Mithila Samaj Manch in Gathering : హైదరాబాద్‌లో ప్రతి ఏటా జరిగే మిథిలా సమాజ్ మంచ్ సమ్మేళనం ఘనంగా జరిగింది. రాంకోటి సరోజినీ నాయుడు సమావేశ మందిరంలో జరిగిన ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయనతో పాటుగా బిహార్ దర్బంగా నియోజకవర్గ ఎమ్మెల్యే సంజయ్ సరగ్వితో పాటు పలువురు మిథిలా సమాజ్ ప్రతినిధులు పాల్గొన్నారు.
బిహార్‌లోని మిథిలా సమాజానికి చెందిన ప్రజలు ట్రస్ట్ ఏర్పాటు చేసి పేద విద్యార్థుల చదువులు, ఉద్యోగ కల్పన కోసం కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తెలిపారు. ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్న తాము, ప్రతి ఏడాది సమావేశమై తమ సమస్యలు, సామాజిక సేవా కార్యక్రమాలపై చర్చించుకుంటున్నామని మిథిలా సమాజ్ మంచ్ హైదరాబాద్ అధ్యక్షుడు రాం వినోద్ ఝా తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన సంగీత విభావరి అక్కడి వారందరినీ ఆకట్టుకుంది.
తెలంగాణ అన్ని రాష్ట్రాల ప్రజలు : బిహార్ రాష్ట్రానికి చెందిన మిథిలా సమాజానికి చెందిన ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది నివసిస్తున్నారని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తెలిపారు. వారి ఆచారాలు, సంప్రదాయాలు, సంస్కృతిని ఇక్కడ కూడా పాటించడం అభినందనీయమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో దేశంలో అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఇక్కడ నివసిస్తారని మిథిలా సమాజ్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఫండింగ్‌తో పేద విద్యార్థుల చదువుల కోసం, యువతకు ఉద్యోగ కల్పన కోసం కార్యక్రమాలు చేపడుతున్నారని పేర్కొన్నారు.
తమ రాష్ట్ర ప్రజలను కలుసుకోవడం ఆనందంగా ఉందని దర్బంగా ఎమ్మెల్యే సంజయ్ సరగ్వి అన్నారు. మిథిలా సమాజ్‌కు బిహార్‌లో ప్రత్యేక ఆదరణ ఉందన్నారు. ఆకాశవాణి దర్భంగా నుంచి మైథిలి ప్రసారాన్ని నిలిపివేయడంపై సమాజ్ ప్రతినిధులు తన దృష్టికి తీసుకొచ్చారని, ప్రధానితో మాట్లాడి దానిని పునరుద్దరుస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రాంతంలో నివాసం ఉంటున్న తాము, 2004 నుంచి ఈ సేవలు నిర్వహిస్తున్నామని, ఏడాదికి ఒక్కసారి ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా కలుసుకుంటామని తెలిపారు.
ప్రొటోకాల్ ఉల్లంఘనపై బీజేపీ నిరసన - శాసనసభలో కాంగ్రెస్ నేతలతో వాగ్వాదం