ETV Bharat / state

బియ్యం ఎగుమతుల నిషేధంపై కేంద్రం పునరాలోచించాలి : మంత్రి తుమ్మల

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 4, 2024, 5:48 PM IST

Minister Thummala react on Ban on Rice Exports : కేంద్ర ప్రభుత్వం బియ్యం ఎగుమతులు బ్యాన్ చేయడంతో తెలంగాణ, ఇతర రాష్ట్రాల రైతులు ఇబ్బందులు పడుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. రైతులకు మేలుచేసే విధంగా కేంద్రం ఆలోచించాలని డిమాండ్ చేశారు.

Global Rice Summit 2024
Minister Thummala react on Ban on Rice Exports

Minister Thummala react on Ban on Rice Exports : విదేశాలకు బియ్యం ఎగుమతులను నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో వచ్చే జూన్‌లో నిర్వహించబోయే గ్లోబల్‌ రైస్‌ సమ్మిట్‌ 2024కు(Global Rice Summit) సంబంధించిన బ్రోచర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బియ్యం ఎగుమతులను బ్యాన్ చేయడంతో తెలంగాణ, ఇతర రాష్ట్రాల రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

'విభజన చట్టం ప్రకారమే ప్రాజెక్టులు అప్పగించాం - బీఆర్ఎస్​ చేసిన తప్పులను మాపై వేయాలని చూస్తున్నారు'

రైతులకు మేలుచేసే విధంగా కేంద్రం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని తుమ్మల డిమాండ్ చేశారు. ఎగుమతులకు అవకాశం ఇస్తే రైస్ పాలసీ మీద పునరాలోచన చేయాలన్నారు. బియ్యం ఎగుమతులు బ్యాన్ ఎత్తివేసినా, దేశంలో బియ్యం రేట్లు పెరగకుండా కేంద్రం చూడాలన్నారు. ఇంటర్నేషనల్ కమోడిటీ ఇనిస్టిట్యూట్ కెనడా, అమెరికా, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా ఈ జూన్ 4 తేదీ నుంచి 6 తేది హైదరాబాద్ తాజ్ డెక్కన్‌లో రైస్ సమ్మిట్ నిర్వహించనున్నట్లు తెలిపారు.

Global Rice Summit 2024 Hyderabad : రేషన్ ద్వారా ఇస్తున్న బియ్యం పెద్దగా ఎవరూ వాడటం లేదని, భారత్ రైస్ 29 రూపాయలకే కేజీ అనేది హాస్యాస్పదంగా ఉందని మంత్రి తుమ్మల(Minister Thummala) ఎద్దేవా చేశారు. రేషన్ ద్వారా ఉచితంగా వస్తున్న బియ్యానే, భారత్ రైస్(Bharat Rice) పేరిట 29 రూపాయలకు కేజీ ఇస్తే ఎలా అని ప్రశ్నించారు. సన్న బియ్యం 29 రూపాయలకు కేజీ ఇస్తే పేద ప్రజలకు ఉపయోగపడుతుందన్నారు.

నేడు కేబినేట్ భేటీ - బడ్జెట్, రెండు గ్యారంటీల అమలుకి ఆమోదం!

అత్యధిక ధాన్యం ఉత్పత్తితో దేశానికి అన్నం పెట్టే స్థానంలో తెలంగాణ ఉందని మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్‌లో గ్లోబల్‌ రైస్‌ సమ్మిట్‌ నిర్వహించడం సంతోషకరమని, మేలైన వరి ఎగుమతులు కూడా చేసే విధంగా ఇందులో చర్చ ఉంటుందని తెలిపారు. ఏ దేశానికి ఏ రకం బియ్యం అవసరమో ముందే కేంద్రం వెల్లడిస్తే డిమాండ్‌కు అనుగుణంగా ఎగుమతులకు ఆస్కారం ఉంటుందన్నారు.

తెలంగాణలో 60 శాతం వ్యవసాయం వరి పంట మీదే ఆధారపడి ఉంటుందన్నారు. తెలంగాణలో పంటలకు బీమా అవసరమని, దీనిపై ప్రభుత్వం ఆలోచన చేస్తోందన్నారు. ఈ ఖరీఫ్ నుంచి పంటలకు బోనస్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పారు. బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని మంత్రి వెల్లడించారు. రైతులకు ఎరువులకు ఇబ్బందులు తలెత్తకుండా సరిపోయే నిల్వలు ఉన్నాయన్నారు.

"విదేశాలకు బియ్యం ఎగుమతులను నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలి. రైతులకు మేలుచేసే విధంగా కేంద్రం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఇంటర్నేషనల్ కమోడిటీ ఇనిస్టిట్యూట్ కెనడా, అమెరికా, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా ఈ జూన్ 4 తేదీ నుంచి 6 తేదీ వరకు నిర్వహించనున్నాము". - తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి

బియ్యం ఎగుమతుల నిషేధంపై కేంద్రం పునరాలోచించాలి మంత్రి తుమ్మల

లిక్కర్‌ కేసులో బీజేపీ కాళ్లు పట్టుకున్నది నిజం కాదా? : మంత్రి కొండా సురేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.