ETV Bharat / state

మూసీ నది ప్రక్షాళనకు ఇజ్రాయెల్ సాంకేతిక పరిజ్ఞానం : మంత్రి శ్రీధర్​బాబు - MINISTER SRIDHAR BABU ON MUSI CLEAN

మూసీ ప్రక్షాళనలో రాష్ట్రానికి సహకరించేందుకు ఇజ్రాయెల్‌ సంసిద్ధత - మంత్రి శ్రీధర్‌బాబును సచివాలయంలో కలిసిన ఇజ్రాయెల్ బృందం

Minister Sridhar Babu On Musi Prakshalana
Minister Sridhar Babu On Musi Prakshalana (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 29, 2024, 8:17 PM IST

Minister Sridhar Babu On Musi River Clean up : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు ఇజ్రాయెల్ సాంకేతిక పరిజ్ఞానం అందించడానికి ముందుకు రావడం పట్ల ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్​ బాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆ దేశ రాయబారి రువెన్ అజర్‌కు శ్రీధర్​ బాబు కృతజ్ణతలు తెలిపారు. రెండు దేశాల మధ్య పరస్పర సహకారానికి ఇజ్రాయెల్ ఎంతో ఆసక్తి కనబర్చడం సంతోషంగా ఉందని మంత్రి అన్నారు. ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​, సైబర్ సెక్యూరిటీలో ఇజ్రాయెల్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉందని, ఆ రంగాల్లో తెలంగాణాకు సహకరించాలని శ్రీధర్​బాబు కోరారు. రక్షణ రంగం, వ్యవసాయం, నీటి వినియోగంలో ఆధునిక సాంకేతికత, నూతన పరిశోధనలు, పారిశ్రామిక అభివృద్ధిలో తోడ్పాటునందించాలని మంత్రి చేసిన అభ్యర్థనకు రువెన్ అజర్ సానుకూలంగా స్పందించారు.

200 ఎకరాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీని ఏర్పాటు చేస్తున్న విషయాన్ని శ్రీధర్ ​బాబు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఏఐ, సైబర్ సెక్యూరిటీ అత్యాధునిక శిక్షణలో మద్ధతు ఇవ్వాలని ఆయన కోరారు. వ్యర్థ జలాల పునర్వినియోగ సాంకేతికలో తమకు సహకరించాలని శ్రీధర్ ​బాబు కోరారు. రాష్ట్రంలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని.. ఇజ్రాయెల్ దేశం ఏ ఫ్యాక్టరీ పెట్టడానికి ముందుకొచ్చినా స్కిల్​ కలిగిన మానవ వనరులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. అధునూతన పరిజ్ణానం, పరిశ్రమల ఏర్పాటులో సాయపడితే ఇక్కడి నుంచే ఉత్పత్తులను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసుకోవచ్చని మంత్రి సూచించారు. రక్షణ రంగం, ఏరో స్పేస్​లో స్టార్టప్ సంస్థలకు టెక్నాలజీ సమకూర్చి ముందుకు నడపాలని శ్రీధర్ బాబు కోరారు. మౌలిక వసతుల నిర్మాణంలో రెండు దేశాలు సహకరించుకోవాలన్న ఇజ్రాయెల్ రాయబారి ప్రపోజల్​కు ఆయన ఆమోదం తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబులు తమ దేశాన్ని సందర్శించాలని రాయబారి రువెన్ ఆహ్వానం పలికారు.

Turkey Envoy Met to Minister Sridhar Babu : తెలంగాణతో వ్యాపార సంబంధాలు మెరుగుపర్చుకునేందుకు ఆసక్తితో ఉన్నామని తుర్కియె దేశపు రాయబారి ఫిరట్ సునెల్ వెల్లడించారు. ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో భేటీ ఆయిన ఆయన పరస్పర సహకారంపై చర్చించారు. తుర్కియె తెలంగాణాల మధ్య చారిత్రక, సాంస్కృతిక సంబంధాలు ఎంతో కాలంగా కొనసాగుతున్నాయని శ్రీధర్ బాబు అన్నారు. వ్యవసాయం, ఫార్మా, లైఫ్ సైన్సెస్, వాణిజ్య రంగాల్లో పెట్టుబడులకు అనుకూల వాతారణం ఉందని ఆయన తెలిపారు. తుర్కియె పారిశ్రామిక ప్రతినిధుల బృందాన్ని పంపిస్తే వారు ఇక్కడి అనుకూల వాతావరణాన్ని పరిశీలించే అవకాశం ఉంటుందన్న అభ్యర్థనకు రాయబారి ఫిరట్ సునెల్ సుముఖత వ్యక్తం చేసారు. భేటీలో తుర్కియె కాన్సుల్ జనరల్ ఓర్హాన్ యమన్ ఓకన్ కూడా పాల్గొన్నారు.

ఎఫ్​టీఎల్​, బఫర్​ జోన్​లోని అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలు తొలగించాల్సిందే : హైకోర్టు

2017లో మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేష‌న్ ఏర్పాటు చేసిందెవరు? : మంత్రి శ్రీధర్​ బాబు - Minister Sridhar Babu Fires On BRS

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.