Mirza Wahid Remand Report in Radisson Drug Case : రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో కీలక అంశాలు వెల్లడవుతున్నాయి. పోలీసుల దర్యాప్తులో రోజుకో కొత్త కోణం వెలుగుచూస్తోంది. తాజాగా డ్రగ్స్ కేసులో 12వ నిందితుడిగా ఉన్న మీర్జా వాహిద్ బేగ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, విచారణ జరిపారు. ఇందులో మరో ఇద్దరు పెడ్లర్ల ఆచూకీ లభ్యమైంది. యాకుత్‌పురాకు చెందిన బేగ్‌కు స్థానికులైన ఇమ్రాన్, అబ్దుల్ రెహమాన్ అనే డ్రగ్ పెడ్లర్ల ద్వారా కొకైన్ సరఫరా అయినట్లు తేలింది. ఈ నేపథ్యంలో వారిద్దరి కోసం సైబరాబాద్ పోలీసులు గాలింపు చర్యలు మొదలుపెట్టారు.
స్నాప్ చాట్ ద్వారా చాట్ చేస్తూ డ్రగ్స్ సప్లై, డెలివరీ చేస్తున్న ముఠా : మీర్జా వాహిద్ రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలను పోలీసులు ఇవాళ వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు, మంజీరా గ్రూప్ డైరెక్టర్ వివేకానందకు డ్రగ్స్ అందించడంలో అతని డ్రైవర్ ప్రవీణ్‌కు డ్రగ్ పెడ్లర్ మీర్జా వాహిద్ బేగ్ సరఫరాదారుగా(Drugs Supply) ఉన్నట్లు తేలింది. వివేకానంద్ ఆదేశాలతో ప్రవీణ్‌కు డ్రగ్స్ అందజేస్తున్నట్లు రిపోర్ట్‌లో తెలిపారు.
'రాడిసన్ డ్రగ్స్ కేసులో నన్ను ఇరికించాలని చూస్తున్నారు' - హైకోర్టులో దర్శకుడు క్రిష్ పిటిషన్
స్నాప్ చాట్ ద్వారా చాట్ చేస్తూ మీర్జా వాహీద్ బేగ్ డ్రగ్స్ సప్లై, డెలివరీ చేస్తున్నట్లు వెల్లడించారు. అతడి నుంచి 3.58 గ్రాముల కొకైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సయ్యద్ అలీ ద్వారా వివేకానందకు డ్రగ్స్ సరఫరా జరిగినట్లు, ఫిబ్రవరిలోనే 10సార్లు డ్రగ్ సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు. మీర్జా వాహిద్ రిమాండ్ రిపోర్టులో మరోసారి డైరెక్టర్ క్రిష్(Director Krish) పేరు ప్రస్తావన వచ్చినట్లు పేర్కొన్నారు.
Drug Bust in Gachibowli Radisson Hotel : ఫిబ్రవరి 29న నాలుగు కవర్లలో కొకైన్ డెలివరీ చేసే సమయంలో నిందితులను గచ్చిబౌలి ఐఎస్‌బీ వద్ద అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. డ్రగ్ పెడ్లర్ అబ్దుల్ రెహమాన్‌తో మీర్జా వాహీద్కు ఏడాదిగా పరిచయం ఉన్నట్లు నిర్దారించారు. ప్రస్తుతం డ్రగ్స్ కేసులో ఏ-13గా అబ్దుల్ రెహమాన్ నమోదు చేశారు. రాడిసన్ హోటల్లో 10సార్లకు పైగా డ్రగ్స్ పార్టీలు జరిగినట్లు, పోలీసులు గుర్తించారు.
ఈ కేసులో మొత్తం 14 మందికి ప్రమేయముందని ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో తేలింది. వీరిలో లిషి, సందీప్, శ్వేత, నీల్ పోలీసుల ముందుకు హాజరు కాలేదు. శ్వేత గోవాలో, సందీప్ కర్ణాటకలో ఉన్నట్లు తెలియడంతో పోలీసులు ఆయా చోట్ల గాలింపు(Police Inquiry) ముమ్మరం చేశారు. లిషి జాడ మాత్రం ఇప్పటికీ చిక్కలేదని తెలిపారు. వీరు డ్రగ్స్ వినియోగించకుంటే పోలీసుల ఎదుటకు రావడానికి ఎందుకు సంకోచిస్తున్నారనేది చర్చనీయాంశంగా మారింది.
Radisson Hotel Drugs Party Case : ఆలస్యం చేసే కొద్దీ యూరిన్ టెస్ట్‌లో డ్రగ్స్ ఆనవాళ్లు తొలగిపోతాయనే కారణంతోనే కాలయాపన చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వీలైనంత తొందరగా వారందరినీ గుర్తించి వైద్యపరీక్షలకు పంపాలనే యోచనతో పోలీసులు గాలింపు చర్యలు విస్తృతం చేశారు. మరోవైపు ఇప్పటికే నీల్ విదేశాలకు వెళ్లినట్లుగా అనుమానిస్తుండటంతో అతడిపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
డ్రగ్స్ కేసులో అత్యంత రహస్యంగా పోలీసుల ముందుకు దర్శకుడు క్రిష్ - రక్త, మూత్ర నమూనాల సేకరణ
డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్ - విచారణకు శుక్రవారం కాదు సోమవారం వస్తానన్న దర్శకుడు క్రిష్