ట్రాన్స్ఫర్ చేశారు. దీంతో గుంటూరు సీఐడీ అడిషినల్ ఎస్పీ ఆదినారాయణ, సీఐ సంజీవ్ కుమార్ల ఆధ్వర్యంలో పదిమంది టీమ్ గత గురువారం చిలకలూరిపేట ఐసీఐసీఐ బ్యాంకులో విచారణ ప్రారంభించారు. బ్యాంకులో స్టాఫ్‌తోపాటు ఖాతాదారులను శనివారం వరకు విచారించారు.
ICICI Bank Money Refunding : ఈ నేపథ్యంలోనే గత మేనేజర్ నరేశ్ సెల్ఫీ వీడియో రిలీజ్ చేయడంతో కేసు విచారణ ఓ కొలిక్కి వచ్చింది. తాను ఒక్కడినే మోసానికి పాల్పడలేదని, ఎవరెవరి పాత్ర ఉందో ఆ వీడియోలో పూర్తిగా వెల్లడించారు. ఇవన్నీ నిర్ధారించుకున్న బ్యాంకు ఉన్నతాధికారులు బాధితులకు సత్వరమే న్యాయం చేసేలా చర్యలు తీసుకున్నారు. సోమవారం బాధిత ఖాతాదారులను పిలిపించి వారు పోగొట్టుకున్న నగదును తిరిగి ఇచ్చే ప్రక్రియను చేపట్టారు. బ్యాంకు జోనల్ మేనేజర్ సందీప్ మెహ్రా నష్టపోయిన ప్రతి ఖాతాదారుడికి బ్యాంక్ తిరిగి చెల్లిస్తుందని హామీ ఇచ్చారు. స్కామ్ జరిగిన వెంటనే స్పందించి తమకు అండగా నిలిచిన బ్యాంకు అధికారులతో పాటు, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుకు, ఈనాడు-ఈటీవీ భారత్‌కు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.
అసలేం జరిగిదంటే : పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట, నరసరావుపేటలోని ఐసీఐసీఐ బ్యాంకు మేనేజర్ చేతిలో ఖాతాదారులు నిండా మునిగారు. పైసాపైసా కూడబెట్టి దాచుకున్న సొమ్ము అకౌంట్లలో లేదని తెలిసి హతాశులయ్యారు. బ్యాంక్‌లో చేసిన ఫిక్స్‌డ్ డిపాజిట్ల నుంచి రూ. కోట్లలో నగదు కొల్లగొట్టారు. బ్యాంకు ఖాతాదారుల నగదు, గోల్డ్, ఎఫ్‌డీ సొమ్ము మాయం చేశారు. బాధితులు రెండు నెలలుగా ఫిక్స్‌డ్ డిపాజిట్లకు సంబంధించి వడ్డీ ఖాతాకు జమ కాకపోవడంతో ఇటీవల బ్యాంకుకు వెళ్లి నిలదీశారు. ఆ ఫిక్స్‌డ్ డిపాజిట్ల బాండ్లు చెల్లవని అందులో సొమ్ము, బంగారం లేదని బ్యాంకు సిబ్బంది చెప్పడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
'ఐసీఐసీఐ' నరేశ్ సెల్ఫీ వీడియో కలకలం - అందరి చిట్టా విప్పాడు
ఐసీఐసీఐ కస్టమర్లకు అలర్ట్ - ఆ వాట్సాప్ మెసేజెస్, కాల్స్ నమ్మితే ఇక అంతే! - ICICI Bank Fraud Alert