ETV Bharat / state

17 బ్లాక్ స్పాట్స్‌లలో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు - మంత్రి కోమటిరెడ్డి రివ్యూ - Minister Komatireddy on Road Safety - MINISTER KOMATIREDDY ON ROAD SAFETY

Minister Komatireddy Review of Road Safety Measures : హైదరాబాద్‌‌-విజయవాడ జాతీయ రహదారిపై 17 బ్లాక్‌ స్పాట్స్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. బ్లాక్‌ స్పాట్స్‌ ప్రాంతాలు, ఆయా ప్రాంతాల్లో పాటించాల్సిన రహదారి భద్రతా చర్యలు గురించి సమీక్ష నిర్వహించారు. పలు ప్రాంతాలను గుర్తించి, ఈ ప్రాంతాల్లో అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్టు గుర్తించిన రహదారుల శాఖ ముఖ్యంగా సైన్ బోర్డ్స్, హెవీ స్పీడ్ నిర్మూలన, కొన్నిచోట్ల ఆరు లేన్లుగా రోడ్డు నిర్మాణం చేయడం వంటి చర్యలతో బ్లాక్ స్పాట్స్ ప్రాంతాల్లో ప్రమాదాలను నివారించవచ్చని, ఆయా ప్రాంతాల్లో పాటించాల్సిన సేఫ్టీ మెజర్స్​ను వివరించారు.

Minister Komatireddy Venkatreddy Press meet
Minister Komatireddy Review of Road Safety Measures (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 17, 2024, 3:21 PM IST

Updated : May 17, 2024, 4:01 PM IST

Minister Komatireddy Conducted Review of Road Safety Measures : హైదరాబాద్ నుంచి విజయవాడ రహదారిలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు అవసరమైన చర్యలను వెంటనే చేపట్టాలని రాష్ట్ర ఆర్అండ్​బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో రాష్ట్ర, జాతీయ రహదారుల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే ఎన్​హెచ్ 65 రహదారిపై తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు కారణాలను సమావేశంలో చర్చించారు.

Black Spots Identified Locations : హైవేలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్న 17 బ్లాక్ స్పాట్ ప్రాంతాలను అధికారులు వివరించారు. అవి వరుసగా చౌటుప్పల్, పెదకాపర్తి, చిట్యాల, కట్టంగూర్, ఇనుపాముల, టేకుమట్ల, జనగామ క్రాస్ రోడ్స్, ఈనాడు జంక్షన్, దురాజ్ పల్లి జంక్షన్, ముకుందాపురం, అకుపాముల, కోమరబండ క్రాస్ రోడ్స్, కటకం గూడెం, మేళ్ల చెరువు, శ్రీరంగాపురం, రామాపురం క్రాస్ రోడ్స్, నవాబ్​పేట జంక్షన్ వద్ద తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలిపారు.

రహదారి భద్రతా చర్యల గురించి సమీక్ష నిర్వహించిన మంత్రి : బ్లాక్ స్పాట్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సైన్ బోర్డులు, వేగ నియంత్రణ వంటి చర్యలను వెంటనే చేపట్టాలని ఆదేశించారు. రహదారిపై కొన్నిచోట్ల ఆరులేన్ల నిర్మాణం, జంక్షన్ల అభివృద్ధి, అండర్ పాస్​లు, సర్వీసు రోడ్ల నిర్మాణం వంటి ప్రణాళికలు చేయాలన్నారు. సమీక్షా సమావేశంలో ఆర్అండ్​బీ ఈఎన్సీ గణపతిరెడ్డి, జాతీయ రహదాహదారుల ప్రాంతీయ అధికారి రజాక్, తదితరులు పాల్గొన్నారు.

Rules Followed to Prevent Road Accidents : రోడ్డు సేఫ్టీలో సురక్షిత మౌలిక సదుపాయాలు, వేగ పరిమితులు, పాదచారులు, సైకిల్‌ చోదకుల అనుకూల విధానాల ద్వారా స్వీడన్‌ సున్నా ప్రమాదాల స్థాయిని సాధించింది. భారత్‌ కూడా రహదారి ప్రమాదాలను 2025నాటికి 50%కి, 2030 నాటికి డెత్​ రేటును సున్నా స్థాయికి చేర్చాలని లక్ష్యం నిర్దేశించించుకుంది. అయితే ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా వాహనదారుల స్వీయ జాగ్రత్తలు, స్పీడ్ కంట్రోల్ ప్రమాదాల నివారణలో కీలకం.

ముఖ్యంగా పిల్లలు వాహనాలు నడపకుండా తల్లితండ్రులు జాగ్రత్త వహించాలి. డ్రైవింగ్ చేసేది ఎవరైనా సరే, మద్యం మత్తులో వాహనం నడప కూడదు. యాక్సిడెంట్ జరిగితే కుటుంబం రోడ్డున పడుతుంది అన్న స్పృహ చాలా కీలకం. వాహనం నడిపేటప్పుడు మొబైల్ మాట్లాడకుండా ఉండడం, శిరస్త్రానం, సీటు బెల్టు ధరించడం వంటి చిన్న జాగ్రత్తలతో విలువైన ప్రాణాలు కాపాడుకోవచ్చు. ప్రమాదాలు తగ్గించి రక్తపుధారలు పారకుండా కట్టడి చేయవచ్చు.

ప్రమాద ఘంటికలు మోగిస్తున్న హైవేలపై ఆగి ఉన్న వాహనాలు - వరుస ఘటనలతో అప్రమత్తమైన పోలీసులు - Telangana Road Accidents

'వాహనాలు మాట్లాడుకుంటాయ్'- రోడ్డు ప్రమాదాలు తగ్గించేలా 'ఐఐటీ' సాంకేతికత

Last Updated : May 17, 2024, 4:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.