ETV Bharat / state

రుణమాఫీ అంశంలో బీఆర్ఎస్​ నాయకులు రైతులను రెచ్చగొడుతున్నారు : మంత్రి పొంగులేటి - Minister Ponguleti Fires On BRS - MINISTER PONGULETI FIRES ON BRS

Minister Ponguleti Fires On BRS : రుణమాఫీ ద్వారా రూ.19 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని, వివిధ కారణాలతో ఆగిన మొత్తాన్ని త్వరలోనే లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. హనుమకొండ జిల్లా పరకాలలో పర్యటించిన ఆయన, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్​పై విమర్శలు గుప్పించారు.

Minister Ponguleti Fires On BRS
Minister Ponguleti Fires On BRS (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 18, 2024, 2:49 PM IST

Minister Ponguleti Fires On BRS : అభివృద్ధి, సంక్షేమమే రెండు కళ్లుగా కాంగ్రెస్ సర్కార్ పని చేస్తోందని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ధనిక రాష్ట్రం అని గత పాలకుల్లా గొప్పలు చెప్పడం కాకుండా, ప్రాధాన్యతాపరంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన అప్పుల భారం ఉన్నా, ప్రజలకిచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నట్లు తెలిపారు.

రైతులను బీఆర్ఎస్​ నేతలు రెచ్చగొడుతున్నారు : రుణమాఫీ ద్వారా రూ.19 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని, వివిధ కారణాలతో ఆగిన మొత్తాన్ని త్వరలోనే జమ చేయనున్నట్లు పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి తెలిపారు. రుణమాఫీ అంశంలో బీఆర్ఎస్​ నేతలు రైతులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నీళ్లిచ్చామని గత ప్రభుత్వం గొప్పలు చెప్పిందని, కానీ 50 శాతం కూడా నీళ్లివ్వలేదని సర్వే ద్వారా తేలిందని చెప్పారు. హనుమకొండ జిల్లా పరకాలలో పర్యటించిన మంత్రి, రూ.5 కోట్లతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవన నిర్మాణ పనులకు, రూ.11.75 కోట్లతో అమృత్ 2.0 మంచి నీటి సరఫరా పథకం పనులకు శంకుస్థాపన చేశారు.

" రైతుల ఖాతాల్లో రుణమాఫీ పథకం ద్వారా ఇప్పటికే సుమారు రూ.19 వేల కోట్లు జమచేశాం. మిగిలిన రూ.12 వేల కోట్లను జమ చేస్తాం. అన్నదాతలు సహనాన్ని కోల్పోవద్దు. ఇచ్చిన మాట నెరవేర్చేది ఇందిరమ్మ ప్రభుత్వం. ఏదైనా కారణాల వల్ల రైతులకు రుణమాఫీ అందకపోతే వారికి కూడా ఇస్తామని హామీ ఇస్తున్నాం. ఇచ్చిన మాట ప్రకారం జాబ్​ క్యాలెండర్​ కూడా విడుదల చేశాం" - పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మంత్రి

ఈ కార్యక్రమంలో ఎంపీ కడియం కావ్య, పరకాల, భూపాలపల్లి ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్ రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, 'కుడా' ఛైర్మన్ ఇనగాల వెంకట రామిరెడ్డి హనుమకొండ, వరంగల్ జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి శ్రీనివాస్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మున్సిపాలిటీ భవనంలో నియోజకవర్గ అభివృద్ధి పనులపై అధికారులతోనూ, ప్రజా ప్రతినిధులతోనూ మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.

'రెవెన్యూశాఖలో అవినీతి జరిగితే సహించేది లేదు - ధరణి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఓకే' - Minister Ponguleti On Revenue Dept

గత ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించింది : మంత్రి పొంగులేటి - Minister Ponguleti Fires On BRS

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.