ETV Bharat / state

ఉమ్మడి నల్గొండ జిల్లాలో మంత్రుల సుడిగాలి పర్యటన - పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 24, 2024, 10:05 PM IST

Ministers Inspected Yadadri Thermal Plant : యాదాద్రి విద్యుత్‌ కర్మాగారం పనుల్లో జాప్యం లేకుండా త్వరలో అందుబాటులోకి తేవాలని సర్కార్‌ ఆదేశించింది. స్థానిక యువతకు ఉపాధి కల్పించాలని మంత్రులు జెన్‌కో అధికారులకు సూచించారు. ప్రాజెక్టు పనుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదని చర్యలు తప్పవని యంత్రాంగాన్ని భట్టి విక్రమార్క హెచ్చరించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డితో కలిసి ఉప ముఖ్యమంత్రి విస్తృతంగా పర్యటించారు.

Ministers Nalgonda District Tour
Ministers Inspected Yadadri Thermal Plant
ఉమ్మడి నల్గొండ జిల్లాలో మంత్రుల సుడిగాలి పర్యటన - పలు అబివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు

Ministers Inspected Yadadri Thermal Plant : గత ప్రభుత్వంలో అలవాట్లను మార్చుకోవాలని అధికారులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) సూచించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటనలో భాగంగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి దామరచర్ల మండలం వీర్లపాలెంలో యాదాద్రి పవర్ ప్లాంట్‌ను భట్టి విక్రమార్క సందర్శించారు. ప్లాంట్ పనుల పురోగతిని పరిశీలించిన మంత్రులు ప్రస్తుతం ప్లాంటులో యూనిట్ల నిర్మాణం ఏ స్థాయిలో ఉంది.? బొగ్గు తరలించే రైల్వే ట్రాక్ పనుల పురోగతి చేసిన పనుల్లో బిల్లుల చెల్లింపులు, రానున్న కాలంలో జరగాల్సిన పనులు, నిర్వాసితులకు పరిహారం, తదితర అంశాలపై అమాత్యులు ఆరాతీశారు.

వివిధ కారణాలతో పవర్ ప్లాంటు నిర్మాణంలో జాప్యంతో రాష్ట్ర ఖజానాపై మోయలేని భారం పడిందని భట్టి (Bhatti) ఆక్షేపించారు. త్వరితగతిన ప్రాజెక్టును పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని అధికారులకు సూచించారు. యాదాద్రి ప్లాంట్‌లో స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించే ఆలోచన చేయాలని నిర్దేశించారు. ప్రభుత్వ నుంచి ఏ సహకారమైనా చేస్తామని, ప్రాజెక్టు పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించబోమని భట్టి హెచ్చరించారు.

"డ్వాక్రా గ్రూపుల ద్వారా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తాము. ఈ నెల 27న ఉచిత కరెంట్, రూ.500 గ్యాస్ సిలిండర్​ను ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ప్రకటించబోతున్నాం. యాదాద్రి విద్యుత్‌ కర్మాగారం పనుల్లో జాప్యం లేకుండా చేయాలి. ప్రాజెక్టు పనుల్లో అలసత్వం వహిస్తే ఎవరినైనా సహించేదు. వెనకపడిన ప్రాంతాలను అభివృద్ధి చేసేలా ప్రత్యేక కార్యచరణతో ముందుకెళతాం" - భట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం

ప్రజలను వేధిస్తే వేటే - అధికారులకు సీఎం రేవంత్​ రెడ్డి మాస్‌ వార్నింగ్‌

Ministers Nalgonda District Tour : అక్కడి నుంచి సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ నియోజకవర్గ పరిధిలోని చింతలపాలెం మండలం నక్కగూడెం ఎత్తిపోతల పథకం పునరుద్ధరణ పనులకు మంత్రులు శ్రీకారం చుట్టారు. చివరి ఆయకట్టుకు నీరందించే లక్ష్యంతో 37 కోట్లతో పనులు చేపట్టామని మంత్రులు వివరించారు. పులిచింతల బ్యాక్ వాటర్ ద్వారా అదనంగా మరో 3 వేల ఎకరాలకు నీరందించేలా దొండపాడు లిఫ్ట్‌ చేపడతామని స్పష్టం చేశారు. కిష్టాపురంలో మిర్చి పంటలను పరిశీలించిన మంత్రులు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వెనకపడిన ప్రాంతాలను అభివృద్ధి చేసేలా ప్రత్యేక కార్యచరణతో ముందుకెళతామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. చింతలపాలెం మండలం దొండపాడులో రూ. 400 కోట్లతో ఇన్నోవేరా ఫ్యాక్టరీకి మంత్రులు శంకుస్థాపన చేశారు. 400 కోట్ల పెట్టుబడుల వల్ల స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని వివరించారు.

అంతకు ముందు ప్రాజెక్టును పరిశీలించిన మంత్రులు జెన్​కో అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ప్లాంట్‌లో యూనిట్ల నిర్మాణం ఏ స్థాయిలో ఉందని మంత్రులు అధికారులను ప్రశ్నించారు. బొగ్గును తరలించడానికి రైల్వే ట్రాక్ నిర్మాణం పురోగతి, గతంలో చేసిన పనుల్లో బిల్లుల చెల్లింపుల వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు. రాబోయే కాలంలో జరగాల్సిన పనులు, నిర్వాసితులకు పరిహారం చెల్లింపుల్లో అక్రమాలు, ఇంకా ఎంత మందికి పరిహారం ఇవ్వాల్సి ఉందనే తదితర అంశాలపై అధికారులను మంత్రులు ఆరా తీశారు.

'వేసవిపై దృష్టిసారించండి, విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరా, పంపిణీలను పెంచాలి'

నాగార్జునసాగర్ వివాదం - మరోమారు తెరపైకి కేఆర్‌ఎంబీకి ప్రాజెక్టు స్వాధీనం అంశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.