ETV Bharat / state

దేశానికి ఆదర్శంగా ఉండేలా కులగణన - అందరి సలహాలు, సూచనలతో ముందుకెళ్తాం : మంత్రి పొన్నం - BC Caste Census in Telangana

Minister Ponnam On Caste Census Resolution : కులగణనపై అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం జరిగిందని, ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం చిత్తశుద్ధి చాటుకుందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. కులగణనకు సహకరించిన పార్టీలకు ధన్యవాదాలు చెప్పారు. బలహీనవర్గాలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదగాలనేది ప్రభుత్వ ఆలోచన అని ఆయన అన్నారు.

BC Caste Census in Telangana
Minister Ponnam On Caste Census Resolution
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 17, 2024, 12:00 PM IST

ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం చిత్తశుద్ధి చాటుకుంది : మంత్రి పొన్నం

Minister Ponnam On Caste Census Resolution : బలహీనవర్గాలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదగాలనేది ప్రభుత్వం ఆలోచన అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ పేర్కొన్నారు. దేశానికి ఆదర్శంగా ఉండేలా కులగణన తీర్మానం ఆమోదం పొందిందని, సహకరించిన పార్టీలకు మంత్రి ధన్యవాదాలు తెలియజేశారు. ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం చిత్తశుద్ధి చాటుకుందన్న మంత్రి, అందరి సలహాలు, సూచనలతో ముందుకెళ్తామని వెల్లడించారు.

BC Caste Census in Telangana : తీర్మానంపై గత బీఆర్ఎస్ బీసీ మంత్రి గంగుల కమలాకర్ సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారంటీలు, హామీలపై నోటికొచ్చినట్లు మాట్లాడటం విచారకరమని అన్నారు. గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో సకల జనుల సర్వే చేపట్టిందని, దానికి సంబంధించిన నివేదికను ఎందుకు బయటపెట్టలేదని మంత్రి ప్రశ్నించారు.

బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో పూలే గుర్తుకు రాలేదా : మంత్రి పొన్నం

"గత ప్రభుత్వంలోని నేతలకు చిత్తశుద్ధి లేకపోవడం వల్లే మాపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. శుక్రవారం శాసనసభలో కులగణనపై చర్చ సందర్భంగా గతంలో బీసీ మంత్రిగా చేసిన గంగుల కమలాకర్‌ అనేక సార్లు సభను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారంటీలు, హామీలపై నోటికొచ్చినట్లు మాట్లాడటం విచారకరం. గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో సకల జనుల సర్వే చేపట్టింది. దానికి సంబంధించిన నివేదికను ఎందుకు బయటపెట్టలేదు? ఇవాళ ఇంత పెద్దగా మాట్లాడుతున్న ఆయన, ఆ నివేదికను బయటపెట్టాలని ఏనాడైనా ఆ పార్టీ సమావేశాల్లో అడగాలని అనిపించలేదా? అలాంటి స్థితిలో ఉన్నవారు కూడా మాపై విమర్శలు చేస్తున్నారు." - మంత్రి పొన్నం

Ponnam introduced the Caste Census resolution In Assembly : ప్రజలు, నాయకులు, ఇలా అందరి సలహాలు, సూచనలను తీసుకునేందుకు ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్వయంగా అసెంబ్లీలో చెప్పారని మంత్రి పొన్నం తెలిపారు. సమాజానికి ఉపయోగపడే మంచి కార్యక్రమాలు ఏమైనా చెప్పండి అంటే చెప్పరు కానీ ఎంతసేపూ విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని బీఆర్ఎస్ నాయకుల మీద మండిపడ్డారు. దేశానికి ఆదర్శంగా ఉండేలా కులగణన తీర్మానం చేశామని, ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసేందుకు ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు ప్రభుత్వానికి ఉండాలని కోరారు. అందరి సలహాలు, సూచనలతోనే కులగణనపై ప్రభుత్వం ముందుకు కొనసాగుతుందని స్పష్టం చేశారు.

బీఆర్ఎస్ నాయకులు భయపెడితే భయపడేది లేదు : మంత్రి పొన్నం ప్రభాకర్

రాష్ట్రంలో వడ్డెర ఫెడరేషన్ ఏర్పాటుకు కృషి చేస్తా : మంత్రి పొన్నం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.