ETV Bharat / state

సీఎల్పీ సమావేశంలో అరికెపూడి గాంధీ ఉండటం మీరు చూశారా? : శ్రీధర్‌ బాబు - Sridhar Babu Comments On CLP Meet - SRIDHAR BABU COMMENTS ON CLP MEET

Sridhar Babu Comments On CLP Meet : కాంగ్రెస్‌ ప్రభుత్వం గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్‌కు లేదని మంత్రి శ్రీధర్‌ బాబు విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్‌ పార్టీ శాసనసభాపక్ష(సీఎల్పీ) సమావేశం జరిగింది. సమావేశం ముగిసిన అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన బీఆర్ఎస్‌పై పలు విమర్శలు గుప్పించారు.

Sridhar Babu Comments On CLP Meet
Sridhar Babu Comments On CLP Meet (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 22, 2024, 10:50 PM IST

Minister Sridhar Babu On CLP Meet : సీఎల్పీ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ను సన్మానించామని మంత్రి శ్రీధర్‌ బాబు తెలిపారు. పార్టీ ప్రజాప్రతినిధులు సమన్వయంతో ఎలా ముందుకు వెళ్లాలనేది మాట్లాడుకున్నామని వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్‌ పార్టీ హైదరాబాద్​లో శాసనసభాపక్ష(సీఎల్పీ) సమావేశం జరిగింది. సమావేశం ముగిసిన అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడారు.

మా ప్రభుత్వం గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్‌కు లేదు : కాంగ్రెస్‌ ప్రభుత్వం గురించి మాట్లాడే నైతికహక్కు బీఆర్ఎస్‌కు లేదని మంత్రి శ్రీధర్‌బాబు విమర్శించారు. ఎన్నికల సందర్భంగా తాము ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అరికెపూడి గాంధీ నియోజకవర్గంలో సీఎం సమావేశం జరగ్గా ఆయన మర్యాదపూర్వకంగా సీఎంను కలిసేందుకు వచ్చారని స్పష్టం చేశారు. సిద్దిపేటలో సీఎం సమావేశం జరిగితే హరీశ్‌రావు కలవలేదా అని ప్రశ్నించారు. సీఎల్పీ సమావేశంలో అరికెపూడి గాంధీ ఉండటం మీరు చూశారా అని శ్రీధర్‌ బాబు మీడియాను ప్రశ్నించారు.

"సీఎల్పీ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్ గౌడ్‌ను సన్మానించాము. కొత్త పీసీసీ లీడర్‌ ఎంపిక తర్వాత సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేసి వారిని సన్మానించడం ఆనవాయితీ. పార్టీ ప్రజాప్రతినిధులు సమన్వయంతో ఎలా ముందుకు వెళ్లాలి అనేది మాట్లాడుకున్నాము. చాలా మంది సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. భవిష్యత్‌ కార్యచరణపై చర్చించాము. ఇన్‌ఛార్జి దీపాదాస్‌ మున్షీ చాలా మంచి సూచనలు చేశారు. మా ప్రభుత్వం మీద బీఆర్ఎస్‌కు మాట్లాడే అర్హత లేదు. అరికపూడి గాంధీ సీఎల్పీ సమావేశంలో పాల్గొన్నాడని మీకు తెలుసా?"-శ్రీధర్‌ బాబు, మంత్రి

Harish Rao Comments On Sridhar Babu : అనంతరం మంత్రి శ్రీధర్​ వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీశ్​రావు కౌంటర్​ అటాక్​ ఇచ్చారు. మంత్రి శ్రీధర్‌బాబు మాటలు నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లు ఉన్నాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ కండువా కప్పి దేవుడి కండువా అని బుకాయిస్తారని హరీశ్‌ విమర్శించారు. సీఎల్పీ సమావేశానికి హాజరైతే మర్యాదపూర్వక కలయిక అంటారేంటని అడిగారు.

బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు కడియం నుంచి అరికెపూడి వరకు కాంగ్రెస్‌ శాసనసభా పక్ష సమావేశానికి హాజరైతే అది మర్యాద కాదు పరమ అమర్యాద అవుతుందని హరీశ్​రావు అన్నారు. శ్రీధర్‌ బాబు ఈ చిన్న లాజిక్‌ మిస్‌ అయిపోయారని విమర్శించారు. నా నియోజకవర్గానికి ముఖ్యమంత్రి ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా వస్తే కలుస్తానేమో, కానీ సీఎల్పీ సమావేశానికి వస్తే కలవను కదా కలవ కూడదు కదానని ప్రశ్నించారు. ఒక పార్టీ ఎమ్మెల్యే మరొక పార్టీ ఎల్పీ సమావేశానికి ఎట్లా హాజరవుతారని అడిగారు. శ్రీధర్ బాబు వైఖరి పిల్లి కళ్లుమూసుకుని పాలు తాగినట్లుందని ఎద్దేవా చేశారు.

'ప్రభుత్వంపై మరక అంటిస్తే వెంటనే తుడిచేస్తాం - రాష్ట్ర ప్రయోజనాలకు అడ్డొస్తే ఎవరినీ సహించం' - Minister Sridhar Babu press meet

నేను తక్కువ మాటలు చెప్పి ఎక్కువ పనులు చేసే వ్యక్తిని : మంత్రి శ్రీధర్‌ బాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.