ETV Bharat / state

నాణ్యత పాటించక పోతే యాక్షన్ తప్పదు - రెస్టారెంట్లకు మంత్రి రాజనర్సింహ వార్నింగ్ - Rajanarsimha Review Meeting - RAJANARSIMHA REVIEW MEETING

Minister Rajanarsimha on Adulterated Food : రాష్ట్రంలో కల్తీ ఆహారంపై కఠన చర్యలు తీసుకుంటామని మంత్రి దామోదర రాజనర్సింహా హెచ్చరించారు. హైదరాబాద్​లోని సచివాలయంలో వివిధ ఫుడ్​ సంస్థల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం ఆహార భద్రతలో తగిన సూచనలు చేశారు. ఆరు నెలలకొకసారి వర్క్​ షాపులు, అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని అన్నారు.

Minister Rajanarsimha on Adulterated Food
Minister Rajanarsimha Review Meeting (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 11, 2024, 6:20 PM IST

Minister Rajanarsimha on Adulterated Food : ఆహారం కల్తీ చేసినా, నాణ్యత ప్రమాణాలు పాటించక పోయినా కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా హెచ్చరించారు. సచివాలయంలో హోటళ్లు, బార్లు, రెస్టారెంట్లు, బేకరీలు, ఆయిల్ వ్యాపారులు, పాల ఉత్పత్తిదారులు, ప్యాకేజ్డ్ మంచినీరు, ఫ్లోర్ మిల్లర్ల సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి దామోదర రాజనర్సింహా పాల్గొన్నారు.

Adulterated Food in Telangana : నిజాం కాలం నుంచి హైదరాబాద్ బిర్యానికి అంతర్జాతీయంగా గుర్తింపు ఉందని దాన్ని కాపాడాలని మంత్రి తెలిపారు. హైదరాబాద్​ను మెడికల్ టూరిజం హబ్​గా తీర్చిదిద్దుతున్నామని దామోదర రాజనర్సింహా పేర్కొన్నారు. ఫుడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా హైదరాబాద్ బ్రాండ్​ ఇమేజ్​ను పెంచుతున్నామని వివరించారు. హోటళ్ల యజమానులు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని మంత్రి కోరారు. ప్రతి ఆరు నెలలకు వర్క్ షాప్​లు, అవగాహన సదస్సులు నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

Minister Rajanarsimha Review Meeting : రాష్ట్రంలో ఆహార భద్రతపై దృష్టి పెట్టామని మంత్రి తెలిపారు. ఆహార కల్తీ కాకుండా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని ప్రతినిధులకు సూచించారు. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి​ నగరాల్లో ఆహార కల్తీ లేకుండా చేయాలని పేర్కొన్నారు. దీనికోసం ప్రతి ఒక్కరూ బాధ్యతతో ఉండాలని వివరించారు. హోటళ్ల, రెస్టారెంట్స్​లపై ఎప్పటికప్పడు పర్యవేక్షణ చేస్తామని హెచ్చరించారు. ప్రజలకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని అన్నారు. ప్రజల్లో ఆహార నాణ్యతపై అవగాహన కల్పించాలని కోరారు. కల్తీ ఆహారాన్ని వినియోగిస్తున్న విషయాన్ని తెలిస్తే కఠన చర్యలు తీసుకుంటామని అన్నారు.

Minister Meeting With Food Companies Representatives : సమీక్షా సమావేశంలో హోటళ్ల యజమానులు చేసిన పలు విజ్ఞప్తులపై మంత్రి సానుకూలంగా స్పందించారు. సమావేశంలో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆర్​వి. కర్ణన్, డైరెక్టర్ డాక్టర్ శివలీల, తెలంగాణ స్టేట్ హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకట్ రెడ్డి, ఇండియన్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సందీప్, ఇండియన్ డైరీ మిల్క్ ప్రొడక్ట్స్ అసోసియేషన్ మెంబర్ సుల్తాన్ మస్కతి తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్​లో పలు హోటల్స్, రెస్టారెంట్లలో కల్తీ ఆహారం - ప్రజల ఆరోగ్యంతో చెలగాటం - Adulterated food in Hyderabad

పాడైపోయిన పండ్ల నుంచి జ్యూస్ - లేబులింగ్‌ లేకుండా ధనియాల పొడి - Food Safety Officers Checking

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.