ETV Bharat / state

మేడిగడ్డ దేవాలయం అప్పుడే బొందలగడ్డ ఎందుకు అయిందో కేసీఆర్ చెప్పాలి : పొంగులేటి - White Paper on Irrigation Dept

Minister Ponguleti Srinivas Reddy Questions Ex CM KCR : మేడిగడ్డ దేవాలయం అప్పుడే బొందలగడ్డ ఎందుకు అయిందో కేసీఆర్ చెప్పాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకు తానే రూపశిల్పి అని కేసీఆర్ ఎన్నోసార్లు చెప్పుకున్నారని గుర్తు చేశారు. భారీ ప్రాజెక్టుల రూపశిల్పి ఇప్పుడు సభకు వచ్చి ఎందుకు వివరణ ఇవ్వడంలేదని దుయ్యబట్టారు. నీటిపారుదల శాఖపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా శాసనసభలో జరిగిన చర్చలో ఆయన పాల్గొని మాట్లాడారు.

Minister Ponguleti Srinivas Reddy
Minister Ponguleti Srinivas Reddy Questions Ex CM KCR
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 17, 2024, 4:36 PM IST

Updated : Feb 17, 2024, 5:13 PM IST

మేడిగడ్డ దేవాలయం అప్పుడే బొందలగడ్డ ఎందుకు అయిందో కేసీఆర్ చెప్పాలి పొంగులేటి

Minister Ponguleti Srinivas Reddy Questions Ex CM KCR : మొన్నటి వరకు మేడిగడ్డను దేవాలయం అన్న కేసీఆర్, తాము మేడిగడ్డకు వెళ్లినప్పుడు మాత్రం బొందలగడ్డకు వెళ్లారని నల్గొండ సభలో అన్నారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) ధ్వజమెత్తారు. నీటిపారుదల శాఖపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా శాసనసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు.

Minister Ponguleti Comments on BRS Chief KCR : కొన్నేళ్ల క్రితం తెలంగాణకు అన్యాయం జరిగిందనే, ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం జరిగిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు తెలిపారు. సీతారామ ప్రాజెక్టు(Sitarama Project) కింద ఒక్క రిజర్వాయర్ కూడా ఏర్పాటు చేయలేదన్నారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ సభలో ఉండాలని ప్రభుత్వం కోరుకుంటోందని చెప్పారు. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకు తానే రూపశిల్పి అని కేసీఆర్ ఎన్నోసార్లు చెప్పుకున్నారని గుర్తు చేశారు. భారీ ప్రాజెక్టుల రూపశిల్పి ఇప్పుడు సభకు వచ్చి ఎందుకు వివరణ ఇవ్వడంలేదని దుయ్యబట్టారు. ప్రాజెక్టు తొందరగా కట్టాలనే ఆత్రుత తప్ప నాణ్యత గురించి పట్టించుకోలేదని విమర్శించారు.

అది శ్వేతపత్రం కాదు, ఫాల్స్‌ పేపర్‌ - గత ప్రభుత్వంపై బురద జల్లేందుకే : హరీశ్‌రావు

Madigadda Barrage Collapse : గోదావరి నుంచి నీరు ఎత్తిపోసి నీళ్లు ఇచ్చే వాడినని కేసీఆర్ నల్గొండలో అన్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గుర్తు చేశారు. మేడిగడ్డ కుంగిన తర్వాత కూడా కేసీఆర్ 45 రోజులు సీఎంగా ఉన్నారని తెలిపారు. కుంగిన మేడిగడ్డ ప్రాజెక్టులోని నీటిని ఎత్తిపోయకుండా మరి వృథాగా ఎందుకు వదిలారని అడిగారు. ఆత్రుతగా ప్రాజెక్టు కట్టకుండా నాణ్యంగా కట్టి ఉంటే లక్ష కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అయ్యేవి కాదు కదానని ఆవేదన వ్యక్తం చేశారు.

కాళేశ్వరం(Kaleshwaram Project)లోని మిగతా ప్రాజెక్టులలో కూడా సీపేజీ జరిగిందన్నారు. కళ్లముందే భారీ నష్టం కనిపిస్తుంటే కూడా బీఆర్​ఎస్ నేతలు తప్పును ఒప్పుకోవట్లేదని మంత్రి పొంగులేటి విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వం వలే తాము తొందరపడి పనులు చేపట్టి ప్రజలకు నష్టం చేయమని స్పష్టం చేశారు. సలహాలు ఇస్తానని చెప్పి మాజీ ముఖ్యమంత్రి సభకు రాకపోవడం దురదృష్టకరమని మంత్రి పొంగులేటి అన్నారు. తమ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు అవినీతి వెనక ఉన్నవారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

"మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో ఎందుకు ఉండాలని అధికారపార్టీ కోరుకుంటుందంటే, ప్రారంభం నుంచి చివరి వరకు ఈ ప్రాజెక్టులకు రూపశిల్పిని, డిజైన్​లు అన్ని తన మైండ్​లో ఉన్నాయని చెప్పారు. ఈ ప్రాజెక్టు డ్యామేజ్ జరిగిన తర్వాత అందుకు సంబంధించిన సలహా కూడా ఆయనే ఇవ్వాలి. ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టు ఓపెన్ అయిన రోజు కేసీఆర్ దేవాలయం లాంటి ప్రాజెక్టు అన్నారు. కానీ ఇప్పుడు తాము కుంగిన ప్రాజెక్టును చూడడానికి వెళితే వారికి పనిపాటు లేదు బొందలగడ్డకు వెళ్లారని అన్నారు. నాడు దేవాలయం, నేడు బొందలగడ్డ ఎలా అయిందో కేసీఆర్ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది." - పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి

''కాళేశ్వరం' అంత అవినీతి ఎప్పుడూ జరగలేదు - అందుకే వందేళ్ల ప్రాజెక్టు మూడేళ్లలోనే కుంగిపోయింది'

కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు కలంకం - పదేళ్లలో రాష్ట్రాన్ని దివాలా తీయించారు : సీఎం రేవంత్‌రెడ్డి

Last Updated : Feb 17, 2024, 5:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.