ETV Bharat / state

రంజాన్‌ పండుగ ఏర్పాట్లపై మంత్రి పొన్నం సమీక్ష సమావేశం- అధికారులకు కీలక సూచనలు - రంజాన్‌ పండుగపై మంత్రిపొన్నం సమీక్ష

Minister Ponnam on Ramzan Festival : ముస్లింల పవిత్ర రంజాన్‌ పండుగకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. మసీదుల వద్ద షామియానాలు, మంచినీటి సదుపాయం, విద్యుత్ సరఫరా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. రంజాన్‌ ఏర్పాట్లపై నిర్వహించిన సమావేశంలో షబ్బీర్ అలీ, అక్బరుద్దీన్, మహమూద్ అలీ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Minister Ponnam Prabhakar on Ramzan
Minister Ponnam Prabhakar Review on Ramzan Festival
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 19, 2024, 10:33 PM IST

Minister Ponnam Prabhakar Review on Ramzan Festival : ముస్లింల పవిత్ర పండుగైన రంజాన్ వేడుకను ఘనంగా జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని హైదరాబాద్​ జిల్లా ఇన్​ఛార్జి, మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. మసీదుల వద్ద షామియానాలు, మంచినీటి సదుపాయం, విద్యుత్ సరఫరా(Power Supply) ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. రంజాన్ నెల సమీపిస్తున్న నేపథ్యంలో మంత్రి పొన్నం, సచివాలయంలో ఇవాళ అధికారులు, ప్రజాప్రతినిధులతో సన్నాహక సమావేశం నిర్వహించారు.

దేశానికి ఆదర్శంగా ఉండేలా కులగణన - అందరి సలహాలు, సూచనలతో ముందుకెళ్తాం : మంత్రి పొన్నం

ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వంలో వస్తున్న మొదటి రంజాన్‌ను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. ఎంఐఎం ఎమ్మెల్యే కోరిన విధంగా రంజాన్ మాసంలో 24 గంటలు దుకాణాల నిర్వహణకు అనుమతిని పరిశీలించాలని అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. వివిధ ప్రాంతాల్లో తాగునీటికి ఇబ్బందులు(Drinking Water Problems) తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు.

Minister Ponnam Key Instructions to Officials : మంచినీటి ట్యాంకర్లు ఏర్పాటు చేయాలని, మొబైల్ ట్రాన్స్​ఫార్మర్లు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. పారిశుద్ధ్య నిర్వహణ కోసం అదనంగా బృందాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఫుట్​పాత్​లపై చిరు వ్యాపారులను ఇబ్బందులు కలిగించవద్దని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు, కార్మిక శాఖ అధికారులకు(Labor Department Officials) పొన్నం ప్రభాకర్ సూచించారు. రంజాన్ నెలలో ఇఫ్తార్, షేహార్ సమయాల్లో తనిఖీల పేరుతో ఇబ్బందులు కలిగించద్దని ట్రాఫిక్ పోలీస్ అధికారులకు మంత్రి తెలిపారు.

రంజాన్ పండుగ నిధులపై సీఎం రేవంత్​రెడ్డితో చర్చించనున్నట్లు మంత్రి హామీ ఇచ్చారు. వచ్చే నెల రోజుల పాటు అధికారులు అప్రమత్తంగా ఉండి రంజాన్​ను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకునేలా కృషి చేయాలని కోరారు. పాతబస్తీకి తాగు నీరు అందించే మీరాలం పంపు హౌజ్​తో పాటు, మక్కా మసీదు(Mecca Mosque), షాహి మసీదులకు మరమ్మతు చేయాలని ఎంఐఎం ఎమ్మెల్యేలు కోరారు.

ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, మాజీ హోంమంత్రి మహమూద్ అలీ, మైనార్టీ శాఖ ముఖ్య కార్యదర్శి ఉమర్ జలీల్, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ తదితరులు పాల్గొన్నారు.

'హైదరాబాద్ పేరు, గుర్తింపు దెబ్బతినకుండా మరింత అప్రమత్తంగా పని చేయాలి'

మేడారం జాతర గురించి మంత్రులు పొన్నం, సీతక్కల ఆసక్తికర సంభాషణ - వీడియో వైరల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.