ETV Bharat / state

దంతాలు ఊడిపోయి ఏమీ తినలేక పోతున్నారా? - ఈ 'పళ్లు' పెట్టుకుంటే బొక్కలూ నమిలేయొచ్చు! - DENTAL PROBLEMS IN OLD AGE

వృద్ధాప్యంలో దంత సమస్యలకు చెక్! - అందుబాటులోకి ఆధునిక చికిత్సలు - వెల్లడించిన డాక్టర్‌ వికాస్‌ గౌడ్

Dental Problems in Old Age
Dental Problems in Old Age (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 28, 2024, 12:15 PM IST

Updated : Oct 28, 2024, 12:46 PM IST

Dental Problems in Old Age : వృద్ధాప్యంలో వివిధ ఆరోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. అందులో ఒకటి దంత సమస్యలు. ముసలితనంలో ఈ సమస్య తీవ్ర దుష్ప్రభావాన్ని చూపుతుందని సీనియర్ దంత వైద్య నిపుణులు డాక్టర్‌ వికాస్‌ గౌడ్‌ అన్నారు. దేశంలో 65 ఏళ్లు దాటిన వారిలో పూర్తిగా దంతాలు కోల్పోయే వారు సుమారు 30 శాతం నుంచి 40 శాతం మంది వరకు ఉంటారని తెలిపారు. నోటి ఆరోగ్య సంరక్షణను నిర్లక్ష్యం చేస్తే దంతాలు త్వరగా ఊడిపోతాయని చెప్పారు. వృద్ధాప్యంలో ఎదురవుతున్న దంత సమస్యలకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పరిష్కారం లభిస్తుందని తెలిపారు.

ఇటీవల బెంగళూరులో జరిగిన ‘నోబల్‌ ఎక్సలెన్స్‌ ఇన్‌ ఇంప్లాంటాలజీ’ సదస్సులో వికాస్‌ గౌడ్‌ మాట్లాడారు. 'సాధారణంగా ఎక్కువ మంది దంత సమస్యలను తేలిగ్గా తీసుకుంటారని, నోటి శుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వరని తెలిపారు. దీంతో వయసు పైబడుతున్న కొద్దీ దంతాలు ఊడిపోతుంటాయని వివరించారు. ఆహారాన్ని సరిగ్గా నమిలి తినలేరని, దానివల్ల ముఖంలోనూ మార్పులు కనిపిస్తాయన్నారు. ఈ సమస్యలన్నింటికీ ఇప్పుడున్న అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కృత్రిమ దంతాలను అమర్చవచ్చని తెలపారు. కట్టుడు దంతాల మాదిరిగా కాకుండా, ఇప్పుడొస్తున్న అధునాతన ఇంప్లాంట్లు సహజ సిద్ధంగా అమరుతాయని వివరించారు. వృద్ధుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడంతో పాటు ఆరోగ్య సమస్యలను కూడా దూరం చేయొచ్చని అన్నారు. జీవన నాణ్యత కూడా పెరుగుతుందన్న ఆయన, ఈ విషయాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు.

Vikas Goud
డాక్టర్ వికాస్‌ గౌడ్‌ (ETV Bharat)

మీ పిల్లల్లో దంత సమస్యలా? ఈ టిప్స్ క్యావిటీస్, ఇన్ఫెక్షన్లు నుంచి రిలీఫ్​! - Child Dental Care Tips

జామ ఆకులతోనూ : నోటి ఆరోగ్యం బాగోలేకపోతే చిగుళ్ల సమస్యలు మొదలు, పంటి నొప్పి వరకు ఎన్నో ఇబ్బంది పెడుతుంటాయి. మీరూ ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే జామ ఆకులతో చెక్ పెట్టవచ్చు అంటున్నారు వైద్య నిపుణులు. వాటి ద్వారా దంత సమస్యలన్నీ ఇట్టే తొలగిపోతాయంటున్నారు. అంతేకాదు జామ ఆకుల ద్వారా మరికొన్ని ఆరోగ్య ప్రయోజనాలూ పొందుతారంటున్నారు.

జామకాయ (Guava) తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయో మనందరికీ తెలిసిన విషయమే. అయితే, జామ పండ్లలోనే కాదు వాటి ఆకుల్లోనూ ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్ సి, ఫైబర్, ఎ, పొటాషియం, మాంగనీస్ వంటి ఇతర పోషకాలు ఎన్నో పుష్కలంగా ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. అలాగే యాంటీ ఇన్​ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి గాయాలను నయం చేయడంలో చాలా బాగా పని చేస్తాయంటున్నారు.

నోటి దుర్వాసన, చిగుళ్లలో రక్తమా? - షుగర్ వ్యాధి కారణం కావొచ్చట! - Diabetes Dental Problems

నోటి దుర్వాసన, దంత సమస్యలతో ఇబ్బందా? ఈ మసాలా దినుసుతో చెక్!

Last Updated : Oct 28, 2024, 12:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.