Mirchi Rates Falls Down In Warangal : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఎర్ర బంగారంతో కిక్కిరిసిపోయింది. మేడారం మహాజాతర కారణంగా ఐదు రోజుల సెలవుల తర్వాత తిరిగి ప్రారంభమైన మార్కెట్లో ఎటు చూసినా మిర్చి బస్తాలే దర్శనమిచ్చాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు కరీంనగర్, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ నుంచి రైతులు పెద్ద సంఖ్యలో మిర్చి తీసుకొచ్చారు. 43 వేల బస్తాలకు పైగా సరుకు రావడంతో మార్కెట్ యార్డ్ మిరప బస్తాలతో నిండిపోయింది. మార్కెట్‌కు భారీగా సరకు రావడంతో వ్యాపారులు ధర నియంత్రిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. జెండా పాట పాడినా, ఆ ధర ఒక్కరికి లేదా ఇద్దరికి మాత్రమే దక్కుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రైతుకు కన్నీరే మిగిలిస్తున్న మిరప - ఆటుపోట్లను తట్టుకుని సాగుచేస్తే పెట్టుబడీ కష్టమే!
"మార్కెట్లో ధర తక్కువ ఉండటంతో మేము పెట్టిన ఖర్చులు కూడా రావట్లేదు. ఎకరం సాగుకు రూ.లక్ష అప్పు తెచ్చి పండించాను. మార్కెట్లో రూ.20 వేల ధర చెప్తున్నా రూ.15 వేలకే కొంటున్నారు. క్వింటాకు కనీసం రూ.25 వేలు ధర పలికితేనే, తాము పెట్టిన పెట్టుబడికి గిట్టుబాటు అవుతుంది. తెగుళ్ల కారణంగా దిగుబడి తగ్గి నష్టపోగా, ధర రాక మరింత నష్టపోతున్నాము. ప్రభుత్వం స్పందించి మా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్నాము" -రైతులు
Mirchi Rates Down In Enumamula Market Yard : పంట సాగుకు ఆరంభం నుంచి లక్షల ఖర్చుచేసినట్లు రైతులు చెబుతున్నారు. పెట్టుబడిఖర్చు రెట్టింపు అయినా పంట విక్రయిస్తే అందులో సగం రాని పరిస్దితి నెలకొందని వాపోతున్నారు. మార్కెట్‌లో మిరప ఎగుమతి లేదంటూ కారణం చూపి వ్యాపారులు తక్కువ ధరకు కొంటున్నారని ఆరోపిస్తున్నారు. ఈ సారి అప్పులు తీర్చలేమని రోదిస్తున్నారు. తెగుళ్ల కారణంగా దిగుబడి తగ్గి నష్టపోగా ధర రాక మరింత నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Chilli Farmers Facing Problems : గిట్టుబాటు కాకపోయినా కన్నీరు దిగమింగుకుని వచ్చిన ధరకు అమ్ముకుని రైతులు ఇంటిబాట పడుతున్నారు. నల్లి, తెల్లదోమ వంటి చీడ పీడలతో ఈ ఏడాది మిర్చి సరిగా పండలేదని ఏకరాకు 3 క్వింటాళ్లకు మాత్రమే దిగుబడి వచ్చిందని రైతులు చెబుతున్నారు. క్వింటాకు కనీసం రూ.25వేలు ధర పలికితేనే తాము పెట్టిన పెట్టుబడికి గిట్టుబాటు అవుతుందంటున్నారు. వ్యాపారులు ధరలు తగ్గిస్తుండటంతో కొంత మంది రైతులు సరుకు అమ్మేందుకు మొగ్గు చూపట్లేదు. రవాణా ఖర్చులు నష్టపోయినా సరే ఇంటికి తీసుకెళ్తామని చెపుతున్నారు. ప్రభుత్వం అధికారులు స్పందించి దళారుల మోసాన్ని అరికట్టాలని మిర్చి రైతులు కోరుతున్నారు.
రైతుకు కన్నీరే మిగిలిస్తున్న మిరప - ఆటుపోట్లను తట్టుకుని సాగుచేస్తే పెట్టుబడీ కష్టమే!
దళారుల పాలవుతున్న రైతు కష్టం - మిర్చి సాగుదార్లను నిండా ముంచుతున్న అడ్డగోలు కొనుగోళ్లు