ETV Bharat / state

జీహెచ్​ఎంసీలో 4 మేయర్ స్థానాలను పరిశీలిస్తున్నాం : మంత్రి కోమటిరెడ్డి - Minister Komatireddy On GHMC Divide

జీహెచ్​ఎంసీ విభజనపై మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు - జనాభా ప్రాతిపదికన విభజించి ఎన్నికలకు వెళ్లనున్నట్లు వెల్లడి

author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

Updated : 2 hours ago

Minister Komatireddy Comments On  BRS
Minister Komatireddy On Musi River Development (ETV Bharat)

Minister Komatireddy On GHMC Divide : హైదరాబాద్ మహానగర జనాభా కోటిన్నర దాటిందని జీహెచ్ఎంసీని నాలుగు మేయర్లుగా విభజించి ఎన్నికలకు వెళ్లే అంశం పరిశీలనలో ఉందని రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. అసోచామ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమిట్​లో కోమటిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రీజినల్ రింగ్ రోడ్డుతో హైదరాబాద్ మహానగర రూపు రేఖలు మారిపోతాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.

దాదాపు 30వేల కోట్ల రూపాయలతో చేపట్టే ఈ ప్రాజెక్టుకు కేంద్రం సాయం అందిస్తోందని ఆయన పేర్కొన్నారు. మరో రెండు నెలల్లో రీజినల్ రింగు రోడ్డుకు టెండర్లు పిలుస్తామని తెలిపారు. మూసీ సుందరీకరణకు ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసిందని, దీనివల్ల రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ జిల్లావాసులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. మూసీ కంటే విషపూరితమైన సబర్మతిని ప్రక్షాళన చేసి మంచినీరు ప్రవహించే విధంగా మార్చారన్నారు.

ఎన్ని ఆటంకాలు ఎదురైనా మూసీ ప్రక్షాళన పూర్తి చేస్తాం : ఎన్నో పరిశ్రమల నుంచి రసాయనాలతో పాటు మురికి నీరంతా మూసీలోకే వస్తోందని, ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఎన్ని ఆటంకాలు ఎదురైనా మూసీ సుందరీకరణ పూర్తి చేసి తీరుతామని కోమటిరెడ్డి తెలిపారు. హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలోనే మూసీ నది ఆక్రమణలపై మార్కింగ్ చేశారని, తాము మరింత ముందుకు వెళ్తుంటే ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ నేతలు రాజకీయ లబ్ధి కోసం రాద్దాంతం చేస్తున్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. అర్బన్ స్ట్రాటజీస్, పాలసీస్, రెగ్యులేషన్ అంశాలపై పలువురు వక్తలు ప్రసంగించారు.

"మా మంత్రివర్గం, ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి కలిసి మూసీనది ప్రక్షాళనకు కీలక నిర్ణయం తీసుకున్నాం. నమామి గంగ పేరిట సబర్మతి రివర్​ను వాళ్లు క్లీన్​ చేసినప్పుడు మనమెందుకు మూసీ సుందరీకరణ చేపట్టకూడదని ఆలోచన చేశాం. ఇదే అంశంపై గతంలో బీఆర్​ఎస్​ మార్కింగ్ కూడా చేశారు. కానీ ఇప్పుడు దానిపై రాద్దాంతం చేసి రాజకీయంగా ఎదగాలని చూస్తున్నారు."- కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాష్ట్ర మంత్రి

2017లో మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేష‌న్ ఏర్పాటు చేసిందెవరు? : మంత్రి శ్రీధర్​ బాబు - Minister Sridhar Babu Fires On BRS

'మూసీ ప్రక్షాళనతో కాంగ్రెస్​కు మంచి పేరు రాకూడదనే - బీఆర్ఎస్ నేతల తప్పుడు ప్రచారం' - Chamala Kiran Kumar on Musi River

Last Updated : 2 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.